Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ప్రసవం తర్వాత ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవడానికి చిట్కాలు
మహిళలల్లో ప్రసవం తర్వాత పోస్ట్ నేటల్ డిప్రెషన్ క్రోనిక్ కండిషన్ కు దారితీస్తుంది. ప్రసవం తర్వాత మహిళ శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా వీక్ గా మరియ శక్తిలేకుండా నీరసించబడి ఉంటారు. అంతే కాదు మెదడు మీద కూడా కొత్త ఒత్తిడికి దారితీస్తుంది. ప్రసవం తర్వాత బరువు కోల్పవడం మనస్సులో ఒక స్థిరమైన ఒత్తిడి కూడా ఉంటుంది. మీరు తిరిగి మీ ఒరిజినల్ షేప్ లోకి మారాలనుకుంటే అందుకు తగినంత శక్తి మరియు వ్యాయామం చాలా అవసరం.
ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కొన్ని నెలల పాటు లేదా ఒక సంవత్సరం వరకూ ఉండవచ్చు. ఈ పోస్ట్ నేటల్ డిప్రెషన్ తగ్గించుకోవడానికి కొంత కష్టం అవుతుంది. అందుకు కొంత విశ్రాంతి తీసుకోవడం మరియు రిలాక్స్ గా ఉండటం చాలా అవసరం. అయితే, ఈ పోస్ట్ నేటల్ డిప్రెషన్ ను బవిషత్తులో లో ఇతర సమస్యలకు కారణం కాకుండా మొదట్లోనే నివారించుకోవాలి.
ఇలా పోస్ట్ నేటల్ డిప్రెషన్ తో బాధపడే మహిళల్లో మీరు కూడా ఒకరైతే ఈ క్రింది స్లైడ్ లో పోస్ట్ నేటల్ డిప్రెషన్ ను ఎలా తగ్గించుకోవాలి చికిత్సా పద్దతులివ్వబడ్డాయి. అవేంటో ఒక సారి చూడండి..

హెల్తీ డైట్ :
పోస్ట్ నేటలర్ డిప్రెషన్ తగ్గించుకోవాలంటే మీరు హెల్తీ అండ్ న్యూట్రీషియన్ డైట్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే శిశువుకు పాలు పట్టే తల్లిలో అనేక హార్మోనుల మార్పులు జరుగుతాయి . కాబట్టి శరీరంను సమతుల్యం చేసే పోషకాహారన్ని తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనస్సుతో ఉండవచ్చు.

వ్యాయామం:
ప్రతి రోజూ రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా కొంత ఒత్తిడిని తగ్గించుకోవచ్చు . అలాగే ప్రసవం తర్వాత పెరిగే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు . ఇది ప్రధానంగా పోస్ట్ నేటల్ డిప్రెషన్ కు గురిచేస్తుంది. అంతే కాదు, వ్యాయమంతో పోస్ట్ నేటల్ డిప్రెషన్ వల్ల ఏర్పడిన హార్మోనుల మార్పును తిరిగి యథాస్థితి తీసుకురావచ్చు .

తగినంత నిద్ర:
ప్రసవం తర్వాత ఒత్తిడికి ప్రధాన కరాణం నిద్రలేమి కూడా ఒకటి. కాబట్టి, ప్రసవం తర్వాత తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి, శిశువు నిద్రించేటప్పుడు తల్లికూడా నిద్రపోయి, తగిన విశ్రాంతి తీసుకోవాలి .

రిలాక్సేషన్:
మీ మనస్సును ప్రశాంత పరచుకోవడానికి ఉపాయం వెతకండి . మీకు అత్యంత ఇష్టమైన పనులను చేయడానికి ప్రయత్నించండి . ఇది ఒక ప్రభావంతమైనదిగా పనిచేస్తుంది. ఎక్కువ సమయం మీ బేబీతో గడపడానికి ప్రయత్నించండి. దాంతో డిప్రెషన్ మరియు స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి సహాపడుతుంది.

యోగా :
పోస్ట్ నేటల్ యోగా: ప్రసవం తర్వాత మీ బరువును తగ్గించుకోదలచుకొన్నప్పుడు. మీరు యోగా క్లాస్సుల్లో చేరడం బెటర్. ఇది మీరు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

కొన్నివ్యక్తిగత మార్పులు:
చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత వారి మీద శ్రద్ద ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి, వ్యక్తిగతంగా అందం, ఆరోగ్యం మీద కొంత శ్రద్ద తీసుకోవడం మంచిది. బరువు తగ్గడం, మరియు బ్యూటీ సలోన్స్ కు వెళ్ళడం మిమ్మల్ని మీరు అందంగా మార్చుకోవడం చేయాలి.



Click it and Unblock the Notifications
