బిడ్డను ఇంటిలోనే ప్రసవించాలంటే?

By B N Sharma

Facts about Natural Childbirth at Home!
బిడ్డను సాధారణంగా ఇంటిలోనే ప్రసవించాలా? లేక హాస్పిటల్ లో ప్రసవించాలా ? అనేది చాలామంది మహిళలకు ఇప్పటికి సమస్యగానే వుంటుంది. ఇంటివద్దే బిడ్డను సాధారణంగా ప్రసవిస్తే, మహిళకు కొన్ని సహజ ప్రయోజనాలుంటాయి. అయితే, సమస్యలు ఏవీ ప్రసవంలో వుండవని ముందుగా నిర్ధారించుకోవాలి. ఇంటివద్ద అయితే, కాన్పు నొప్పులను సురక్షితంగా చివరివరకు భరించి బిడ్డను ఆరోగ్యకరంగా పొందవచ్చు. హాస్పిటల్ లో అయితే, వైద్యులు అధిక సమయం తీసుకోక సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తారు.

హాస్పిటల్ లో ప్రసవ సమయంలో డ్యూటీలు మారే డాక్టర్లు నర్సులు మహిళకు నిరంతర సేవ చేయటం కష్టంగానే వుంటుంది. కొత్తగా డ్యూటీ ప్రవేశించిన వైద్యులు ఆందోళనకు గురవుతారు. ఈ పరిస్ధితి ఇంటివద్ద వుండదు. హాస్పిటల్ వాతావరణంలో వైద్యులు చేసే చర్యలకు మీరు ఏ రకమైన అభ్యంతరం చెప్పలేరు. ఇంటివద్ద ప్రసవించేవారికి, వైద్యులు లేదా నర్సుల ఎంపిక, కొనసాగింపు, డెలివరీ సమయంలో తమకు సౌకర్యమైన రీతిలో చక్కటి మ్యూజిక్ లేదా ఇతర ధ్వనులు, వాటర్ బర్త్ మొదలైన వాటితో సౌకర్యంగా వుంటుంది.

అయితే, ఇంటివద్ద ప్రసవం జరిగేటపుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. సమస్యలపుడు వైద్య సహాయం తక్షణం అందకపోవచ్చు. అవసరమైన రక్తం దొరకకపోవచ్చు. నర్సులు డెలివరీలో శిక్షణ పొందినవారు కాకపోవచ్చు. కొంతమందికి సరైన వైద్య పర్యవేక్షణ లేకుంటే, వారికి లేదా పుట్టబోయే బిడ్డకు నష్టం వాటిల్లే అవకాశం కూడా వుంటుంది.

Story first published: Tuesday, February 21, 2012, 16:54 [IST]
Desktop Bottom Promotion