Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళకు ప్రసవం తర్వాత ఇన్‌ఫెక్షన్‌లు!

ఈ రకమైన ఆరోగ్య సమస్యలతోపాటు, పుట్టిన బిడ్డ విషయంలో శ్రద్ధ వహించాల్సి వుంటుంది. తల్లి ఆరోగ్యం ఏ మాత్రం సరిలేకపోయినా, దాని ప్రభావం బిడ్డ ఆరోగ్యంపై వుంటుంది. అందుకుగాను మహిళ తప్పనిసరిగా వైద్య సలహాలు పాటించాలి. లేకుంటే, మహిళ ఈ సమయంలో చాలా బలహీనపడి వుండటంతో, ఏ వ్యాధి లేదా సమస్య వచ్చినప్పటికి అది పరిష్కరించబడేసరికి చాలా సమయం తీసుకుంటుంది. మహిళల్లో కాన్పు తర్వాత ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌లను పర్పురల్ ఇన్‌ఫెక్షన్స్ అంటారు.
ఈ ఇన్‌ఫెక్షన్‌లు డెలివరీ తర్వాత సాధారణంగా రక్తం లేనివాళ్లు, ప్రెగ్నెన్సీ సమయంలో రక్తపోటు కలిగి ఉన్నవాళ్లు, బాగా నీరసంగా ఉన్నవాళ్లకి వస్తాయి. దీంతో డెలివరీ సమయంలో బాగా బ్లీడింగ్ కావడం, మాయ కిందికి ఉండడం, డెలివరీ తర్వాత మాయ ముక్కలు లోపలే ఉండిపోవడం వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌లు ఏర్పడతాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ల మూలంగా మహిళలకు శారీరక నొప్పులు, నీరసం, కడుపు నొప్పి, దుర్వాసనలతో కూడిన యోని ద్రవాలు బయటకు రావటం జరుగుతుంది. గర్భాశయం ఇన్‌ఫెక్షన్ వలన పొట్ట మాత్రమే కాక ఆ ఇన్ ఫెక్షన్ పూర్తిగా శరీరానికి వ్యాపించే అవకాశం కూడా వుంటుంది.



Click it and Unblock the Notifications