For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లిపాలు త్వరగా ఆపేస్తే...?!

By B N Sharma
|

Breastfeeding
అమెరికాలో తల్లులు చాలామంది తమ పాలను బిడ్డకు ఇస్తున్నప్పటికి అతి త్వరగా వాటిని బిడ్డకు నిలిపేస్తున్నారని ఒక తాజా పరిశోధన వెల్లడించింది. తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమైనవి. బిడ్డకు తేలికగా జీర్ణం అయ్యే అన్ని పోషకాలు వాటిలో వుంటాయి. బిడ్డకు రోగ నిరోధక శక్తిని ఇవ్వటమే కాక, తల్లి కూడా ఆరోగ్యాన్ని పొందేలా చేస్తాయి.

అమెరికా ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రసవించే వారిలో 50 శాతం మంది తల్లిపాలు బిడ్డలకివ్వాలని వుండగా, 77 శాతం మంది తల్లిపాలు ఇవ్వటమైతే మొదలుపెడుతున్నారు కానీ బిడ్డకు ఆరు నెలల వయసు లోపే 36 శాతం మంది వాటిని నిలుపుతున్నారని పరిశోధన చెపుతోంది. అయితే, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పేడియాట్రిషియన్స్ సంస్ధ బిడ్డలకు పూర్తిగా ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలనిసిఫార్సు చేస్తోంది. ప్రభుత్వ చేసే ప్రచారం తల్లులు మొదలు పెట్టే వరకే పనిచేస్తోందని తర్వాత దానిని కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టటంలేదని వారు తెలిపారు.

బిడ్డలు అనారోగ్యానికి గురై మరణించిన వారిలో చాలామంది తల్లిపాలు త్వరగా నిలిపివేసిన కారణంగానే మరణాలు సంభవించినట్లుగా కూడా ఈ సర్వే వెల్లడించింది.

English summary

Most Moms Quit Breastfeeding Early | తల్లిపాలు త్వరగా ఆపేస్తే...?!

Breast milk is considered best for babies, because the fluid meets a baby's nutritional needs, is easily digested, and contains antibodies that prevent infections and other diseases, while also promoting the mother's health.
Story first published:Monday, October 24, 2011, 16:19 [IST]
Desktop Bottom Promotion