Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
సిజేరియన్ అయితే రెండో బిడ్డ ఎపుడు కలగాలి?

గతంలో ఒక సారి సిజేరియన్ అయితే, రెండో బిడ్డ సహజంగా యోని ద్వారా పుట్టే అవకాశం వుండదని మరోమారు సిజేరియన్ చేయాలనే భావన వుండేది. కాని ఇది సరి కాదని అనేక కేసుల్లో నిరూపించారు. ఏదేని ప్రత్యేక కారణాలు లేదా అవసరాలు వుంటే తప్ప సిజేరియన్ చేయాల్సిన అవసరం వుండదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సిజేరియన్ ఒక సారి అయిన మహిళ రెండో సిజేరియన్ కు ఆమె శరీరం ఎంత వరకుసహకరిస్తుందనేది కూడా పరిశీలించాలి. ఆమెకుగల గత అనుభవాలు ఆమెను భయపెట్టేలా చేసి రెండవ బిడ్డ జననానికి సిజేరియన్ కు సైతం ఆమె అంగీకరించకపోవచ్చు.
ఒక సారి సిజేరియన్ అయిన మహిళకు రెండవ కాన్పు సమయంలో మహిళ, సంబంధిత వైద్యుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలోని మచ్చ వద్ద ఏ మాత్రం మరోమారు చిరుగుపడ్డా అది ఆమెకు హాని కాగలదు. కనుక సంబంధిత వైద్యుడి ద్వారా ఆమె తనకు అనుకూలమైన డెలివరీ ఏదో అనేదానికి తగిన సలహా పొందాలి. రెండో గర్భం ప్లాన్ చేసే ముందు గత డెలివరీ రికార్డులను పరిశీలించాలి. మొదటి గర్భం సిజేరియన్ అయినప్పటికి వైద్యుడు చెప్పిన తర్వాత రెండో గర్భం ధరించటానికి మహిళ ఏ మాత్రం భయపడనవసరం లేదు.



Click it and Unblock the Notifications