For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిబిడ్డకు పబ్లిక్ లో పాలు పట్టేయడం ఎలా?

By B N Sharma
|

Tips For Breastfeeding In Public
మీ పాలు తాగే బాబు గుక్కపట్టి ఆకలై ఏడుస్తున్నాడా? తల్లులకు ఇది ఒక అగ్నిపరీక్షే! మరి దీనికి పరిష్కారం? బేబీ లేకుండా ప్రయాణించడం.....అది సాధ్యంకాదు, కోరదగినది అంతకన్నాకాదు. పాలు ఇచ్చే పిల్లలుంటే తల్లులు వారితో కలసి ప్రయాణించాల్సిందే. పనికి గాని లేదా కిరాణం షాపుకు గాని పిల్లాడిని తీసుకు వెళ్ళల్సిందే. మన సమాజంలో వింత అయిన విషయమేమంటే, పసి బిడ్డకు పాలు ఇస్తున్న తల్లిని కూడా కనుబొమ్మలు ఎగరేసి చూసే వింత మనస్తత్వాలు. ఇక మనం ఆచరించాల్సిందల్లా, బిడ్డ ఆకలి తీర్చటం, అదే సమయంలో మన వ్యక్తిగత ఇమేజ్ పోకుండా చూసుకోడం.

అత్యవసరమైన ఈ చర్యలో కొన్ని చిట్కాలు ఇస్తున్నాం, ఆచరించి చూడండి:
మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక దుప్పటా లేదా స్కార్ఫ్ వెంట తీసుకెళ్ళండి. పిల్లాడికి పాలు పట్టేటపుడు నిండుగా కప్పుకొని పట్టేయండి. కాని చాలామంది తల్లులు ఈ దుప్పటాను సాధారణంగా మరచిపోతూంటారు. మరి ఆ ప్రదేశంలో నిలబడే వారు అదో చోద్యంగా చూస్తూనే వుంటారు. తల్లిపాలు పట్టడం సహజమే కాని మిమ్మల్ని నిండుగా కప్పుకోవద్దని ఎవరూ చెప్పలేదే! ముందు బటన్లు వున్న జాకెట్లు లేదా షర్టులు ధరించండి. టి. షర్టులు పాలు పట్టటానికి అసలు పనికిరావు. ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికి ఈ జాగ్రత్త మీరు మీ శరీరం కొరకు తీసుకోవల్సిందే.

పాలు పట్టే తల్లులు వీలైనంత వరకు చీర కట్టుకోవడం మంచిది. సౌకర్యంగాను వుంటుంది. దోబూచులాడే మగాళ్ళ కళ్ళ నుండి రక్షణ గానను వుంటుంది. కట్టే చీరలు నైలాను చీరలవంటివి కట్ట వద్దు. శరీరం అతి తక్కువగా కనపడే పొజిషన్ లో కూర్చుని పాలు పట్టండి. బేబీని మీ చేతులలో పట్టుకొని మీరు ఏ పక్క భాగంలో పడతారో ఆ పక్కకు తిరిగి పాలు పట్టండి. పబ్లిక్ కళ్లు వెంటనే పడకుండా వుంటాయి.

నేటి రోజులలో షాపింగ్ కాంప్లెక్స్ లు లేదా రెస్టరెంట్లు ఫీడింగ్ గదులు ఏర్పరుస్తూనే వున్నాయి. ఇవి సాధారణంగా టాయ్ లెట్లు లేదా రెస్ట్ రూమ్ ల పక్కన వుంటున్నాయి. అక్కడ వుండే వారిని అడిగితే చెపుతారు. ఫీడింగ్ రూమ్ లేకుంటే రెస్ట్ రూమ్ కనుక పరిశుభ్రంగా వుంటే అక్కడైనా సరే మీరు బిడ్డకు పాలను స్వేచ్ఛగా పట్టవచ్చు.

మీరు కనుక బేబీతో పాటు రైలులో ప్రయాణిస్తుంటే మీ బెర్తుపైనే బేబీని పడుకోబెట్టి పట్టవచ్చు. ఎయిర్ ప్రయాణంలో కూడా అతి తక్కువగా కనపడే పొజిషన్ లో బిడ్డకు పాలు ఇవ్వండి. లేదంటే అక్కడ వున్న ఎయిర్ హోస్టెస్ లను కోరితే, వారి ప్రయివేటు స్ధలంలో కర్టెన్లు జరిపి ఏర్పాటు చేస్తారు.

English summary

Tips For Breastfeeding In Public | పసిబిడ్డకు పబ్లిక్ లో పాలు పట్టేయడం ఎలా?

Always choose a breastfeeding position where in the least amount of your skin shows. The best position to breastfeed in public is the cradle position. Cradle the baby in your arms and hold it on the side of the breast from which you are feeding. Doing this will help you place your baby in a way shielding you from public glare.
Story first published:Tuesday, September 27, 2011, 9:48 [IST]
Desktop Bottom Promotion