Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కొత్తగా తల్లైన వారికి ప్రసవం తర్వాత బాడీ మసాజ్ తో పొందే ఆరోగ్య ప్రయోజనాలు
ప్రసవం తర్వాత తల్లి తన ఆరోగ్యం చూసుకోవటానికి సమయం వుండదు. ఆమెకు రాత్రి, పగలు బిడ్డ ధ్యాసే అధికంగా వుంటుంది. అదే సమయంలో ఆమె శారీరక నొప్పులున్నాయని తెలుపుతుంది. ప్రసవం తర్వాత మహిళలు కొద్దిపాటి బరువు పెరుగుతారు. తమ పూర్వపు శరీర రూపం పొందాలనేది వారి ధ్యేయంగా వుంటుంది.
అందుకుగాను వారు ఏం చేయాలి? వారు ప్రసవం తర్వాత మసాజ్ చేయించుకోవాలి. దీన్నే పోస్ట్ నేటల్ మసాజ్ అంటారు. పోస్ట్ నేటల్ మసాజ్ వల్ల సౌందర్య, శరీర నొప్పులు మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలు కూడా చూడండి...

విశ్రాంతి:
కాన్పు తర్వాత మహిళలకు ఒత్తిడి వుంటుంది. తన బిడ్డకు అధిక సమయం కేటాయించడంతో కొత్త తల్లి శారీరకంగా, మానసికంగా అలసిపోతుంది. కనుక, అలసిన శరీరానికి మసాజ్ చాలా అవసరం.

శారీరక నొప్పులు:
కాళ్ళలో, తొడలలో, చేతులు, మెడ, వీపు వంటివి కాన్పు తర్వాత నొప్పులు పెడతాయి. మసాజ్ చేస్తే వీటినుండి విముక్తి పొందవచ్చు. మసాజ్ రాత్రివేళ చేస్తే మంచిది. నిద్రించేముందు కొద్ది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. లేదా భర్త సహాయం తీసుకుని మసాజ్ చేయించుకోవాలి. నొప్పిలేని నిద్ర పడుతుంది.

స్ట్రెచ్ మార్కులు:
ప్రసవానంతరం పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులు మసాజ్ తో తగ్గుతాయి. మంచి నూనెలు వాడి మసాజ్ చేయించాలి. చర్మం - చర్మంపై అప్పటివరకు వున్న మృతకణాలు మసాజ్ తో తొలగిపోతాయి. బరువు తగ్గుట: కాన్పు ముందరి శరీర రూపం పొందాలంటే, పొట్ట తగ్గాలంటే, శరీర కొవ్వు కరగాలంటే మసాజ్ తప్ప మరోమార్గం లేదు.

పాలు ఉత్పత్తి:
ఆమెలోని పాలగ్రంధులు అధిక ఉత్పత్తి చేయాలంటే మసాజ్ సహకరిస్తుంది. స్తనాలు మసాజ్ చేస్తే పాలు అధికమవటమే కాక, రొమ్ములు వేలాడకుండా వుంటాయి. అంతవరకు అడ్డగించబడిన పాలగ్రంధులకు రక్తప్రసరణ బాగా జరిగి ఉత్పత్తి అధికమవుతుంది.

కండరాలు బిగువు:
కాన్పు సమయంలో ఆమె కండరాలు వదులవుతాయి. కాన్పు తర్వాత చేసే మసాజ్ కు కండరాలు మరోమారు ఫిట్ నెస్ సంతరించుకుంటాయి.

రక్త సరఫరా:
శరీర మసాజ్ శరీరమంతా రక్తప్రసరణ వుండేలా చేస్తుంది. నొప్పి దూరమవటమే కాక, అది ఆక్సిజన్ అధికంచేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. మహిళలకు పోస్ట్ నేటల్ మసాజ్ వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి.

డెలివరీ తర్వాత శరీరానికి కొంత విశ్రాంతి కావాలి.
డెలివరీ తర్వాత శరీరానికి కొంత విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి మసాజ్ తర్వాతి దశలో దొరుకుతుంది. మసాజ్ చేసేటపుడు గోరు వెచ్చటి నూనెలు ఉపయోగించండి. ఈ మసాజ్ ఇంటివద్దే చేసుకొనవచ్చు.

బరువు తగ్గుట -
కాన్పు ముందరి శరీర రూపం పొందాలంటే, పొట్ట తగ్గాలంటే, శరీర కొవ్వు కరగాలంటే మసాజ్ తప్ప మరోమార్గం లేదు.

స్ట్రెచ్ మార్కులు -
ప్రసవానంతరం పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులు మసాజ్ తో తగ్గుతాయి. మంచి నూనెలు వాడి మసాజ్ చేయించాలి.

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ -
చర్మంపై అప్పటివరకు వున్న మృతకణాలు మసాజ్ తో తొలగిపోతాయి. బాలింతలకు మసాజ్ చేయటం వలన ఈ ప్రయోజనాలు చేకూరుతాయి.



Click it and Unblock the Notifications