For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లిపాలు పెరగాలంటే ఈ 24 రకాల ఆహారాలు అవసరం!

By Y. Bharath Kumar Reddy
|

మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవమయ్యాక కూడా అంతకంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. బిడ్డను కనగానే ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్లూ, వ్యాధులూ ఆ బిడ్డపై దాడికి సిద్ధమవుతాయి. వాటి నుంచి బిడ్డను కాపాడుకునే శక్తి తల్లికి ఉంటుంది. తన పాల ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొవ్వులూ, చక్కెర్లూ, నీళ్లూ, మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి బిడ్డకూ తల్లిపాలు చాలా అవసరం. అయితే కొందరు తల్లుల్లో పాలు చాలా తక్కువగా ఉంటాయి.

చాలా మంది తల్లులు తమ పిల్లలకు సరిపోయేన్ని పాలు ఇవ్వలేకపోతున్నామని మధన పడిపోతుంటారు. పాలిచ్చే తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారిలో పాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన 24 రకాల ఆహారాలు ప్రతి తల్లిలో పాల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. మరి అవి ఏమిటో చదవండి.

1. వోట్స్

1. వోట్స్

వోట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి త్వరగా జీర్ణం అయ్యే గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ వోట్స్ తో తయారు చేసిన అల్పాహారాలు తీసుకుంటే చాలా మంచిది. వీటిని కొన్నిపండ్లతో కలిపి కూడా వంటకంగా తయారు చేసుకుని తినొచ్చు. అలాగే వీటి ద్వారా స్మూతీస్ తయారు చేసుకవొచ్చు. వీటిద్వారా కుకీలను కూడా తయారు చేసుకుని తినొచ్చు. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మహిళల్లో పాలకు సంబంధించిన సమస్య ఏర్పడదు.

2. మెంతులు

2. మెంతులు

ఇవి కూడా మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి శరీరాన్ని కూడా బాగా కూల్ గా చేస్తాయి. అయితే వీటిని ఒక రోజు రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని వడపోసి నీటిని వేరు చేయాలి. ఆ నీటిని పరగడపునే తాగాలి. అలాగే వీటిని పాలతో కలిసి బ్రౌన్ రైస్ చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఇది పాలను పెంచేందుకు తోడ్పడుతుంది.

3. బచ్చలికూర

3. బచ్చలికూర

ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. మహిళల్లో పాలు సక్రమంగా ఉత్పత్తి కావాలన్నా.. వాటి సరఫరా సక్రమంగా సాగాలన్నా ఐరన్ చాలా అవసరం. ఇది గర్భిణీలకు కూడా చాలా మేలు చేస్తుంది. అందువల్ల బిడ్డలకు పాలిచ్చే తల్లులు బచ్చలి కూరను రోజూ తినడం చాలా మంచిది.

4. వెల్లుల్లి

4. వెల్లుల్లి

ఇది కూడా చాలా మేలు చేస్తుంది. మనం రోజూ వండుకునే వంటల్లో వెల్లులికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. నిత్యం మనం దీన్ని వినియోగిస్తూనే ఉంటాం. అందువల్ల మనం వెల్లుల్లితో ప్రత్యేకంగా ఆహారపదార్థాలు చేసుకుని తినాల్సిన అవసరం లేదు. రోజూ మనం తినే ఆహారాల్లో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను వినియోగిస్తూ ఉంటే చాలు. పాలిచ్చే తల్లులకు వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది.

5. సొరకాయ

5. సొరకాయ

ఇందులో 96 శాతం నీరే ఉంటుంది. అందువల్ల ఇది పాలిచ్చే తల్లులకు చాలా మంచిది. తల్లిపాల మోతాదు పెరగాలంటే శరీరానికి కావాల్సినంత నీరు చాలా అవసరం. దీంతో తయారు చేసిన ఆహారపదార్థాలను తింటూ ఉంటే సమృద్ధిగా పాలు పడతాయి. దీని ద్వారా జ్యూస్ లేదా కర్రీ లేదంటే హల్వ తదితర వాటిని చేసుకుని తినొచ్చు.

6. ఫ్రూట్ జ్యూస్

6. ఫ్రూట్ జ్యూస్

పండ్ల రసాలు కూడా పాలిచ్చే తల్లులకు ఎంతో మేలు చేస్తాయి. నీళ్లుకాకుండా తల్లులు ఈజీగా తీసుకునే ద్రవపదార్ధాలు ఇవే. ఇవి రుచికరంగా ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా తాగేయొచ్చు. సీజన్ బట్టీ అప్పుడు మార్కెట్లో లభించే తాజా పండ్లను తెచ్చుకుని జ్యూస్ చేసుకుని తాగడం చాలా మంచిది.

పుచ్చకాయ, ఆరెంజ్, దానిమ్మ తదితర పండ్ల జ్యూస్ లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ప్రతి పండులో నీటిశాతం అధికంగా ఉంటుంది. అందువల్ల దాదాపు అన్ని రకాల పండ్లతో జ్యూస్ లు చేసుకుని తాగొచ్చు.

7. బాదం

7. బాదం

బాదం పప్పులను రోజూ తీసుకుంటూ ఉండడం చాలా మంచిది. ఒక పది బాదంగింజలను తీసుకుని ఒక గిన్నెలో నీరు పోసి రాత్రంతా నానబెట్టండి.

ఉదయం లేచిన వెంటనే వాటిని తినండి. వీటిలో కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి లాక్టేటింగ్ హార్మోన్లను పెంచుతాయి.

8. బార్లీ

8. బార్లీ

బార్లీలో బీటా గ్లూకోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రోలాక్టిన్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రోలాక్టిన్ అనేది బ్రెస్ట్ ఫీడిండ్ హార్మోన్. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే శరరం హైడ్రేటెడ్ గా ఉండేందుకు బాగా ఉపయోగపడుతుంది.

బార్లీని సూప్ రూపంలో తీసుకోవొచ్చు. లేదంటే బార్లీ నీటిని కూడా తాగొచ్చు.

9. అప్రికోట్

9. అప్రికోట్

ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. హార్మోన్ల అసమతుల్యత సమస్య ఏర్పడకుండా చేస్తాయి. ఎండిన ఆప్రికాట్లను తినడం చాలా మంచిది. వీటిని వోట్ మీల్ తో కలిపి కూడా తీసుకోవొచ్చు.

10. ఆవు పాలు

10. ఆవు పాలు

వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బిడ్డలకు పాలిచ్చే తల్లులు రోజుకు కనీసం రెండు గ్లాసుల పాలను తాగాలి. దీంతో తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో కాల్షియం స్థాయి కూడా పెరుగుతుంది.

11. సోంపు విత్తనాలు

11. సోంపు విత్తనాలు

ఇవి కడుపు ఉబ్బరం సమస్యను ఈజీగా తగ్గిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ వీటిని భోజనం తర్వాత తింటూ ఉంటారు. అలాగే పాలిచ్చే తల్లులకు ఇవి చాలా మంచివి. పాలు సమృద్ధిగా ఉండేలా చేస్తాయి. వీటిని నీటిలో కొద్దిసేపు ఉంచి ఆ నీటిని తాగితే చాలా మంచిది.

12. చిక్ పీ

12. చిక్ పీ

వీటిలో కూడా బచ్చలి కూరలాగానే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బీ కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫైబర్, కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. వీటిని బాగా ఉడికించి రోజూ సాయంత్రం స్నాక్స్ మాదిరిగా తీసుకుంటే చాలామంచిది.

13. బ్రౌన్ రైస్

13. బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ మంచి లాక్టోజెనిక్ ఆహారం అని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే హార్మోన్స్ సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచేందుకు కూడా బ్రౌన్ రైస్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆకలిని కూడా పెంచి బాగా తినేలా చేస్తుంది. మొత్తానికిది మంచి పౌష్టికాహారం.

14. క్యారెట్

14. క్యారెట్

క్యారెట్ లో విటమిన్ - ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది పాల ఉత్పత్తిని పెంచేందుకు అలాగే పాల నాణ్యతకు బాగా ఉపయోగపడుతుంది. ఒకటి లేదా రెండు గ్లాసుల తాజా క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగుతూ ఉంటే చాలా మంచిది. బ్రేక్ ఫాస్ట్ లేదా భోజనం సమయంలో దీన్ని తీసుకోవొచ్చు.

15. మునగ ఆకులు

15. మునగ ఆకులు

మునగలో అధికంగా క్యాల్షియం, ఇనుము.. ఇతర విటమిన్లు ఉంటాయి. మునగ ఆకులు తల్లిపాలు పుష్కలంగా వచ్చేలా చేస్తుంది. ఆకుల్లోనూ, మునగ పూలల్లోనూ యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది విటమిన్‌ సిని కూడా శరీరానికి అందిస్తుంది. వీటిని ఫ్రై చేసుుకుని లేదా అన్నంతో పాటు సూప్ గా, జ్యూస్ తదితర రకాలుగా తీసుకోవొచ్చు.

16. బాసిల్ ఆకులు

16. బాసిల్ ఆకులు

బాసిల్ ఆకులు దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి ప్రాంగణంలో ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఇందులో చాలా ఔషధ గుణాలుంటాయి. తల్లి పాల ఉత్పత్తికి ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఐరన్, థియామిన్, కెరోటిన్, విటమిన్ కె ఉంటాయి. వీటితో తయారుచేసిన టీ రోజుకు రెండుసార్లు తాగొచ్చు.

17. డేట్స్

17. డేట్స్

డేట్స్ కూడా చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరంలో గ్లూకోస్ స్థాయిలు సమర్థంగా ఉండేలా ఉపయోగపడతాయి. వీటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. తల్లుల్లో పాల ఉత్పత్తికి డేట్స్ బాగా సహాయపడతాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ మాదిరిగా తీసుకోవొచ్చు.

18. సాల్మన్ చేపలు

18. సాల్మన్ చేపలు

ఇక వీటికి మించిన పోషకపదార్థాలు ఎందులోనూ ఉండవని నిక్కచ్చిగా చెప్పొచ్చు. వీటిలో ఒమేగా -3 , ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ తల్లుల్లో పాలు ఉత్పత్తికి చాలా ఉపయోగపడతాయి. అందువల్ల వీలైనప్పుడల్లా సాల్మన్ చేపలనూ తింటూ ఉండండి.

19. యోగర్ట్

19. యోగర్ట్

యోగర్ట్ లో కాల్షియం అధికంగా ఉంటుది. ప్రోబయోటిక్స్ కూడా చాలా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పని తీరును ఇది మెరుగపరుస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన కాల్షియాన్ని కూడా యోగర్ట్ అందిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు పాలిచ్చే తల్లులకు చాలా అవసరం. అందువల్ల యోగర్ట్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

20. గుడ్లు

20. గుడ్లు

వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఎ, కాల్షియం ఇతర పోషకాలన్నీ వీటిలో ఉంటాయి. ఇవి తల్లుల్లో పాలు సమృద్ధిగా ఉండేలా చేస్తాయి. రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకుంటే సరిపోతుంది.

21. గ్రీన్ బొప్పాయి

21. గ్రీన్ బొప్పాయి

పక్వానికి రాని బొప్పాయిను తింటే చాలా మంచిది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని యోగార్ట్ తో పాటు లేదా తృణధాన్యాలతో కలిపి లేదా సలాడ్ గా కూడా తయారు చేసుకుని తీసకోవొచ్చు.

22. నువ్వులు

22. నువ్వులు

వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని తరుచూ తీసుకుంటే తల్లుల్లో పాలు సమృద్ధిగా ఉంటాయి. నువ్వుల గింజల నూనెతో వంటలను కూడా తయారు చేసుకోవొచ్చు. అలాగే నువ్వులతో రకరకాల పదార్థాలను తయారు చేసుకుని తినొచ్చు.

23. చిలగడదుంపలు

23. చిలగడదుంపలు

ఇవి కూడా తల్లుకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. బీటా కెరోటిన్ క్యారెట్లలో కూడా అధికంగా ఉంటుంది. వీటి ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది.

24. లెగ్యూములు

24. లెగ్యూములు

కాయధాన్యాలు, బీన్స్, ఎండిన స్ల్పిట్ బఠానీలు ఇలారకరకాల ఆహారాలు ఇందులోకి వస్తాయి. ఇవి పాల ఉత్పత్తిని పెంచుతాయి. వీటిలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందువల్ల రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.

English summary

twenty four foods to increase breast milk

It is only that these 24 foods mentioned below must be had in excess and quite frequently as long as you plan to breastfeed your baby.
Story first published: Saturday, November 18, 2017, 10:17 [IST]