Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డెలివరీలో జననాంగం వ్యాధులకు గురవుతుందా?

సహజంగా బిడ్డ పుట్టగానే తల్లి జననాంగాన్ని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైతే యోని భాగానికి కుట్లు వేస్తారు. ఆమెకు మలబద్దకం లేదా హెమరాయిడ్స్ వంటివి ఏమైనా వున్నాయా పరిశీలించి, మలబధ్ధకం లేకుండా తగిన చర్యలు చేపడతారు. మూత్రాశయాన్ని కూడా ఇన్ ఫెక్షన్, లేదా మూత్రం నిలుపుకునే సామర్ధ్యం, ఆ భాగాలలోని ఇతర కండరాల సమస్యలు పరిశీలిస్తారు. ఏ మాత్రం అనారోగ్య వ్యాధులు కలిగినా దానికి తక్షణ చికిత్సను అందిస్తారు.
బిడ్డపుట్టగానే తీసుకునే శారీరక జాగ్రత్తలలో తల్లి ఆరోగ్యంగా వుండటం, తనకు పుట్టిన బిడ్డ బాగోగులు చూసే సమర్ధత కలిగి వండేలా చేస్తారు. ఆమెకు బిడ్డకు పాలు పట్టడం ఎలా? జననాంగ శుభ్రత, గర్భ నిరోధక చర్యలు, త్వరగా మరోమారు సాధారణ ఆరోగ్యం ఎలా చేకూర్చుకోవాలనే అంశాలపై వైద్యులు తెలియజేస్తారు. అయితే, డెలివరీ చేసిన మహిళ కొన్ని సార్లు అతి త్వరగా మరోమారు పాత జీవితానికి సర్దుకోలేదు. కొంత మానసిక వేదనకు గురవుతుంది. ఒత్తిడి, చికాకు కలిగి వుంటుంది. కొంతమంది విషయంలో మానసిక అసమతుల్యత కూడా ఏర్పడుతుంది.
డెలివరీ తర్వాత సాధారణంగా 25 నుండి 85 శాతం మహిళలు, మానసిక అస్ధిరతలు కొద్దిరోజులపాటు కలిగి వుంటారు. 7 నుండి 17 శాతం మంది క్లినికల్ డిప్రెషన్ కు లోనవుతారు. వేయిమందిలో ఒకరికి పూర్తి మానసిక అస్వస్ధత కూడా ఏర్పడే ప్రమాదం వుంటుంది. అటువంటపుడు ఆమెకు భాగస్వామి సహకారం ఎంతో అవసరం అవుతుంది. డెలివరీ అయిన వెంటనే భాగస్వామి లేదా ఆమె దగ్గరి బంధువులు ఆమె వద్ద ఉండి బాగోగులను విచారించాలి. బిడ్డకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. మానసిక పరిస్దితిని కనిపెట్టి ఆమె సంరక్షణకై పాటుపడాలి.



Click it and Unblock the Notifications