For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లిపాలు వృధ్ధి అవాలంటే ఏ రకమైన ఆహారం తీసుకోవాలి?

By B N Sharma
|

Breastmilk
తల్లి పాలు బాగా ఉత్పత్తి అవాలంటే శరీరంలోని కొవ్వు నిల్వలు కొంతమేరకు సహకరిస్తాయి. అయితే, బేబీకి అధికంగా పాలు కావాలంటే, తల్లికి మంచి శక్తినిచ్చే కేలరీలు అందించాలి. తల్లిపాలు ఇవ్వడం మొదలయ్యే సరికి మహిళలో కేలరీలు గతంలో కంటే బాగా తగ్గుతాయి. కనుక పాలు బాగా పెరిగేటందుకు తల్లి తినాల్సిన ఆహారం ఏమిటో పరిశీలిద్దాం....

1. మంచి గింజ ధాన్యాలు, పప్పులు తినాలి. ఎల్లపుడూ తాజా పండ్లు, కూరలు తినాలి.
2. అధికమైన ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఐరన్ వుండే ఆహారం సమకూర్చండి.
3. పోషకాలు కల పెరుగు, బ్రక్కోలి, బ్రెడ్, ఉడికించిన మొలకలు, పనీర్ వండిని కూరలు మొదలైనవి ఇవ్వండి.
4. బరువు పెరగని, కొవ్వు తక్కువగా వుండే పాల ఉత్పత్తులు ఇవ్వాలి. నెయ్యి వాడరాదు.
5. ప్రొటీన్లు అధికంగా వుండాలంటే మాంసం, చేపలు, కోడి మాంసం పెట్టాలి. కోడి గుడ్లు, జున్ను పెరుగు, ఇతర ఆరోగ్యకర పదార్ధాలు ఇవ్వాలి.
6. ఐరన్, ప్రొటీన్ అధికంగా వుండే కాయధాన్యాలు, ఉడికించిన బీన్స్, పచ్చి బఠానీలు తినాలి.
7. ఫోలేట్ అధికంగా కల పచ్చటి ఆకు కూరలు, గోంగూర, క్యాబేజి, మొలకలు మొదలైనవి తినాలి.
8. పండ్లు, టొమాటోలు, బెర్రీలు, కేప్సికం, బంగాళదుంపలు మొదలైనవి బేబీకి తల్లికి విటమిన్ సి అందిస్తాయి.
9. విటమిన్ ఎ సమృధ్ధిగా వుండేగాఢమైన పచ్చ మరియు పసుపు కల కూరలు, గుమ్మడి, కేరట్లు, మొదలైనవి ఎల్లపుడూ తినాలి.
10. బేబీ ఆహారం కొరకు మీపై ఆధారం కనుక బేబీ జీర్ణవ్యవస్ధకు హాని కలిగించే మసాలా తిండ్లు తినవద్దు.
11. ఏ ఆహారం తింటే బేబీకి అనారోగ్యం కలుగుతూంటుందో గమనించి ఆ పదార్ధాలు తినకండి. బేబీ కనుక పాలు తాగటం మానేస్తే మీరు తినే ఆహారం సరిగా లేదని గుర్తించండి.
12. చాక్లెట్లు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, నిమ్మ, ద్రాక్ష, స్త్రాబెర్రీలు, ఉల్లిపాయలు, కేబేజీ, ముల్లంగి, దోసకాయలు మొదలైనవి బేబీలు ఇష్టపడేవి కావు. కనుక వీటిని పాలు పట్టేవారు తినకండి.
13. ప్రతిరోజూ ఒక కప్పు కాఫీ లేదా టీ సరైనదే. ఇవి కనుక అధికంగా తాగితే వీటి ప్రభావం బేబీ నిద్రమీద పడుతుంది.

కనుక, బేబీకి అవసరమైన తల్లిపాలు అధికమవ్వాలంటే తల్లులు పైన తెలిపిన ఆహార ప్రణాళిక పాటించాలి.

English summary

Diet For Healthy Milk Production of women! | తల్లిపాలు వృధ్ధి అవాలంటే ఏ రకమైన ఆహారం తీసుకోవాలి?

Even chocolates, spices like garlic, cinnamon, citrus fruits like lemon, grapefruit, strawberries and acidic vegetables like onion, cabbage, radish and cucumbers are not liked by babies. So, exclude such items from your breastfeeding diet.
Story first published:Saturday, March 10, 2012, 9:43 [IST]
Desktop Bottom Promotion