Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఒక గర్భవతిగా మహిళ ఆశించేదేమిటి?
మహిళ గర్భవతి అయిందంటే, మొదటగా ఆమెకు కావలసినది హాయిని గొల్పే మంచి దుస్తులు. ఆమె గర్భవతిగా వున్న 9 నెలల కాలం వీటి ఖర్చు అధికంగానే వుంటుంది. ఈ దశలో మహిళ దుస్తులను ఎలా మెయిన్టెయిన్ చేయాలనేది చూడండి. గర్భవతి మహిళ దుస్తులు వీలైనంత మేరకు డిస్కౌంట్లు ఇచ్చే షాపులలో కొనుగోలు చేయండి. అవి చవకవైనప్పటికి సౌకర్యంవంతంగా వుండాలి. ఈ దశ దాటితే మహిళకు తర్వాత అవి పనికిరావు. లేదా గతంలో తల్లులైన దగ్గరి బంధువులెవరైనా వుంటే వారి దుస్తులు వాడినా బాగానే వుంటుంది. లేదా గతంలో మీరు కొని బాగాలూజ్ అయిపోయానాయని పక్కన పడేసిన దుస్తులు కూడా ఈ సమయంలో సౌకర్యం కొరకు ఉపయోగించవచ్చు. నైటీలు, ఎలాస్టిక్ దుస్తులు, యోగా పేంట్లు, లైక్రా లెగ్గింగులు, స్ట్రెచ్ పేంట్లు, స్వెట్టర్స్ వంటివి బాగుంటాయి.

ఇక లోదుస్తులుగా బికిని అండర్ వేర్ వంటివి సైజ్ చేసి వాడచ్చు. బ్రాసరీలు సాగేవిగా వుంటే బాగుంటుంది. ఈ దుస్తులు వీలైనంత ముందుగానే అలవాటు చేసుకోండి. కాళ్ళకు సన్నపాటి చదునైన చెప్పులు నడకకు తేలికగా వుండి బాడీని బేలన్స్ చేస్తాయి. ఓపెన్ స్లిప్పర్లు స్లిప్ షూస్ వంటివి మరింత సౌకర్యం మరియు ఆధునికంగాను వుంటాయి. గర్భవతి మహిళ ఏదైనా పార్టీలకు వెళ్ళవలసి వస్తే, నలుపు లేదా గోధుమ రంగు దుస్తులు వీలైనంతవరకు పొట్ట కనపడకుండా చేస్తాయి. తొడభాగం వరకు స్టోకింగ్స్ లేదా మేజోళ్ళు వంటివి వేస్తే ఫిట్ గాను ఆకర్షణీయంగాను కూడా వుంటుంది.
మరి ఆమెలో శారీరక మార్పులు ఎలా ఉంటాయి? మహిళకు ఒకసారి శిశువు పుట్టిందంటే జీవితంలోనే అనేక మార్పులు వస్తాయి. శారీరకంగా కాక, సామాజికంగా, మానసికంగా కూడా ఈ మార్పులు వుంటాయి. ఈ మార్పులు ప్రతి మహిళకు విభిన్నంగా వుంటాయి. మహిళకుగల తల్లి అనుభవం ఆమెకుగల గత అనుభవాలతో ముడిపడి వుంటుంది. మహిళలు బిడ్డ పుట్టటంతో తమ పాత్ర ముగిసిపోతోందని అలసట కలుగుతోందని కూడా బాధపడుతూంటారు. మరికొంతమంది మహిళలు ఒంటరి తనాన్ని భావిస్తారు. వారు ఎంతో నష్టపోయినట్లుగా కూడా భావిస్తారు. అయితే, తాము జన్మనిచ్చిన బేబీని పెంచడంలో మరోమారు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. బేబీని పెంచటంలో ఆనందిస్తారు.
బిడ్డ పుట్టిన తర్వాత మహిళలో వచ్చే శారీరక మార్పులు అధికంగానే వుంటాయి. గర్భాశయం కుచించటం మొదలుపెడుతుంది. ఒక కిలోగ్రాము వరకు వుండే గర్భాశయం ఆరు వారాలయ్యే సరికి 100 గ్రాముల బరువుకు తగ్గుతుంది. కండరాలలో వుండే పీచు అంతా మాయమవుతుంది. రక్తస్రావం ఆగటానికి గానను గర్భాశయం మరింత కుచించుకుపోతూ వుంటుంది. ఈ సమయంలో ఆమె విపరీతమైన నొప్పికి గురవుతుంది. గతంలో ఒక బిడ్డ ప్రసవించిన వారికి ఈ నొప్పులు మరింత అధికంగా వుంటాయి.



Click it and Unblock the Notifications