Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నీటిలో మహిళ ప్రసవం....సురక్షితమా?
ఆధునిక వైద్య చరిత్రలో మహిళలను నీటిలో కాన్పు చేయించటాలు ఒక కొత్త తరహా ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాయి. పాతకాలంనాటి కాన్పుల పద్ధతులే మరోమారు జీవం పోసుకుంటున్నాయి. ఈ నీటి కాన్పులు అనాది కాలంలో జరిగినవే. ఇపుడు కొత్తగా సైంటిస్టులు వీటికి ఆధునికతలను జోడించి వాటి ప్రయోజనాలు వివరిస్తున్నారు. అనాది కాలంలో మహిళకు కాన్పు సమయంలో వచ్చే నొప్పులను తగ్గించటానికి గాను నీటిలో ప్రసవం చేయించేవారు. చరిత్ర పరిశీలిస్తే, చాలా జననాలు ఒకప్పుడు నీటిలో జరిగేవని తెలుస్తోంది. దీనికిపుడు శాస్త్రీయత జోడించారు మన వైద్యరంగ నిపుణులు. పాతకాలంలో అమెరికా దేశ నాగరికతలలో నీటి కాన్పులు పిల్లలు పుట్టటానికి సహజమైనవిగా వుండేవి.
నీటి ప్రసవాల ప్రయోజనాలు పరిశీలిస్తే.....
కాన్పుల నొప్పులు- ఈ ప్రక్రియలో మహిళను నులివెచ్చని వేడికల నీటిటబ్ లో వుంచి శరీర మర్దనలు, ఆరోమా ధిరపీలు, లాఫింగ్ గ్యాస్ వదలటం మొదలగు వాటి ద్వారా ఆమెకు నొప్పులు తెలియకుండా చేస్తారు.

శ్వాసకు సహకరిస్తుంది - కాన్పు నొప్పులలో మహిళకు ఎంతో అలసట, ఆందోళన కలిగి వుంటాయి. శ్వాస మారుతుంది. వేడి నీరు, ఆరోమా వైద్యం మహిళను చక్కటి దీర్ఘ శ్వాసలు తీసుకునేలా చేస్తుంది. దీనితో ఆమె కండరాలకు అవసరమైన కదలికలు ఏర్పడతాయి.
బిడ్డకు ఆహ్లాదం - కాన్పు తర్వాత బయటకు వచ్చిన బేబీ సహజ సిద్ధమైన నీటిలో బయటపడటం వలన తల్లి గర్భంలో వున్న ద్రవాలనుండి బయటపడి పరిశుభ్రత అనుభూతి పొందుతుంది.
వెన్ను నొప్పి రాదు- సాధారణంగా తల్లులయ్యే మహిళలు వెన్ను నొప్పితో బాధపడుతూంటారు. వేడినీటి వినియోగం, శారీరక మర్దనల వలన చక్కటి ఉపశమనం మహిళకు లభించి వెన్ను నొప్పి మాయమవుతుంది.
నీటి కాన్పు వలన నష్టాలు:
నీటి కాన్పు తల్లికి, బిడ్డకు ఎంత సురక్షితమనేది చర్చనీయాంశమే. బిడ్డ నీరు తాగేస్తే? పెద్ద ఉపద్రవమే. తల్లి శరీరంనుండి నోరు తెరిచి ఏడుస్తూ బయటపడే బిడ్డ ఎంతో కొంత నీరు తాగేస్తుంది. అదే నీటిలో తల్లి రక్తం, ఇతర పదార్ధాలు వుండి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి.
బిడ్డ మునిగితే చాలా పెద్ద సమస్యే? అయితే, ఆధుని వైద్యం బిడ్డ నీటిలో మునిగేటంతవరకు రానివ్వకపోవచ్చు. నీటిలో వున్న తల్లి ప్రసవసమయంలో ఎంత రక్తాన్ని బయటకు స్రవిస్తోందో తెలియని పరిస్ధితి ఉంటుంది. నీరు తరచుగా మార్చటం కూడా కుదరని పనే. సాదారణం కన్నా అధికంగా బ్లడ్ పోతే నీరు మార్చాల్సిందే. గత అయిదారేళ్లుగా నీటి కాన్పులు, డాక్టర్లు, మహిళలు, వైద్య నిపుణులు అందరూ ఆమోదిస్తూనే వున్నారు. కనుక భవిష్యతుత్లో వీటికి మంచి ఆదరణ లభించి మరింత సురక్షితం, సుఖవంతం కాగలవని భావించవచ్చు.



Click it and Unblock the Notifications