Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
డెలివరీ(ప్రసవం) తర్వాత తల్లి తీసుకోవలసిన జాగ్రత్తలు...!?

విశ్రాంతి: తల్లికి మానసిక ప్రశాంతత చాలా అవసరం. సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల, కాన్పు తర్వాత కలిగే అలసట తగ్గుతుంది. పాలు బాగా పడతాయి.
సాధారణ కాన్పు తర్వాత వీలైనంత త్వరగా లేచి తిరగడాన్ని, ఆపరేషన్ అయితే డాక్టర్లు చెప్పిన సమయం తర్వాత తల్లి తనంతట తాను లేచి తిరగడాన్ని ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా, రక్తప్రసరణకు ఆటంకం లేకుండా ఉంటుంది.
వ్యక్తిగత పరిశుభ్రత: పరిశుభ్రంగా ఉండటం వల్ల కుట్లు త్వరగా మానడం, చీము పట్టకుండా ఉండటం వంటి సౌలభ్యాలు చేకూరతాయి.
వ్యాయామాలు: సాధారణ కాన్పు అయ్యాక నెల తర్వాత వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఒకవేళ ఆపరేషన్ అయితే తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి 2-3 నెలల తర్వాత వ్యాయామాలు చేయడం, మంచిది. వ్యాయామం వల్ల పొట్ట కండరాలు, పెల్విక్ కండరాలు దృఢమవుతాయి. నడుమునొప్పి తగ్గుతుంది.
తల్లిపాలు: కాన్పు తర్వాత గంటలోగా బిడ్డకు తల్లి రొమ్మును శుభ్రం చేసి పట్టించాలి. బిడ్డ ఎంత త్వరగా రొమ్మును అందుకుంటే అంత త్వరగా పాలు ఉత్పత్తి అవుతాయి. ఆరు నెలలపాటు తల్లిపాలు ఇవ్వడం తల్లికీ, బిడ్డకూ మంచిది.



Click it and Unblock the Notifications