For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...

|

ప్రెగ్నెన్సీ సమయంలో.. పొట్ట, తొడలు, ఛాతీభాగాలలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఒక్కసారి స్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయంటే వాటిని తొలగించడం చాలా కష్టం. ప్రెగ్నెన్సీ తరువాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్‌ స్త్రీలను చాలా ఆందోళనకు గురిచేస్తుంటాయి. వాటిని కనిపించకుండా చేయడం కోసం వాళ్లు నానా తంటాలు పడుతుంటారు. అయితే అవి పూర్తిగా తొలగిపోకున్నా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కనిపించకుండా చేసుకోవచ్చు.

స్ట్రెచ్ మార్క్స్ ను నివారించేందుకు కొన్ని నేచురల్ పద్దతులు:

తేనె :

తేనె :

తేనెలో స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . వీటితో పాటు హైడ్రేటింగ్ గుణాలు ప్రసవం తర్వాత ఏర్పడే స్ట్రెచ్ మార్క్ లను కనబడనివ్వకుండా చేస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో తేనెను అప్లై చేయాలి. తేనె అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . తేనెకు కొద్దిగా గ్లిజరిన్ మిరయు సాల్ట్ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మరింత బెటర్ ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసం ఒక బెస్ట్ హోం రెమెడీ. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . నిమ్మరసంను ప్రతి రోజూ చారల మీద అప్లై చేయడం వల్ల, చారలు కనబడకుండా చేస్తుంది

ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్ :

ప్రసవం తర్వాత గర్భినీ పొట్ట మీద కనబడే స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడానికి ల్యావెండర్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది . ల్యావెండర్ ఆయిల్లో ఉండే గుణాలు స్ట్రెచ్ మార్క్స్ ను చాలా ఎపెక్టివ్ గా తొలగిస్తుంది. రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

చర్మ సంరక్షణలో ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీన్స్ స్కిన్ సెల్స్ ను రీబిల్డ్ చేస్తుంది . దాంతో చర్మం ఫ్రెష్ గా మరియు అందంగా కనబడేలా చేస్తుంది.

అలోవెర:

అలోవెర:

పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత గర్భిణీలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్ ను తొలగించుకోవడానికి అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ కనపడకుండా చర్మంలో కలిసిపోతాయి . అంతే కాదు, ఇతర స్కిన్ సమస్యలను నివారించడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. స్ట్రెచ్ మార్క్స్ ఉన్నప్రదేశంలో అలోవెర జెల్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి

English summary

Ways To Reduce Stretch Marks Post Pregnancy

Ways To Reduce Stretch Marks Post Pregnancy,Stretch mark can usually be noticed in the abdomen, hips, arms or thigh region. In some cases, stretch marks are a result of heredity. It is likely to affect if the weight gain is more than average in pregnancy. Even though many chemically formulated creams claim to
Story first published: Thursday, May 26, 2016, 17:32 [IST]
Desktop Bottom Promotion