Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
తల్లికి పాలు బాగా పడాలంటే?

సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చిన ఆనందంలో మహిళలు తమ పట్ల శ్రధ్ధ చూపరు. పూర్తిగా కొత్తగా పుట్టిన బిడ్డపైనే ధ్యాస పెడతారు. కాని బిడ్డకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందాలంటే తల్లులు కూడా సరి అయిన సమయంలో సంతులిత ఆహారాన్ని తినటం ఎంతో ప్రధానం. కొత్తగా తల్లులైన మహిళలు తీసుకోదగిన ఆహారం -
1. డెలివరీ అయిన తర్వాత తల్లులకు మంచి శక్తి కావాలి అందుకుగాను సంపూర్ణ గింజ ధాన్యాల ఆహారం తీసుకోవాలి. ఎంపిక చేసిన పాలఉత్పత్తులు, తాజా కూరలు, తాజా పండ్లు తినాలి. రోజులో మొదటగా తల్లి ఎండు ఫలాల మిల్క్ షేక్ తాగి తగిన శక్తి పుంజుకోవాలి. ఏరకమైన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయాలనేది వైద్యులను సంప్రదించవచ్చు.
2. బ్రేక్ ఫాస్టులో ముడిబియ్యంతో చేసిన ఇడ్లీలు, దోశ లేదా బ్రెడ్ శాండ్ విచ్ తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు కల మంచి పండ్లరసం కూడా బ్రేక్ ఫాస్టుతో తీసుకోవచ్చు.
3. బ్రేక్ ఫాస్టు - లంచ్ ల మధ్య ఒక కప్పు టీ తాగాలి. టీలో వున్న ఔషద విలువలు శరీరానికి, మైండ్ కు మంచి శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయి. దీనికి ముందు కొద్దిపాటి తేలిక వ్యాయామాలు చేయాలి.
4. వేడినీటితో స్నానం తర్వాత, వేడిగా జీరా లేదా మిరియాలు వేసి కాచిన రసం, ఒక సలాడ్, కొద్దిపాటి అన్నం, మజ్జిగ కలిపిన అన్నం తింటే శక్తి వస్తుంది. ఈ భోజనం తర్వాత ఒక పాన్ వేసుకుంటే మంచి ఖనిజ లవణాలు చేకూరి నిద్రకూడా బాగా పడుతుంది.
5. సాయంత్రం కొద్ది నడక తర్వాత కొబ్బరి నీరు, కేరట్ జ్యూస్ లేదా పుచ్చకాయ లేదా కుకుంబర్ జ్యూస్ తాగితే శరీరంలో నీటి సమతుల్యత కలుగుతుంది.
6. నీరు అధికంగా తాగాలి. పండ్లు, కూరలు బాగా తింటే బిడ్డకు కావలసిన పాలు పడతాయి.
7. ఇక రాత్రి భోజనంలో కొద్దిపాటి అన్నం, రసం, కొచెం నెయ్యి, ఆకు కూరల కూర, మజ్జిగ వుండాలి.
8. పడుకునే ముందుగా ఒక గ్లాసెడు పాలు ఆరోజుకు ఒక కొత్త తల్లి తినాల్సిన ఆహారాన్ని పూర్తి చేస్తాయి.



Click it and Unblock the Notifications