Latest Updates
-
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి
ఆలస్య గర్భధారణలో ఆరోగ్యకరమైన బిడ్డ!

ఈ పరిస్ధితులలో మహిళ ఒకచక్కని ఆరోగ్యవంతమైన బిడ్డను సమస్యలు లేకుండా తేలికగా కనాలంటే ఏ రకమైన చర్యలు చేపట్టాలనేది పరిశీలిద్దాం. గర్భం ధరించాలనుకునే మహిళ గర్భధారణకు ముందు, గర్భం ధరించిన తర్వాత కూడా సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలి. సంపూర్ణ ఆరోగ్యం ఆమెకు గర్భవతి దశలో సమస్యలు లేకుండా చేస్తుంది.
అందుకుగాను ఆమె తన ఆహారంలో ఫోలిక్ యాసిడ్ వుండేలా చూసుకోవాలి. పిల్లలు పుట్టే వయసులో మహిళ సాధారణంగా రోజుకు కనీసం 0.4 మి.గ్రా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ సహజంగా వుండే ఆహారాలు తినాలి. ఇది ఆకుపచ్చని కూరలు, చిక్కుళ్ళు, లివర్, కొన్ని సిట్రస్ పండ్లలో వుంటుంది. కేఫైన్ రోజుకు 300 మి.గ్రా మించకుండా వుండాలి. కనుక కాఫీ, సోడా, చాక్లెట్ బార్ వంటివి మితంగా తినాలి.
అవసరమైన పోషకాలు అన్ని శరీరానికి అందాలంటే, సంతులిత ఆహార భోజనం చేయాలి. ఆమెన తినే ఆహారాలలో పిండిపదార్ధాలు, పీచు అధికంగా వుండాలి. ప్రతి ఆహారంలోను విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా వుండాలి. రోజుకు కనీసం కాల్షియం అధికంగా వుండే పాల ఉత్పత్తులు నాలుగు రకాలు తినాలి. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఎ మరియు ఫోలిక్ యాసిడ్లు వుండాలి. గర్భ ధారణకు ముందే రెగ్యులర్ గా వ్యాయామాలు మొదలుపెట్టినప్పటికి వాటిని గర్భధారణ తర్వాత కూడా అవసరమైన మార్పులతో కొనసాగించాలి. ఆల్కహాల్, పొగతాగటం, డాక్టర్ ఇవ్వని మందుల వాడకం తొలగించాలి.
ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే గర్భం ఆలస్యమైనప్పటికి మహిళ సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన బిడ్డను కనే అవకాశాలుంటాయి.



Click it and Unblock the Notifications