For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధునిక పరికరాల అద్భుతం!

By B N Sharma
|

Breast
ఆధునిక మహిళా ఉద్యోగులు డెలివరీ తర్వాత ఉద్యోగానికి వెళుతున్నప్పటికి తమ బిడ్డకు పాలు పట్టటంలో నేడు ఎటువంటి సమస్యా లేదు. వీరు తమ పాలను పిండి నిల్వ చేసి బిడ్డకు పట్టేయవచ్చు. అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి.

ఈ పద్ధతి పాటించేటపుడు బిడ్డకు బాటిల్ తో పాలు తాగటం అలవాటు చేయాలి. పాలను స్తనాలనుండి పిండిన వెంటనే గది టెంపరేచర్ లో 4 నుండి 6 గంటలపాటు మాత్రమే నిల్వ చేయాలి. బేబీ ఆ లోపు తాగితే తప్ప వాటిని డీప్ ఫ్రీజర్ లో పెట్టటం మంచిది. డీప్ ఫ్రీజర్ లో నిల్వ వుంచిన పాలు వైద్యుల సంప్రదింపు మేరకు కనీసం మూడు నెలలవరకు బేబీకి పట్టవచ్చు. సాధారణ రిఫ్రిజిరేటర్ లో పెడితే మూడు రోజులనుండి ఒక వారం వరకు నిలువచేయవచ్చు. ఇందుకుగాను వచ్చే ప్రత్యేక బాటిల్స్ లో నిలువ చేయండి. బేబీ 200 మి.లి. తాగుతుందనుకుంటే అంత మాత్రమే ఒక బాటిల్ లో నిలువ చేయండి. బాటిల్స్ సంఖ్య ఎక్కువగా వుండాలి.

పాలను వేడిచేయటానికి నులి వెచ్చని నీటిని మాత్రమే కలపాలి. ఫ్రిజ్ లో పెట్టిన తల్లిపాలు కొద్దిగా రంగు మారినప్పటికి ఉపయోగించవచ్చు. ఉద్యోగం చేసే తల్లులకు తమ పాలను నిలువచేసి బిడ్డకు పట్టటం తేలికైనప్పటికి ఈపద్ధతిలో మీ విచక్షణ ఉపయోగించండి.

English summary

Breast Milk Storage For Working Moms! | ఆధునిక పరికరాల అద్భుతం!

Breast milk may look brownish or slightly discolored after storage in the freezer but there is nothing abnormal about it. There might also be some sedimentation as the fats separate, just shake the bottle well before feeding.
Story first published:Tuesday, November 1, 2011, 16:09 [IST]
Desktop Bottom Promotion