Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ప్రసవించిన మహిళకు జననాంగ భాగ సమస్యలు?

ప్రసవం తర్వాత మహిళలో ఇన్‌ఫెక్షన్, కొద్దిపాటి జ్వరం రావడం, మూత్ర సంబంధిత సమస్యలు, స్తనాల సమస్యలు, నరాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటన్నిటికి తోడు, మహిళకు కనుక సిజేరియన్ డెలివరీ అయితే, ఆమె పరిస్ధితి మరింత బాధాకరంగా ఉంటుంది. జననాంగ భాగంలో వేసిన స్టిచెస్ త్వరగా మాన్పు పట్టవు. ఆమెకు ఆ భాగంలో తీవ్ర సమస్యలు ఎదురవుతాయి.
ఈ అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని డెలివరీ అయిన తర్వాత మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మహిళల్లో కాన్పు తర్వాత ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌లను ప్రసూతి అంటువ్యాధులు అంటారు. ఈ ఇన్‌ఫెక్షన్‌లు ప్రసవం తర్వాత తగినంత రక్తం లేకపోయినా, గర్భవతిగా వున్నపుడు తీవ్రంగా రక్తపోటుకు గురయినా, లేక పోషకాహార లేమితో బాగా బలహీనంగా వున్నా వస్తాయి.
ప్రసూతి సమయంలో, బొడ్డుతాడు కిందికి ఉండడం, డెలివరీ తర్వాత దానికి సంబంధించిన కొన్ని ముక్కలు బిడ్డతో పాటు పూర్తిగా బయటకురాకుండా లోపలే ఉండిపోవడం వల్ల కూడా అంటువ్యాధులు ఏర్పడతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా స్త్రీలకు శారీక నొప్పులు, దుర్వాసనతో కూడిన యోని స్రావం, నీరసం, కడుపు నొప్పి మొదలైన అసౌకర్యాలు ఏర్పడతాయి. ఆమె పొట్ట, శరీరంలోని ఇతర అవయవాలు కూడా ఇన్ ఫెక్షన్ కు గురవుతాయి.
కనుక మహిళకు ప్రసవం ముందు, ప్రసవం సమయంలో ఎంత వైద్య సౌకర్యం అవసరమో, ప్రసవం తర్వాత కూడా ఆమెకు అంతే వైద్య సౌకర్యాలు అవసరమని గుర్తించాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ సమయంలో ఆమె తనపైన తానే కాదు శ్రధ్ధ తీసుకోవలసింది, బిడ్డ పట్లకూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకుగాను ఆమెకు తగిన వైద్యం తప్పక అందుబాటులో ఉండాలి.



Click it and Unblock the Notifications