Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డెలివరీ తర్వాత మహిళా ఫ్యాషన్?

అందమైన, ఆకర్షణీయమైన రంగులు ఎంపిక చేయండి. అవి మీ మనోభావాలను చక్కగా వుంచుతాయి. రంగుల పూలు వున్నగుడ్డలైతే ఇంకా బాగుంటుంది. లైట్ కలర్ దుస్తులు వాడవద్దు. బేబీకి పాలు, ఆహారం ఇచ్చేటపుడు మరకలయ్యే ప్రమాదముంది. బ్యాగీ లేదా లూజుగా వున్న టి షర్టులు సాగిన పొట్టను వీలైనంత వరకు కవర్ చేసే అవకాశం వుంది. లూజుగా వుండే పేంట్లు కూడా మంచిదే. నడుము చిన్నదిగా వుండి షేప్ రాలేదనుకుంటే ఒక బెల్ట్ పెట్టండి. స్టైలిష్ గా కూడా వుంటుంది. మోకాళ్ళ వరకు వున్న టీ షర్టు డెలివరీ తర్వాత చాలా బాగుంటుంది. ఇంకా అందంగా కనపడాలంటే మెడకు ఒక రంగు గుడ్డ చుట్టేయండి. వేసే షర్టులకు బటన్లు వుండేలా చూడండి. బిడ్డకు పాలు పట్టటానికి అనుకూలం. బ్రా వంటివి కొంతకాలం ఆపుకుంటే సౌకర్యంగానే వుంటుంది. టీ షర్టులు లేదా పైన వేసే టాప్స్ 'వి' నెక్ తో వుంటే ఆకర్షణీయం.
ఇక కాళ్ళకు తేలికైన పలచని చెప్పులు లేదా స్లిప్పర్స్ వేయండి. బేబీని చేతిలో వుంచుకున్నా తేలికగా నడిచే చెప్పులై వుండాలి. ప్రస్తుతం పాలు పట్టే తల్లులకు అవసరమైన లో దుస్తులు వస్తున్నాయి. అవసరమనుకుంటే వీటిని ధరిస్తే మీరు మీ పూర్వపు సైజు శరీరాన్ని పొందటం కూడా తేలిక కాగలదు.
ఈ పద్ధతులు పాటించి ఒక బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఎంతో స్టైలిష్ గా వుండే ఆనందాన్ని పొందండి.



Click it and Unblock the Notifications