Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎన్టీఆర్ తన పిల్లలను ఎలా పెంచుతున్నారో తెలుసా? నిజంగా మెంచుకోవాల్సిందే!
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఇటీవల ఆయన నటించిన దేవర సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్.. తన పిల్లలను ఎలా పెంచుతారు, వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పారు. అవేంటో ఓసారి చూద్దాం రండి.
నాన్నలాగే నా పిల్లలను పెంచుతున్నా: ఎన్టీఆర్
తన నాన్న తనను ఎలా పెంచేవారో అలానే తాను కూడా తన పిల్లలను పెంచుతున్నానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. తన తండ్రి హరికృష్ణ తనపై ఏనాడూ ఒత్తిడి చేయలేదని, తాను కూడా తన పిల్లలపై ఒత్తిడి చేయాలని అనుకోవట్లేదని తెలిపారు. తనను కేవలం సినిమాలకే కాకుండా.. తనకు నచ్చిన రంగాల్లో రాణించేందుకు తన తండ్రి సహకారం అందించారని, తాను తన పిల్లలను వారికిష్టమైన రంగాల్లో రాణించేందుకు సహకరిస్తానన్నాడు

ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే?:
పిల్లల పెంపకంలో తాను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఎన్టీఆర్ తెలిపారు. పిల్లలకు ఎప్పుడూ ఒత్తిడికి గురి చేయొద్దని సూచించారు. వారు ఆలోచనలను వినాలని, వారికి నచ్చిన బెస్ట్ రంగాల్లో రాణించేందుకు వారికి తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. వారు వారు వారి సొంత నిర్ణయాలు తీసుకునేలా పిల్లలను పెంచాలని, అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఎదురైనా వారే సొంతంగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా పిల్లలు పెరుగుతారని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ పిల్లలు సినిమాల్లోకి వస్తారా?
ప్రస్తుతం తన పిల్లలు సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారని, కానీ వారు ఎదిగేకొద్దీ మారుతున్న కాలానికనుగుణంగా వారి అభిరుచుల్లో కూడా మార్పు వచ్చే అవకాశముంటుందని చెప్పారు. వాళ్లకు ఏది మంచి అనిపిస్తే, వాళ్లకు ఏది చేయాలనిపిస్తే ఆయా రంగాల్లో వాళ్ళను నడిపించేందుకు తాను కృషి చేస్తానని, అలానే వారికి సహకారం అందిస్తానన్నారు.
మన పిల్లలను కూడా అలానే పెంచాలా?
ఎన్టీఆర్ తన పిల్లలను పెంచుతున్నట్లే.. మిగిలిన తల్లిదండ్రులు కూడా వారిని అలానే పెంచాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి చెడులు నేర్పించాలి. సమాజంలో ఎవరిని ఏ విధంగా గౌరవించాలి, సమయానుసందార్భంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలనేది పాఠంగా చెప్పాలి.
పిల్లలకు చిప్పటి నుంచి మంచి వైపు నడిపిస్తూ.. చిన్నప్పటి నుంచే వారు మంచివైనా, సొంత నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. సమస్యలు ఎదురైనప్పుడు, వాటిని తట్టుకుని నిలబడేలా వారికి ప్రోత్సాహం, మనోధైర్యం అందించాలి.
అన్నిటికంటే ముఖ్యమైనది, వారి ఇస్తా ఇష్టాలను తెలుసుకోవాలి. వారికి నచ్చిన రంగాల్లో రాణించేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తే.. పిల్లలు తమ తమ రంగాల్లో అత్యుత్తమంగా రాణించేందుకు వీలుంటుంది.



Click it and Unblock the Notifications