For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిజేరియన్ తర్వాత కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

సిజేరియన్ సర్జరీ తర్వాత.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ డెలివరీ కంటే.. సిజేరియన్ తర్వాత.. శరీరంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. త్వరగా కోలుకోవాలంటే.. కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటించాలి.

By Swathi
|

సిజేరియన్ చేయించుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఇంట్లో వాళ్లు కూడా సిజేరియన్ మంచిది కాదని సూచిస్తుంటారు. కానీ.. తల్లి, బిడ్డ ఆరోగ్యంపై రిస్క్ పడకుండా.. తగ్గించడానికి ఇదొక్కటే దారిగా మారింది. కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో సిజేరియన్ చేయక తప్పడం లేదు.

caesarean

అయితే సిజేరియన్ సర్జరీ తర్వాత.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ డెలివరీ కంటే.. సిజేరియన్ తర్వాత.. శరీరంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి.. త్వరగా కోలుకోవాలంటే.. కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటించాలి.

ఇక్కడ సూచించిన ఈ 10 టిప్స్ ని ఫాలో అయితే.. సిజేరియన్ తర్వాత చాలా త్వరగా, తేలికగా కోలుకోవడానికి సహాయపడతాయి.

చలన శక్తి

చలన శక్తి

శరీరంలో ఫ్లూయిడ్స్ తొలగించిన తర్వాత.. కదలడం మొదలుపెట్టాలి. నర్సుల సహాయంతో ముందుగా కదలాలి. ఇలా చేయడం వల్ల..త్వరగా కోలుకోవచ్చు. అయితే నెమ్మదిగా కదలడం మొదలుపెట్టాలి.

మెడిసిన్స్

మెడిసిన్స్

డాక్టర్ సూచించిన మెడిసిన్స్ ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. దీనివల్ల త్వరగా కోలుకోవచ్చు. అలాగే సర్జరీ జరిగిన పార్ట్ లో తడి తగలకుండా జాగ్రత్తపడాలి.

డైట్

డైట్

సర్జరీ తర్వాత.. చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి. లేదా అసలే తీసుకోకూడదు. తీసుకోవచ్చు అన్న తర్వాత.. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్ డైట్ ని కొన్ని రోజులు ఫాలో అవ్వాలి.

అర్జంట్ అయినప్పుడే యూరిన్ కి

అర్జంట్ అయినప్పుడే యూరిన్ కి

బాగా అర్జంట్ అయినప్పుడు యూరిన్ కి వెళ్లాలి. లేదంటే.. మీ ఇబ్బందిగా ఉంటుంది. ఆ నొప్పి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది.

బరువు ఎత్తకూడదు

బరువు ఎత్తకూడదు

సిజేరియన్ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో బరువు ఎత్తకూడదు. లేదంటే.. సర్జరీ అయిన దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కొన్ని వారాలపాటు ఒత్తిడికి గురికావద్దు.

అనుకూలమైన పొజిషన్ లో నిద్రపోండి

అనుకూలమైన పొజిషన్ లో నిద్రపోండి

స్ట్రిచెస్ వేసిన తర్వాత.. కోలుకోవడం మొదలుపెట్టిన తర్వాత.. మీరు సైడ్ కి తిరిగి పడుకోవాల్సి ఉంటుంది. నిద్రపోయేటప్పుడు.. అనుకూలంగా నిద్రపోయేలా జాగ్రత్తపడండి. అలా అయితేనే.. మీ శరీరానికి కావాల్సిన రెస్ట్ దొరుకుతుంది.

వ్యాయామం వద్దు

వ్యాయామం వద్దు

సర్జరీ తర్వాత.. శరీరానికి కొంత సమయం ఇవ్వాలి. బిగుతుగా ఉండే జీన్స్, లెగ్గింగ్స్ వేసుకోకూడదు. ఇవి పొట్టపై ఒత్తిడి పెంచుతాయి. ఇది చాలా డేంజరస్. నెమ్మదిగా నడవడం వంటి వ్యాయామాలు చేయడం. ఎక్కువగా కదలడం వంటి వాటికి కాస్త సమయం కేటాయించాలి.

బేబీ దగ్గరే ఉండటం లేదా పడుకోవడం

బేబీ దగ్గరే ఉండటం లేదా పడుకోవడం

బేబీ దగ్గర లేదా పక్కనే పడుకోవడం, గడపడం వల్ల వాళ్లకు పాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎక్కువ శరీరంపై ఒత్తిడి పడదు. కాబట్టి.. దగ్గరే ఉండేలా చూసుకోండి. ఆపరేషన్ జరిగిన భాగంలో ఒత్తిడి పడకుండా.. జాగ్రత్త పడండి.

సెక్స్ వద్దు

సెక్స్ వద్దు

సిజేరియన్ తర్వాత మొదటి 40రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సూచిస్తుంటారు. కానీ.. ఈ సమయంలో సెక్స్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే.. శారీరకంగా ఫిట్ గా ఉండలేరు. కాబట్టి.. కొంతకాలం సెక్స్ కి దూరంగా ఉండటం మంచిది.

కాన్ట్సిపేషన్ వద్దు

కాన్ట్సిపేషన్ వద్దు

సిజేరియన్ తర్వాత ఒత్తిడితో, నొప్పితో కూడిన కాన్ట్సిపేషన్ వద్దు. పొట్టపై ప్రెజర్ పెట్టడం డేంజరస్. కాబట్టి.. మీకు సరిపడే వాటర్ డైట్ ఫాలో అయితే.. సరిపడా నీళ్లు తాగితే.. కాన్ట్సిపేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.

English summary

10 Things To Do After C-Section To Recover Faster

10 Things To Do After C-Section To Recover Faster. These 10 things are important to follow for women who have undergone a caesarean surgery to deliver their child to recover faster.
Story first published: Thursday, October 27, 2016, 10:41 [IST]
Desktop Bottom Promotion