Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
కొత్తగా తల్లైన వారు ఖచ్చితంగా తినాల్సిన సూపర్ ఫుడ్స్..!
అద్భుతమైన గర్భాధారణ కాలం తర్వాత, మీరు ఇప్పుడు ఒక బిడ్డకు తల్లై ఉంటారు. మీ శిశువు కోసం అన్ని రకాల శ్రద్దతీసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ప్రసవం తర్వాత హాస్పటల్ నుండి ఇంటికి వచ్చిన మొదటి రోజు నుండే మీ లైఫ్ స్టైల్ మీ మారిపోతుంది. మీ శరీరం మైండ్ మీద ఒత్తిడి పడుతుంది. గర్భాధారణ సమయంలో జరిగిన హార్మోనుల్లో మార్పులు మరియు మైండ్ సెట్ ను తిరిగి నార్మల్ కండిషన్ కు తీసుకు రావాలి. అందకు కొంత సమయం పడుతుంది. మీఅంతకు మీరు స్వతహాగా కేర్ తీసుకోవడానికి బేబీని జాగ్రత్తగా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలతో పాటు డైట్ ఫాలో అవ్వడం చాలా అవసరం. ప్రసవం తర్వాత కొత్త తల్లి పోస్ట్ నేటల్ డైట్ ను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకొనే ఆహారం మీదే మీ బేబి పెరుగుదల ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకొనే పౌష్టికాహారంతోనే బిడ్డకు సరిపడా ఫీడింగ్ చేయవచ్చు. శిశువుకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో సరైన న్యూట్రిషియన్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. పౌష్టికాహార లోపం వల్ల ఆ ప్రభావం శిశువు మీద చూపెడుతుంది. మీరు తీసుకొనే ఆహారం పరిమాణంలో కంటే పోషకవిలువల నాణ్యత చూడాలి. సాధారణ ఆహారం లేదా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల అది మీకు కానీ, మీ శిశువు కానీ ఎటువంటి ప్రయోజనం కలిగించదు. మరి ప్రసవం తర్వాత కొత్తతల్లి తీసుకోవాల్సిన పోస్ట్ నేటల్ డైట్ సూపర్ ఫుడ్స్ క్రింది స్లైడ్ లో చూడండి. ఇవి అటు కొత్తగా తల్లైన వారికి మరియు వారి శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది. పోస్ట్ నేటల్ డైట్ సూపర్ ఫుడ్స్:

పెరుగు: ప్రసవం తర్వాత మీరు తీసుకొనే ఆహారంలో పెరుగును చేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది మీకు కావల్సినంత క్యాల్షియంను మరియు ప్రోటీనులను అంధించి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అరటి: ప్రసవం తర్వాత మీ శరీరానికి కావల్సినంత శక్తిని, బలాన్ని అంధించడంలో అరటి పండు అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే అరటి పండులో హై ఐరన్ కంటెంట్ తో పాటు పొటాషయం పుష్కలంగా ఉంటుంది.

ఉసిరి కాయ(గూస్ బెర్రీ): ఉసిరికాయలో ఐరన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయను పోస్ట్ నేటల్ డైట్ లో చేర్చి తీసుకోవడం చాలా అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో కొత్త తల్లి కోల్పోయే ఐరన్ కంటెంట్ ను తిరిగి క్రమం చేయడానికి ఐరన్ రిచ్ గా ఉండే ఈ ఉసిరికాయ బాగా సహాయపడుతుంది.

నీళ్ళు: ప్రతి రోజూ తగినన్ని నీళ్ళు తీసుకోవడం చాలా అవసంర. ఎందుకంటే నీరు ఎక్కువగా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. అంతే కాదు ప్రసవం తర్వాత ఏర్పడే మలబద్దక సమస్యను నివారిస్తుంది. ఇంకా ఆరోగ్యంగా ఉంచుతుంది. గర్భాధారణ సమయంలో తీసుకొన్న వివిధ రకాల మందులు మాత్రల వల్ల దెబ్బతిన్న చర్మాన్ని(పొడిబారిన చర్మాన్ని)తిరిగి యదాస్థితికి తీసుకు రావడానికి నీళ్ళు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

డ్రై ఫ్రూట్స్: టీటైమ్ స్నాక్ లో కొందిగా మార్పు చేసుకొని గుప్పెడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ లేదా బాదం వంటివి తినడం కొత్త తల్లి ఆరోగ్యానికి చాలా అవసరం. వీటివల్ల పొందే న్యూట్రీషియన్ మరియు ప్రోటీనుల వల్ల మీరు ఆరోగ్యంగా మరియు యాక్టివ్ గా ఉండగలుగుతారు. అంతే కాదు పాలు అధికంగా పడుతాయి. బాదాంను నీటిలో నానబెట్టి ఆనీటిని సేవించడం చాలా అవసరం.

ఆకు కూరలు: ఆకుకూరల్లో క్యాల్షియం, ఐరన్, విటమిన్ కె, విటమిన్ ఎ మరియు ఫొల్లెట్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ సూపర్ ఫుడ్ ను పోస్ట్ నేటల్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

ఓట్ మీల్: ఇది చాలా చాలా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే కాదు ఇందులో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ కొత్త తల్లికి చాలా అవసరం. ప్రసవం తర్వాత మలబద్దకంతో బాధ పడే వారికి ఇది ఒక మంచి సహాయకారిని.

పాలు: పాలు పోస్ట్ నేటల్ డైట్ లో చేర్చాల్సినటువంటి ముఖ్యమైన సూపర్ ఫుడ్. పాలు రెగ్యులర్ గా త్రాగడం వల్ల ఇవి శరీరానికి కావల్సిన క్యాల్షియంను అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెండు గ్లాసుల పాలు తీసుకోవడం చాలా అవసరం.

బిట్టర్ గార్డ్(కాకరకాయ): కొత్తగా తల్లైన వారికి ఇచ్చే ఆహారాల్లో బెస్ట్ ఫుడ్ గా బిట్టర్ గార్డ్ ను చేర్చారు. ఎందుకంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఐరన్ పుష్కలం. ముఖ్యంగా లోహీమోగ్లోబిన్ కలిగినటువంటి వారికి ఇది చాలా అవసరం.

గుడ్లు: గుడ్లు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా కొత్తగా తల్లైన వారికి, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారికి గుడ్డు తగినన్ని పోషకాంశాలను అందిస్తుంది. ఇది కావల్సినంత శక్తినిస్తుంది. మీరు బేబిని చూసుకోవడానికి మీ శరీరానికి కావల్సినంత స్టామినా అందిస్తుంది.



Click it and Unblock the Notifications