Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ప్రసవం తర్వాత వాళ్ల శరీరంలో జరిగే 9 మార్పులు
కొత్తగా తల్లైన వాళ్లు ప్రతి క్షణం ఆనందంతో.. తియ్యని జ్ఝాపకాలతో గడుపుతారు. ఈ క్షణాలు జీవితంలో నిలిచే ఒక మధుర జ్ఝాపకాలుగా నిలుస్తాయి. మీకు ఇష్టమైన వాళ్లు మీ మీద తీసుకొనే ప్రేమ, జాగ్రత్తలు, మీతో గడిపే ప్రతి క్షణం, అప్పుడప్పుడే పుట్టిన బిడ్డకోసం వారు చూపించే ప్రేమ, ఇష్టం, శిశువు చిరునవ్వు, అదే సమయంలో మీ బిడ్డకు పెట్టాల్సిన పేర్లతో బిజీగా గడపటం వల్ల మహిళ జీవితంలో ఇవన్నీ కొత్తగా వచ్చే అనుభూతులు.
మహిళ జీవితంలో గర్భం ధరించడం, ప్రసవం రెండు ముఖ్యమైన విషయాలు. దాంతో మహిళ యొక్క జీవన శైలి క్రమంగా మార్పు చేసుకుంటుంది. అన్నిరకాలుగాను సర్ధుకు పోవడం, శిశువు తీసుకొనే ఆహారం, విశ్రాంతి, ఇతర డైలీ హ్యాబిట్స్ లో మార్పులు చేసుకోవడం జరుగుతుంది. ఆమె దినచర్య నుంచి కొన్ని సహజంగా, సాధారణంగా చేసే పనులను షెడ్యూల్ చేసుకుటుంది. మిగిలిన సమయంలో బిడ్డతో గడుపుతుంది .

అమ్మాయిలు నైట్ ఔట్స్, మూవీస్, టీవీ సీరియల్స్ చూడటం మొదలగు ఎన్నో అలవాట్లు ఉన్నప్పటికీ, ప్రసవం తర్వాత వీటన్నింటినీ పిల్లల కోసం మార్పులు చేసుకుంటారు. ఏదైమైనా కొత్తగా తల్లైన స్త్రీలో తల్లి యొక్క ప్రేమ, ఇష్టం పూర్తిగా బిడ్డకోసమే చేస్తుంది. అలాగే కొత్తగా తల్లైన తర్వాత మహిళలో కొన్ని మార్పులు చేసుకుంటాయి. అవేంటో తెలుసుకుందాం...

తరచూ అలసట:
కొత్తగా తల్లైన వాళ్లు అప్పుడే పుట్టిన బేబీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆమె వివిధ రకాలుగా పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఆమె ఎక్కువ అలసిపోతుంది. బేబీ ఏడ్చినప్పుడతంతా పాలు పట్టడం, రాత్రుల్లో అదనపు గంటలు నిద్రమేలుకోవడం వల్ల తల్లిలో అలసట వస్తుంది.

చికాకు:
శిశువు జన్మించిన తర్వాత , ప్రసవించిన తల్లిలో ప్రెగ్నెన్సీ హార్మోన్లు తిరిగి క్రమబద్దం అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. అది కొత్తగా తల్లైన వారిలో చీకాకును, అలసటను కలిగిస్తాయి.

రతి మీద ఆసక్తి ఉండదు:
బిడ్డ పుట్టిన తర్వాత మహిళ శరీరం రికవర్ అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి, ప్రసవం తర్వాత కొన్ని రోజులు ఆమె సెక్సువల్ ఇంటర్ కోర్సు ఇష్టపడదు.

స్ట్రెచ్ మార్క్స్ :
స్ట్రెర్చ్ మార్క్స్ గర్భిణీలకు సాధారణం. చైల్డ్ బర్త్ తర్వాత ఆమెలో స్ట్రెచ్ మార్క్స్ పెరగడం, సైజ్ చిన్నగా లేదా పెద్దగా అవ్వడం జరుగుతుంది. వేగంగా స్కిన్ టిష్యులు స్ట్రెచ్ అవ్వడం వల్ల పొట్ట చుట్టు స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.

దుస్తులు ఫిట్ గా ఉండవు:
ఇష్టమైన , అందమైన దుస్తులను ప్రసవం తర్వాత ధరించాలనుకుంటారు కానీ, అది జరగదు, ప్రసవం తర్వాత అవి మీకు సరిగా ఫిట్ కాకపోవచ్చు . పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది .

చాతీ సున్నితంగా ఉంటుంది:
చాతీ చాలా సున్నితమైన ప్రదేశం. కొన్ని సందర్భాల్లో నొప్పిగా కూడా ఉంటుంది. ఇది హార్మోనల్ అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది. బేబీకి పాలు పట్టడం వల్ల కూడా రొమ్ములు మరింత సున్నితంగా మారుతాయి.

జుట్టు రాలడం :
చాలా మంది మహిళల్లో ఈ సమస్య ఉంటుంది. ప్రసవం తర్వాత మహిళల్లో హార్మోనులు తిరిగి పూర్వస్థితికి వచ్చే సమయంలో బేబీ చూసుకొనే సమయంలో ఒత్తిడి వల్ల జుట్టు రాలే సమస్యలుంటాయి.

తరచూ మూత్ర విసర్జన:
బిడ్డ పుట్టిన తర్వాత కూడా మహిళ శరీరంలో కొన్ని భాగాలు, నొప్పులు, సలుపులు కలిగి ఉంటాయి. కొన్ని బాగాల మీద ఒత్తిడి పడటం వల్ల యూరిన్ పోవాలనిపిస్తుంటుంది. సాధారణంగా కంటే ఎక్కువసార్లు బాత్రూమ్ కు వెళ్లాలనిపిస్తుంది.

ఆకలి ఎక్కువగా ఉంటుంది:
హార్మోనులు అసమతౌల్యత వల్ల, బేబీ ఫీడింగ్ వల్ల తల్లిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో హెల్తీ డైట్ తీసుకోవడం చాలా అసవరం.



Click it and Unblock the Notifications