Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
పాలు పట్టే మహిళలు ఏ రకం బ్రా వాడాలి?

మీరు ఎంపిక చేసుకునే బ్రాసరీ ఎక్కువ లూజు లేదా ఎక్కువ బిగువు వుండరాదు. బ్రా టైట్ గా వుంటే పాలు ఆగిపోయే ప్రమాదం వుంది. లూజుగా వుంటే అది బ్రెస్టు సైజును షేపును చెడగొడుతుంది. కనుక స్తనాలకు సరిగ్గా సరిపోయే బ్రా ఎంపిక చేయండి. ప్రెగ్నెన్సీ తర్వాత కాటన్ బ్రాలు బాగుంటాయి. మంచి గాలి, చమట ఆరటం పాలు వెంటనే పట్టేందుకు సౌకర్యంగాను వుంటాయి. కప్ లో లైనింగ్ వుంటే బ్రా మరింత సుఖంగా వుంటుంది. పాలు అధికంగా వుంటే బ్రాలో నర్సింగ్ ప్యాడ్ లు వుంచండి. పాలను అది పీల్చేస్తుంది. పాలిండ్లు తేలికగా బయటకు వచ్చే పద్ధతిలో వున్న బ్రాసరీ కొనండి. క్రింద వైర్లు వున్న బ్రాలు సౌకర్యంగానే వుంటాయి. స్తనాలను నిలిపి మంచి షేపులో వుంచుతాయి. అయితే టైట్ గా వుంటే పాల సంచులు మూసుకునే ప్రమాదం వుంది. ఎప్పుడైనా వేసుకోవచ్చు. నొప్పి అనిపిస్తే మానేయండి. రాత్రి వేళ వైరు బ్రాలు వేయవద్దు. మెత్తటి కప్పులున్న నర్సింగ్ బ్రాలు ఎంపిక చేసుకుంటే నొప్పులు కల స్తనాలకు హాయి అనిపిస్తుంది.
బ్రాసరీలలో రకాలు -
వెంటనే తెరిచేవి...తల్లి తన బిడ్డకు పాలను వెంటనే రహస్యంగా పట్టటానికి అనుకూలిస్తాయి. వీటికే కప్పు ఏర్పాటు కూడా వుంటుంది. పబ్లిక్ స్ధలాలలో తల్లి బిడ్డకు పాలనివ్వటానికి అతి తేలిక.
డ్రాప్ కప్ బ్రాలు....ఇది కూడా సౌకర్యమే, వెంటనే తెరువవచ్చు. ముందుభాగంలోని స్ట్రాపులకు హుక్ వుంటుంది. స్ట్రాపులు వెడల్పుగా వుండేవి అయితే స్తనాలకు మంచి సపోర్టు నిస్తాయి.
జిప్ బ్రాలు.....ఇవి కూడా వెంటనే తెరువ వచ్చు బేబీతో బయటకు వెళ్ళినపుడు బహిరంగ స్తలాలలో బీబీకి పాలు ఇవ్వాలంటే జిప్ వున్న బ్రాలు మంచి ఎంపిక కాగలదు.
ఈ మార్గదర్శకతలు ఆచరించి సరి అయిన బ్రా ఎంపిక చేసుకోండి.



Click it and Unblock the Notifications