Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మహిళలలో కాన్పుల నొప్పులను తగ్గించటానికి 9 మార్గాలు!

గర్భంలో వున్న బేబీని కిందకు తోసివేసేటపుడు యుటిరస్ చేసే సంకోచ వ్యాకోచాల కారణంగా డెలివరీ నొప్పులు కలుగుతాయి. పొట్ట, జనన భాగాలలో నొప్పి అధికంగా వుంటుంది. కొన్ని కేసులలో రోజుల తరబడి కూడా వుంటుంది. బిడ్డ బయటకు రావాలంటే తల్లి పడే కష్టం అతి కఠినంగా వుంటుంది. అయితే ఈ నొప్పులు వ్యక్తికి వ్యక్తికి మారుతూంటాయి. బేబీ సైజు, పొజిషన్, తల్లి కటి ప్రదేశం, ఆమెకుగల బిగబట్టగలిగిన సామర్ధ్యం, సంకోచ వ్యాకోచాల ఒత్తిడి బట్టి కూడా వుంటాయి. ప్రసవ నొప్పులనుండి ఉపశమనం పొందాలంటే రెండు మార్గాలు.
సహజ మార్గాలు -
1.శారీరక మర్దనలు, వేడినీటి స్నానాలు
2. శ్వాస మరియు రిలాక్సేషన్ పద్ధతులు
3. ఉపశమనమిచ్చే చక్కటి సంగీం వినటం
4. సౌకర్యవంతమైన పొజిషన్ లో వుండటం
5. చక్కగా ప్రేమించేవారు పక్కన వుండటం.
వైద్యపర మార్గాలు-
1. నొప్పులు తగ్గించే మందులు వాడటం - నేరుగా రక్తంలోకి నొప్పిని తగ్గించే ఇంట్రా వీనస్ ఇంజెక్సన్లు ఇవ్వటం.
2. అనస్తీషియా- తల్లి అలర్టు గానే వుంటుంది. కాని ఆమె శరీర దిగువ భాగంలో వెన్నెముకకు అనస్తీషియా ఇస్తారు.
3. నొప్పి తెలియకుండా పుడెంటల్ నరానికి, జననాంగానికి మందులను ఇంజెక్ట్ చేస్తారు.
4. స్పైనల్ అనస్తీషియా - తక్షణ ఉపశమనం కొరకు వెన్నెముకకు ఇంజెక్షన్ ఇచ్చి పూర్తి శరీరం మొద్దుబారే విధంగా కూడా చేస్తారు.
అయితే ఏ రకమైన మందులు వాడాలి ఎంత సేపటికి వాడాలి అనేవి వైద్యులు తల్లి, పిల్ల సంక్షేమాన్ని పరిశీలించి ఆచరిస్తారు.



Click it and Unblock the Notifications
