Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాలింతలలో ఇన్‌ఫెక్షన్ నివారణ, చికిత్సలు…!

గర్భం సమయంలో ఏవైనా గాయాలు ఏర్పడితే చాలా జాగ్రత్తగా వాటికి వైద్యం చేయించుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే మహిళలకు టెంపరేచర్, పల్స్ చెకప్, బిపి, కాలేయం, ఊపిరితిత్తులు పరీక్ష చేస్తారు. గర్భం తర్వాత స్కిన్ ఇన్‌ఫెక్షన్, గర్భాశయం కరెక్ట్‌గా మూసుకున్నదా లేదా అని డాక్టర్లు చూస్తా రు. వెజినల్, సర్విక్స్ నుంచి యూరిన్, బ్లడ్ టోటల్ కౌంట్, డిఫరెన్షియల్ కౌంట్‌ను కూడా డాక్టర్లు పరీక్షిస్తారు. బ్లడ్ టెస్ట్‌తో పాటు ఎక్స్‌రే, మలేరియా టెస్ట్‌లను సైతం నిర్వహిస్తారు. డెలివరీ సమయంలో రక్తం తక్కువగా ఉన్నవారికి రక్తం ఎక్కిస్తారు. అవసరమైన వారికి యాంటీబయాటిక్స్‌ను అందిస్తారు.
ఇక డెలివరీ జరిగే ప్రదేశం లేదా గది పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలి. దీనివల్ల ప్రసవం జరిగే మహిళలను ఇన్‌ఫెక్షన్‌ల బారినుండి రక్షించవచ్చు. డెలివరీకి ముందు పరీక్షలు తక్కువగా చేయడం మంచిది. పరిశుభ్రమైన, క్రిమిరహిత ప్రదేశంలో డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రసవానికి ముందు, తర్వాత మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాల్సి ఉంటుంది. శుభ్రమైన నీటితో స్నానం చేయడంతో పాటు మహిళలు తమ జననాంగాన్నికూడా ప్రతి రోజూ శుభ్రపరుచుకోవాలి. గాయాలు ఏర్ప డితే వెంటనే వైద్యం చేయించుకొని యాంటి బయాటిక్స్ మందులను వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రతలో ప్యాడ్స్‌ను వాడడం శ్రేయస్కరం. ఇన్‌ఫెక్షన్ బాగా ఉంటే వేరుగా ఉండే గదిలో విశ్రాంతి తీసుకోవాలి.



Click it and Unblock the Notifications