For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంటిపిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఆరు నెలల వరకు ఇస్తే మంచిదా లేదా ఏడాది పాటు కొనసాగించాలా?

పాపాయికి బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం విషయంపై WHO మరియు UNICEF లు ఏమని సిఫార్సు చేశాయి?ప్రపంచవ్యాప్తంగా, ఒక సంవత్సర కాలంలో సంభవించే శిశుమరణాలలో 45 శాతానికి పోషకాహారలోపం ప్రధాన కారణమని తెలుస్తోంది. శిశు

|

పాపాయికి బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం విషయంపై WHO మరియు UNICEF లు ఏమని సిఫార్సు చేశాయి?

ప్రపంచవ్యాప్తంగా, ఒక సంవత్సర కాలంలో సంభవించే శిశుమరణాలలో 45 శాతానికి పోషకాహారలోపం ప్రధాన కారణమని తెలుస్తోంది. శిశువులలో పోషకాహారలోపాన్ని నిర్మూలించడానికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రముఖపాత్ర పోషిస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)తో పాటు యునిసెఫ్ (UNICEF) సిఫార్సు చేస్తోంది.

time line for breastfeeding

శిశువుకి రెండేళ్ల వయసు వచ్చే వరకు వారిని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఈ సమయంలో అందించడం ముఖ్యమైన విషయం. ఈ సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్ ను తగినంతగా శిశువుకు అందిస్తే వారిని పోషకాహారలోపం సమస్య వేధించదు. తద్వారా, వారిలో ప్రాణాంతక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం తగ్గుతుంది.

Who మరియు UNICEF సిఫార్సులు శిశువు జన్మించిన గంటలోపే బ్రెస్ట్ ఫీడింగ్ ని ప్రారంభించి శిశువుని కేవలం బ్రెస్ట్ ఫీడింగ్ అనే ఆహారంపైనే మొదటి ఆరునెలల వరకు సంరక్షించుకోవాలి. ఆరునెలల తరువాత సురక్షిత పోషకాహార సాలిడ్ పదార్థాలను ఇస్తూ బ్రెస్ట్ ఫీడింగ్ ని రెండేళ్ల వరకు ఆపై కూడా కంటిన్యూ చేయడానికి ప్రయత్నించాలి.

ఈ ఆర్టికల్ లో, శిశువుల ఆరోగ్యాన్ని సంరక్షించటం కోసం బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పటి వరకు ఇవ్వాలో తెలుసుకుందాం. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ వలన కలిగే లాభాలను తెలుసుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి.

1. బ్రెస్ట్ ఫీడింగ్ టైం లైన్ & లాభాలు

1. బ్రెస్ట్ ఫీడింగ్ టైం లైన్ & లాభాలు

కొత్తగా తల్లైన వారికి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి సరైన అవగాహన ఉండదు. ఎంతకాలం పాటు పసిపిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే మంచిదో వారికి పూర్తిగా తెలియదు. అందుకే, బ్రెస్ట్ ఫీడింగ్ వలన పసిపిల్లలకు కలిగే లాభాల గురించి దిగువన వివరించాము. వీటిని చదివి తెలుసుకోండి.

2. శిశువుకు ఆరువారాల సమయంలో తల్లిపాలతో లభించే లాభాలు

2. శిశువుకు ఆరువారాల సమయంలో తల్లిపాలతో లభించే లాభాలు

మొదటి వ్యాక్సిన్

శిశువు జన్మించిన మొదటి రెండు వారాల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం వలన శిశువుకు తగినంత కొలోస్ట్రం లభిస్తుంది. ఇది పాపాయికి మొదటి వ్యాక్సిన్ గా పనిచేస్తుంది.

నయం చేస్తుంది

బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా విడుదలైన ఆక్సిటాసిన్ తల్లిని త్వరగా కోలుకునేలా చేస్తుంది.

3. 1 నెల నుండి 6 వారాల శిశువుకు తల్లిపాల ద్వారా లభించే లాభాలు

3. 1 నెల నుండి 6 వారాల శిశువుకు తల్లిపాల ద్వారా లభించే లాభాలు

రోగనిరోధక వ్యవస్థ రూపొందించడానికి సహాయపడుతుంది

బ్రెస్ట్ ఫీడింగ్ వలన శిశువులలో సరైన పరిణతి చెందిన రోగనిరోధక వ్యవస్థ రూపొందటం జరుగుతుంది.

వ్యాధులను అరికడుతుంది

ఈ దశలో తల్లిపాలు శిశువుకి లభించడం వలన శిశువులకు చెస్ట్ ఇన్ఫెక్షన్స్ సమస్య నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే, జీర్ణసమస్యలు, అలర్జీలు కూడా తలెత్తవు.

4. రెండునెలల శిశువుకు తల్లిపాల నుంచి లభించే లాభాలు

4. రెండునెలల శిశువుకు తల్లిపాల నుంచి లభించే లాభాలు

SIDS కి గురయ్యే ప్రమాదం తక్కువ

తల్లిపాలను కనీసం రెండునెలల వరకు శిశువులకు అందిస్తే ఆకస్మిక శిశుమరణాలు సంభవించవు.

ఫుడ్ అలర్జీలు తక్కువ

తల్లిపాలు తాగే శిశువులలో మూడేళ్ళ వయసు వరకు ఫుడ్ అలర్జీలు వచ్చే అవకాశం తక్కువ.

5. మూడు నుంచి నాలుగు నెలల శిశువుకు బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కలిగే లాభాలు

5. మూడు నుంచి నాలుగు నెలల శిశువుకు బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కలిగే లాభాలు

ఆస్తమాకు గురయ్యే ప్రమాదం తక్కువ

మూడు నుంచి నాలుగు నెలల వరకు తల్లిపాలనే ఆహారంగా తీసుకునే శిశువులో ఆస్తమా సమస్య తలెత్తే అవకాశాలు తక్కువ. అంతే కాదు, మిగతా శ్వాసకోశ వ్యాధులు కూడా శిశువులో తలెత్తవు.

డయాబెటిస్ సమస్య తలెత్తే ప్రమాదం తక్కువ

3 నుంచి 4 నెలల వరకు తల్లిపాలపై ఆధారపడి శిశువులలో డయాబెటిస్ సమస్య తలెత్తే ప్రమాదం తక్కువ.

పోస్ట్ పార్టం డిప్రెషన్ ను అరికడుతుంది

శిశువుకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ను ఇవ్వడం వలన తల్లులలో ప్రసవానంతరం ఎదురయ్యే డిప్రెషన్ సమస్య తొలగిపోతుంది.

6. శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలను ఇవ్వడం వలన

6. శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలను ఇవ్వడం వలన

చెవి ఇన్ఫెక్షన్స్ తలెత్తే ప్రమాదం తక్కువ

శిశువుకి మొదటి ఆరు నెలల వరకు లభించే తల్లిపాల వలన చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తలెత్తే ప్రమాదం తగ్గుతుంది.

క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తక్కువ

చిన్నతనంలో సోకే అనేకరకముల క్యాన్సర్ ప్రమాదాల నుంచి శిశువుకి రక్షణ లభిస్తుంది. శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.

బ్రెస్ట్ కాన్సర్ కు తల్లి గురయ్యే ప్రమాదం తక్కువ

ఆరు నెలల వరకు తన శిశువుకి బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం వలన బ్రెస్ట్ కాన్సర్ కి గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

7. 9 నెలల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం వలన

7. 9 నెలల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం వలన

శిశువు చురుకుగా ఉండి స్వతంత్ర భావాలతో ఎదుగుతుంది

తొమ్మిది నెలల పాటు తల్లిపాలు లభించడం వలన మీ చిన్నారిలో చురుకుదనం పెరిగి స్వతంత్ర భావాలు ఏర్పడతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్నారి ఉత్సాహంగా ఉంటుంది.

ఎదుగుదల వేగంగా ఉంటూ గాయాలు మానే గుణం వృద్ధి

నిర్దేశిత సమయం ప్రకారం తల్లిపాలు లభించే శిశువులలో ఎదుగుదల సవ్యంగా వేగంగా ఉంటుంది. అలాగే, ఎదుగుతున్న దశలో పడిపోతూ గాయాలు చేసుకున్నా వారికి వెంటనే కోలుకునే శక్తి లభిస్తుంది.

8. ఒక సంవత్సరం పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం వలన

8. ఒక సంవత్సరం పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం వలన

ఆర్థికంగా ఉపయోగం

ఫార్ములా మిల్క్ పై ఆధారపడకుండా బ్రెస్ట్ మిల్క్ ని ఒక సంవత్సరం పాటు మీ శిశువుకి అందించటం వలన ఆర్థిక ఉపయోగంతో పాటు శిశువు ఆరోగ్యంగా ఉండటం కూడా జరుగుతుంది.

అధిక బరువు సమస్య తలెత్తదు

శిశువుకు ఒక సంవత్సరం నిండే వరకు తల్లిపాలను పట్టడం వలన వారిలో అధిక బరువు సమస్య తలెత్తదు. వారు పెద్దయిన తరువాత కూడా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడరు.

గుండెజబ్బులు తలెత్తే ప్రమాదం తక్కువ

ఏడాది పాటు తల్లిపాలపై ఆధారపడే శిశవులలో గుండె ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా వారు గుండెజబ్బులకు గురయ్యే ప్రమాదం తక్కువ.

ఆర్థోడోంటిక్ చికిత్స తీసుకునే అవసరం తక్కువ

తల్లిపాలను త్రాగే క్రమంలో నోటిని అలాగే పళ్ళను ఒక క్రమంలో కదిలించడం వలన శిశువులకు చక్కటి పళ్ళు ఏర్పడతాయి. ఏడాది పాటు తల్లిపాలను తాగే శిశవుల పలువరస ముచ్చటగా ఉంటుంది. అందుకే, ఏడాది పాటు తల్లిపాలు త్రాగే శిశువులకు భవిష్యత్తులో కూడా ఆర్థోడోంటిక్ చికిత్స అవసరం కాకపోవచ్చు.

స్పీచ్ థెరపీ అవసరం తక్కువ

ఏడాది వరకు తల్లిపాలను త్రాగే శిశువులకు స్పీచ్ థెరపీ అవసరం ఉండకపోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ వలన శిశువులలో నోటితో పాటు నాలుక కండరాల ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఈ కండరాలే మాట్లాడేందుకు ఉపయోగపడతాయి.

బ్రెస్ట్ ఫీడింగ్ ని ఆరు నెలల వరకు ఇస్తే మంచిదా లేదా ఏడాది పాటు కొనసాగించాలా?

బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్ లైన్ ను మీరు గమనిస్తే ఈ పాటికే ఆయా దశలలో బ్రెస్ట్ ఫీడింగ్ వలన కలిగే లాభాలను గుర్తించి ఉంటారు. ఆరు నెలల పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ని ఇవ్వడం వలన లాభాలు అనేకం ఉన్నా కనీసం ఏడాది పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ను కొనసాగిస్తే శిశువులను అనేక వ్యాధుల నుంచి రక్షించినవారవుతారు. ఏడాది పాటు బ్రెస్ట్ ఫీడింగ్ ను ఇవ్వడం మంచిది. కుదరదని అనుకుంటే, కనీసం ఆరు నెలల వరకైనా బ్రెస్ట్ ఫీడింగ్ ను ఇవ్వడం తప్పనిసరని గుర్తించండి.

1 సంవత్సరం దాటిన తరువాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ను కొనసాగించాలా?

UNISEF తో పాటు WHO సిఫార్సుల ప్రకారం ఏడాది తరువాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ను కొనసాగించాలి. తల్లిపాల ద్వారా లభించే పోషకవిలువలు అనేకం. అవెప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంటాయి. అందుకే రెండేళ్ల వరకు ఆపై కూడా చిన్నారులకి తల్లిపాలను అందివ్వడం ముఖ్యం. మీ శిశువు ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఇది సరైన మార్గం. శిశువు యొక్క మానసిక అభివృద్ధికి కూడా తల్లిపాలు తోడ్పడతాయి. తల్లిపాలు త్రాగడం వలన శిశువులకు భద్రతగా అనిపిస్తుంది.

అయితే, రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న చిన్నారులకు తల్లిపాలతో లభించే ఐరన్ కంటే ఎక్కువ మోతాదులో ఐరన్ అవసరపడుతుంది. అందుకే, సరైన పోషకాహారాన్ని అందిస్తూ తల్లిపాలను కూడా పట్టాలి. ఐరన్ ఎక్కువ మోతాదులో కలిగిన ఆహారపదార్థాలను అందించాలి.

English summary

time line for breastfeeding | benefits of feeding a baby for a particular time |breastfeeding 6 Months vs 1 Year

The first two years of the baby's life is considered very important for the overall well-being and growth. Breastfeeding during this period has been proved to help reduce mortality and morbidity.
Desktop Bottom Promotion