Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
కాన్పు తర్వాత ప్రయాణాలు ఎప్పటివరకు సురక్షితం?

1. సిజేరియన్ డెలివరీ అయ్యిందా? కనీసం ఒక నెలరోజులవరకు ప్రయాణించకండి. సిజేరియన్ తర్వాత ప్రయాణం కష్టమవుతుంది. కుట్లు సడిలే అవకాశం వుంది. వాటికి ప్రతిరోజూ డ్రసింగ్ అవసరం అవుతుంది. కుట్లు రెండు రోజులలో తగ్గినా డాక్టర్లు కనీసం 30 రోజుల బెడ్ రెస్ట్ ఆచరించమని చెపుతారు. విశ్రాంతి తీసుకుంటే ఇన్ఫెక్షన్, హెర్నియా వంటివి రాకుండా వుంటాయి.
2. ప్రయాణ దూరం ఎంత వుండాలి? కనీసం రెండువారాల తర్వాత ఒక అర మైలు వరకు ప్రయాణించవచ్చు. రెండు వారాలకు మీ కుట్లు స్ధిరపడి కొంత ఎండిపోతాయి. విదేశీ ప్రయాణాలవంటివి ఆచరణీయం కాదు. అయితే, పరిస్ధితినిబట్టి వైద్యుల సలహా మేరకు ప్రయాణాలు చేయండి.
3. ఏ వాహనంపై ప్రయాణించాలి? సిజేరియన్ అయిన ఒక నెలవరకు విమాన ప్రయాణం పనికిరాదు. ఒక సర్జరీ తర్వాత కనీసం నెలరోజులు విశ్రాంతి తప్పక వుండాలి. యోని ద్వారా జననం అయితే స్వస్ధత చేకూర్చుకోవడానికి కనీసం ఒక వారం రోజులు పడుతుంది. రోడ్డు ప్రయాణం మంచిదే కాని తక్కువ దూరాలు మాత్రమే చేయాలి. వీలైనంత వరకు, కాన్పు సిజేరియన్ అయినా, యోని జననం అయినా రైలుబండ్లలో ప్రయాణించటం తల్లికి బిడ్డకు సురక్షితం.
4. సమస్యలు లేని సాధారణ డెలివరీ అయినట్లయితే, మీరు మీ ప్రయాణాలను మానాల్సిన పనిలేదు. అయితే, గర్భధారణ సమయంలో సమస్యలుండి కాన్పు సమయంలో క్లిష్టమైతే మాత్రం ప్రయాణాలకు మీరు తప్పని సరిగా వైద్యుల సలహా పొందాలి.
కాన్పు తర్వాత మీరు చేసే ప్రయాణాల సురక్షితానికిగాను మీ వైద్యుల సలహాలు పాటించి తల్లి, బిడ్డలు క్షేమంగా వుండండి.



Click it and Unblock the Notifications