For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటూ పాపాయి నిద్రలోకి జారుకుందా? మీ పాపాయి ఆకలి తీరిందో లేదో తెలుసుకోండిలా.

|

చిన్నారులు పాలు త్రాగుతూ నిద్రలోకి జారిపోవడం సహజమే. దీనిని, సాధారణంగా హెల్తీ కండిషన్ గానే పరిగణిస్తారు. కడుపు నిండిన తరువాతే మత్తుగా నిద్రలోకి జారుకుంటారు. అయితే, మీ పాపాయి తరచూ ఇలా చేస్తూ ఉంటే అదీ పాలు త్రాగడం మొదలు పెట్టీ పెట్టగానే నిద్రలోకి జారిపోతూ ఉంటే మాత్రం మీరు కాస్త శ్రద్ధ వహించాలి.

తల్లిపాలు త్రాగుతూ చిన్నారి నిద్రలోకి ఎందుకు జారుతుంది?

Baby sleeps while breastfeeding? Here's how to tell if it is full or still hungry

సాధారణంగా, జన్మించిన కొన్నినెలల వరకూ పిల్లలు ఎక్కువగా నిద్రలోకి జారిపోతారు. న్యూ బర్న్స్ రోజులో 14 నుంచి 18 గంటల వరకూ నిద్రపోతారు. ఇది సాధారణమే. ప్రతి చిన్నారి విభిన్నమే. కొత్త ఎన్విరాన్మెంట్ లో అడ్జస్ట్ అవడానికి వారికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, మీ పాపాయి తల్లిపాలు త్రాగుతూ నిద్రలోకి జేరిపోతే అది వారి స్లీపింగ్ పాట్రన్ గా మనం గుర్తించాలి. రాను రాను వారు యాక్టివ్ గా మారతారు.
Baby sleeps while breastfeeding? Here's how to tell if it is full or still hungry

గమనించవలసిన అంశాలు: హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచనల ప్రకారం పుట్టిన కొత్తలో పాలు త్రాగడానికి ఇబ్బంది పడిన పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో నిద్రపోతారని తెలుస్తోంది. వారికి తగినంత పాలు లభించకపోయినా వారు నిద్రలోకి జారుకుంటారు. ఈ చిన్నారులు సకింగ్ చేయడంలో అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు. అలాగే, తగినంత తల్లిపాలు లభించకపోవడం వలన కలిగే ఫ్రస్ట్రేషన్ లో కూడా వీరు అలసి నిద్రపోతారు. వారి వెయిట్ ను అలాగే గ్రోత్ పై ఇది దుష్ప్రభావం కలిగిస్తుంది. కొంతమంది అయిదు నిమిషాల వరకు మాత్రమే తల్లిపాలు త్రాగి నిద్రలోకి జారుకుంటే మరికొందరు అదే పనిగా అంటే 20 నిమిషాల పాటు తల్లి పాలని తాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ, వారికి శాటిస్ఫేక్షన్ ఉండదు.
Baby sleeps while breastfeeding? Here's how to tell if it is full or still hungry

ఈ లక్షణాలను గమనించండి: మీ పాపాయికి తల్లి పాల ద్వారా ఆకలి తీరిందా లేదా తెలుసుకునేందుకు మీరు ఈ లక్షణాలను గమనించాలి. ఒకవేళ పాపాయి తల్లిపాలు తాగుతూ నిద్రలోకి జారుకున్నప్పుడు పాపాయి చేతులు రిలాక్స్డ్ గా తెరచి ఉంటే పాపాయి కడుపు నిండిందని అర్థం. ఒకవేళ పాపాయి ముఖం టెన్షన్ గా ఉంటూ పిడికిలి బిగించి ఉంటే పాపాయి ఆకలి తీరలేదని గమనించాలి.
Baby sleeps while breastfeeding? Here's how to tell if it is full or still hungry

ఏం చేయాలి? పాపాయికి ఆకలి తీరలేదని మీరు గమనించాక వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. పాపాయికి ఆకలి తీరే మార్గాన్ని వైద్యులు సూచిస్తారు. ఆ పద్దతులను పాటించి పాపాయి ఆకలిని తీర్చండి. తద్వారా, పాపాయి ఆనందంగా ఆరోగ్యంగా ఎదుగుతుంది.

English summary

Baby sleeps while breastfeeding? Here's how to tell if it is full or still hungry

It’s quite normal to see your baby falling asleep while you’re breastfeeding. This is mostly considered as a healthy indication as baby is full and satisfied and now calmly dozes off. But if your little one does it quite frequently and too early, then it’s something that should be taken care of.
Story first published:Friday, February 23, 2018, 15:07 [IST]
Desktop Bottom Promotion