For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత కరీనా కపూర్ పుల్ స్లిమ్..సీక్రెట్ ఏంటో తెలుసా?

By Lekhaka
|

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ భారతీయ చిత్ర పరిశ్రమని ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆమె అద్భుతమైన బాడీ షేప్ తో, జీరో ఫిగర్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. ప్రపంచం మొత్తం ఆమె ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అని ఎదురుచూస్తున్న సందర్భంలో ఆమె తల్లైంది. అయితే ప్రసవం తర్వాత కరీనా కపూర్ ఎలా ఉంది అని ఫ్యాన్స్ కు సందేహం?

అవును, ప్రతి ఒక్కరూ కరీనా ఫిట్నెస్ రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటారు. కొన్నినెలల క్రితమే ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది, కేవలం రెండునెలల్లోనే, ఆమె ఇపుడు బరువు తగ్గి, మరింత కాంతివంతమైన చర్మాన్ని కలిగి ఉంది.

కరీనా గర్భవతి అయినప్పటికీ, ఇతర బాలీవుడ్ అందగత్తెలలా కాకుండా ఆమె చాలా అందంగా ఉంది. ఆమె ప్రతి విషయంలో నేడు ఉద్యోగం చేసే స్త్రీలకూ ఒక చిహ్నంగా మారింది. కరీనా డెలివరీ తరువాత కూడా బైటికి రావడం అనేది నిజంగా అద్భుత౦.

ఆమె గర్భధారణ సమయంలో 18 కిలోల బరువు పెరిగి, ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో కొన్ని కిలోల బరువు తగ్గింది. అద్భుతం...ఆశ్చర్యంగా లేదు? ఇప్పుడు, ప్రతి ఒక్కరూ కరీనా ఫిట్నెస్ రహస్యం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు.

ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో, ఆమె పూర్వం ఉన్న సాధారణ పరిమాణంలోకి రావాలి, అయితే రాత్రికి రాత్రి మార్పు జరగదు కదా అని చెప్పారు. దానికితోడు ఆమె తేలికగా, సంతోషంగా, శక్తివంతమైన మార్గంలో బరువు తగ్గాలి అనుకుంటున్నారు.

కరీనా కపూర్ డెలివరీ తరువాత ఎలా బరువు తగ్గింది అనే విషయంపై మరికొంత తెలుసుకుందాము...


గ్లాసు పాలు

గ్లాసు పాలు

కరీనా కపూర్ డెలివరీ తరువాత ప్రతిరోజూ బలమైన శరీరాన్ని పొందడానికి, బాడీ షేప్ మెరుగుపరుచుకోవడానికి ఒక పెద్ద గ్లాసు పాలు తీసుకునేవారు. మహిళలు డెలివరీ కి ముందు తరువాత సమయంలో కాల్షియంని కోల్పోతారు. శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి పాలు మంచి ఎంపిక. కరీనా ప్రకారం, ఒక గ్లాసు పాలు తీసుకుంటే తిరిగి ఆకారాన్ని పొందవచ్చని అర్ధం.

మంచినీళ్ళు

మంచినీళ్ళు

కరీనా ముఖ్యమైన ఫిట్నెస్ రహస్యాలలో ఒకటి రోజుకు 8 కంటే ఎక్కువ గ్లాసుల నీరు తాగడం. కరీనా సాధారణంగా రోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు తాగుతుంది. గర్భధారణకు ముందు తరువాత చాలా నీరు అవసరం. కరీనా లాగా మీరూ నీరు తాగడం ప్రారంభించండి, మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోండి.

యోగా

యోగా

కరీనా, ఉత్సాహభారితమైన యోగా అభ్యాసకురాలు. యోగా మన మనసుని, శరీరాన్ని, ఆరోగ్యాన్ని ఖచ్చితంగా సమతుల్యం చేస్తుందని ఆమె చెప్తుంది. కరీనా తన శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా, గట్టిగా ఉంచుకోవడానికి వామప్ లు, పవర్ యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు చేసేది.

స్వచ్చమైన శాఖాహారి

స్వచ్చమైన శాఖాహారి

బాలీవుడ్ అందాల రాణి స్వచ్చమైన శాఖాహారి. ఆమె అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ముసోలి, చీజ్, బ్రెడ్ స్లైస్, పరాటాలు, సోయా మిల్క్, చపాతీలు, పప్పు, ఆకు కూరలు, సూపులు వంటి అనేక రకాల ఆరోగ్యకర కూరగాయలతో నిండి ఉంటుంది. ఇవన్నీ ఆమెకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, బరువు తగ్గడానికి సహాయపడ్డాయి.

ప్రతి రెండు గంటలకు ఒకసారి స్నాక్స్

ప్రతి రెండు గంటలకు ఒకసారి స్నాక్స్

స్నాక్స్ శక్తిని ఇచ్చేవి. కానీ సాధారణంగా, మనం వేపుల్లను, అనారోగ్యకర పదార్ధాలను స్నాక్స్ గా ఇష్టపడతాము. కానీ మన కరీనా కపూర్ ఆమె మధ్యాహ్నం భోజనం మధ్యలో మాత్రమే ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకుంటుంది.

అవి ప్రోటీన్ షేక్ లు లేదా పండ్లు. ఇవి ఎంతో శక్తిని ఇస్తాయి, అలాగే బరువుని కూడా తగ్గిస్తాయి.

కార్డియో వ్యాయామాలు

కార్డియో వ్యాయామాలు

యోగా, కఠినమైన ఆహారంతోపాటు, కరీనా బరువు తగ్గడానికి, శరీరం ఫిట్ గా ఉంచుకోడానికి కార్డియో వ్యాయామాలు చేసేవారు కూడా. ఇది నిజానికి గర్భధారణ తరువాత ఆరోగ్యకరమైన విధానంలో తన మునుపటి రూపాన్ని పొందడానికి చాలా సహాయపడుతుంది. కరీనా గర్భధారణ తరువాత హడావిడిగా కాకుండా చాలా నిదానంగా మార్పు తెచ్చుకోడానికి ప్రయత్నించింది.

నడవడం:

నడవడం:

కొడుకు పుట్టిన తరువాత, కరీనా నిపుణుల సలహాతో నడవడం ప్రారంభించింది. గర్భధారణ తరువాత ఎక్కువ వ్యాయామాలు చేయడం చాలా కష్టం, అందువల్ల అలంటి పరిస్ధితులలో నడక చాలా సహాయపడుతుంది.

యోగా కాకుండా, కొన్ని చిన్న చిన్న కార్డియో వ్యాయామాలు, నడవడం వల్ల ఆరోగ్యంగా, నాజూకుగా ఉండేట్టు చేస్తుంది.

English summary

How Kareena Kapoor Lost Her Weight After Pregnancy

Kareena Kapoor has always amazed the Indian film industry. With her sizzling beauty and size-zero figure, she has stupefied many. Now she's enjoying motherhood, while the whole world is eager to know about her latest looks.
Story first published: Monday, May 29, 2017, 18:30 [IST]