Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిడ్డ పుట్టిన వెంటనే సంరక్షణ ఎలా చేయాలి... !

అప్పుడే పుట్టిన పసికందుల్ని డాక్టర్లు, నర్సులు వంటి వారే చూసుకుంటూ వారి ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహిస్తారులే అని భావించరాదు. పుట్టిన బిడ్డ విషయంలో డాక్టర్లు, నర్సులు ఎంత శ్రధ్ధ వహించినప్పటికి తల్లిదండ్రులు అధికంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దేశంలో కొత్తగా పుట్టిన పసిబిడ్డల పరిస్థితిని తెలిపే నివేదికల గణాంకాలు చూస్తే ఎంతో ఆందోళన కలిగించేవిగా ఉంటున్నాయి. దేశంలో ప్రతి ఏటా మరణిస్తున్న సంవత్సరంలోపు వయసు ఉన్న పిల్లల్లో 50 శాతం మంది పుట్టిన నెలరోజుల లోపే మరణిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అపుడే పుట్టిన బిడ్డల విషయంలో ఎలా జాగ్రత్త వహించాలనేది పరిశీలించండి.
- బిడ్డ పుట్టిన వెంటనే హాస్పిట్ సిబ్బంది బిడ్డను బాగా కడిగి వెంటనే తల్లికి అప్పగిస్తారు.
- బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు వ్యవధిలోనే తల్లి బిడ్డకు ముర్రుపాలు తాగించాలి.
- బిడ్డను వెచ్చటి శుభ్రమైన దుస్తులలో వుంచి తల్లి శరీరం తగిలేలా వెచ్చగా వుంచాలి. బిడ్డ కనుక నెలలు నిండకుండా పుట్టి వుంటే, హాస్పిటల్ సిబ్బంది బిడ్డను వేరుగా ఇన్ క్యుబరేటర్ వంటి సాధనాలలో ఉంచి ఆరోగ్యాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు. అవసరమైన మందులు వాడతారు.
- బిడ్డ శ్వాసక్రియ సరిగా ఉందా లేదా అనేది ఎప్పటికపుడు గమనిస్తూండాలి.
- బిడ్డ సరైన బరువుతో పుట్టిందా? లేదా అనేది చెక్ చేసి అవసరమనుకుంటే వైద్యుల సలహాలు పొందండి.
- పిల్లలకు పుట్టిన వెంటనే వేయాల్సిన పోలియో చుక్కలు, సూదిమందులను వేయమని డాక్టర్ ను కోరండి. శిశువుకు చేయించే ఇంజెక్షన్లు, ఇతర పోలియో చుక్కలు, వ్యాక్సిన్లు లేదా ఇతర పరీక్షలన్నింటికి తగిన రికార్డు నిర్వహించండి. సాధారణంగా అపుడే పుట్టిన పిల్లలకు గాను ఆస్పత్రులలో కార్డులు ఇస్తారు. తల్లితండ్రులు తమ బిడ్డ కు ఏ సమయంలో ఏ రకమైన వ్యాక్సిన్లు ఇప్పించాలనేది ఆ కార్డులో వుంటుంది. ఆ మేరకు బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం వరకు తల్లితండ్రులు తగిన రీతిలో ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు వేయించాలి. ఈ రకమైన చికిత్సలు బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
- ఏ రకమైన అనారోగ్య సమస్యలు వచ్చినాయని గుర్తించినా, వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా పిల్లల వైద్యులను సంప్రదించండి.ఏరకమైన సమస్య వచ్చినప్పటికి ఆలస్యం చేయక తక్షణ వైద్య సదుపాయం ఇప్పించటం అత్యంత అవసరంగా గుర్తించాలి.



Click it and Unblock the Notifications