Just In
- 37 min ago చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- 48 min ago తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
- 1 hr ago ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- 3 hrs ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
బిడ్డకు పాలిచ్చే తల్లులు తినకూడనివి!
1. ఆవుపాలు - దీనివలన ప్రయోజనాలు అధికమే. కాని అలర్జీ కలిగిస్తాయి. గర్భవతిగా వున్నపుడు, డెలివరీ తర్వాత మహిళలో వ్యాధినిరోధకత తగ్గుతుంది. కనుక అలర్జీలు త్వరగా వస్తాయి. ఇవి తల్లిపాల ద్వారా బేబీకి కూడా సోకే అవకాశం వుంది. కనుక ఆవుపాలు మానండి.
2. మసాలాలు - మసాలాలు వేసిన ఆహారం గ్యాస్ కలిగిస్తుంది. ఇది బేబీకి బదిలీ కాగలదు. కనుక మసాలాలు - దాల్చిన చెక్క, వెల్లుల్లి, మిరియం మొదలైనవి వదలండి.
3. సువాసనలనిచ్చే కొత్తిమీర, అల్లం, దాల్చిన చెక్క మొదలైనవి వాడకండి. ఇవి తల్లిపాల రుచిని మార్చి బేబీకి చెడు రుచినిస్తాయి. తాగటానికి బేబీ నిరాకరిస్తుంది.
4. నిమ్మ జాతి పండ్లు వదలండి. వీటి కారణంగా గ్యాస్ వచ్చే ప్రమాదం వుంది. దీనివలన పొట్ట గడబిడే కాక బేబీకి చర్మ అలర్జీ వచ్చే అవకాశం వుంది.
5. ఆల్కహాల్ మరియు టొబాకో - ఈ రెండూ పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. కనుక మానటం మంచిది.
తల్లి బిడ్డకు పాలు పట్టేటపుడు ఈ ఆహార పదార్ధాలు ఉపయోగించకుండా వుంటే తాను ఆరోగ్యంగా వుండటమే కాక బిడ్డకు కూడా మంచి ఆరోగ్యాన్నివ్వగలదు. అందరికి అన్ని ఆహారాలు సరిపడవు కనుక ఈ అంశంలో ఒక వైద్యుడి సలహా కూడా తీసుకోండి.