For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లి కావడం ఆనందమే... కాని...!

By B N Sharma
|

Postnatal
మహిళకు తల్లి కావడం ఆనందమే. కాని బిడ్డ పుట్టిన తర్వాత తన పొట్టకు ఏర్పడిన కొవ్వు ఎలా తగ్గించాలా అని ప్రతి తల్లి ఆందోళన చెందుతుంది. అతి త్వరగా కొవ్వు తగ్గించేసుకోవడం తన పాలపై కూడా ప్రభావం చూపుతుంది. గర్భధారణ తర్వాత బరువెక్కడం సాధారణమే కాదు. అవసరం కూడాను. తల్లి శరీరం బిడ్డకు అవసరమైన ఆహారాన్ని అందించాలంటే గర్భవతి సమయంలో లావుగానే వుండాలి. బేబీ పుట్టగానే కొంత బరువు దానంతటదే తగ్గుతుంది.

ఇక పుట్టిన బిడ్డపై తీసుకునే జాగ్రత్తలతోను, పాలు పట్టటంతోను మరికొంత బరువు తగ్గుతుంది. కాని కొంతమందికి కాన్పు తర్వాత బరువు త్వరగా తగ్గదు. బిడ్డ పుట్టిన ఆరు నెలలలో సాధారణ స్ధితికి రాకుంటే, మహిళ బరువు తగ్గటం కష్టమవుతుంది. మహిళ కాన్పు తర్వాత ఆహారం పట్ల శ్రధ్ధ వహించాలి. కొద్దిపాటి వ్యాయామం కూడా చేయాలి.

వ్యాయామం లేకున్నా నియమిత ఆహారాలు తీసుకుంటే బరువు పెరగరని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ స్టడీని జర్మన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ హెల్త్ కేర్ సంస్ధ నిర్వహించింది.

English summary

Pressure Of New Mums To Shed Flab! | తల్లి కావడం ఆనందమే... కాని...!

Exercise is important when people are overweight, but after pregnancy, a lot of exercise does not necessarily help a great deal. The evidence shows that a balanced diet helps “with or without extra exercise".
Story first published:Monday, October 31, 2011, 16:43 [IST]
Desktop Bottom Promotion