For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటి గర్భధారణ కంటే కూడా రెండవసారి గర్భధారణ ఎందుకు విభిన్నమైనది :

By R Vishnu Vardhan Reddy
|

మహిళల జీవితంలో అతిముఖ్యమైన సందర్భాల్లో గర్భధారణ కూడా ఒకటి. ఎందుకంటే, ఇది మానవత్వంతో కూడిన అత్యంత విలువైన బహుమతిని స్త్రీలు పొందేలా ఆశీర్వదించడం జరిగింది. అది ఏమిటంటే, జన్మనిచ్చే సామర్ధ్యాన్ని స్త్రీలకు ప్రసాదించారు.

ప్రతిఒక్కరికీ ఈ అదృష్ట్టం ఉండదు. మానవుల్లో సగం మంది, అంటే మగవారు ఎవ్వరికి గాని జన్మనిచ్చే సామర్థ్యం లేదు. స్త్రీలలో కూడా కొంతమందికి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు. కానీ, ఎవరైతే ఆరోగ్యంగా ఉండి మరియు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంటారో వారు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఆనందించగలరు.

ఏ స్త్రీలు అయితే మొదటిసారి గర్భాన్ని దాలుస్తారో అటువంటి వారిలో అంతులేని ఉత్సాహం ఉంటుంది. వీరు కొద్దిగా తీవ్ర ఉత్కంఠకు లోనవుతుంటారు. ఇలా జరగడానికి వెనుక ఒక సులభమైన కారణం ఏమిటంటే, వారి శరీరంలో ఏమి జరుగుతుంది అనే విషయం వారికీ తెలియదు మరియు వారికి కూడా అన్ని కొత్తగా ఉంటాయి.

అయితే, ఎప్పుడైతే రెండోసారి గర్భం దాలుస్తారో, అటువంటి సమయంలో స్త్రీలు తమకు అన్ని తెలుసని భావిస్తారు మరియు ఇందులో కొత్తదనం ఏమి ఉంది అని కూడా అనుకుంటారు.కానీ, ఇది నిజానికి చాలా దూరంగా ఉంటుంది.

మొదటిసారి కంటే, కూడా రెండవసారి గర్భం దాల్చడం చాలా విభిన్నమైనది. ఒక విషయం లో కాదు, చాలా విషయాల్లో రెండింటికి తేడా ఉంది. ఈ వ్యాసంలో వివిధ రకాల తేడాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది మరియు రెండవసారి గర్భం దాల్చినప్పుడు తల్లులు ఎలా వ్యవహరించాలో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.

1. ముందుగానే అందరికి తెలిసిపోతుంది :

1. ముందుగానే అందరికి తెలిసిపోతుంది :

దీనర్ధం కడుపులో పెరుగుతున్న బిడ్డ చాలా త్వరగా పెరిగిపోయాడని లేదా మొదటి బిడ్డ కంటే కూడా రెండవ బిడ్డ పెద్దగా పెరిగిపోయాడని అర్ధం కాదు. ఇలా జరగడానికి అసలు కారణం ఏమిటంటే, మొదటిసారి గర్భం దాల్చినప్పటి కంటే కూడా, ఇప్పుడు రెండవసారి కండరాలు బాగా వదులుగా అయిపోయి ఉంటాయి. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఉన్నంత సమర్ధవంతంగా కండరాలు రెండవసారి ఉండవు. కాబట్టి అటువంటి సందర్భంలో మీరు గర్భం దాల్చారు అనే విషయం త్వరగా తెలిసిపోతుంది.

2. ఎంచుకోవాల్సి ఆహారాలు :

2. ఎంచుకోవాల్సి ఆహారాలు :

మొదటిసారి గర్భం దాల్చినప్పుడు సరైన ఆహారం ఏది అనే విషయమై ఎక్కువగా అలోచించి అనుమానాస్పదంగా తినేవారు అనే విషయాన్ని గుర్తించే ఉంటారు. మీకు కూడా ఏదైనా తినాలి మరియు విభిన్నమైన వస్తువులను ఆస్వాదించాలి అనే కోరికలు కూడా ఎక్కువగా ఉండి ఉండవచ్చు. కానీ, ఇటువంటి సమయంలో మీరు అటువంటి వాటిని ఏమి తీసుకోకూడదు. మీకు ఇప్పటికే ఒక బిడ్డ ఉండటంతో, అతనిని చూసుకుంటూ మీ కడుపులో మరొక బిడ్డ పెరుగుతున్నాడు అనే విషయాన్ని మీరు అప్పుడప్పుడు మరచిపోయి ఉండొచ్చు. కానీm మీరు కొన్ని ఆహార నియమాల విషయాల్లో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మద్యపానం మరియు ధూమపానాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సి ఉంది. కానీ, కొన్ని సందర్భాల్లో ఇంతక ముందు గర్భం దాల్చినప్పుడు చేయని పనులు కూడా ఇప్పుడు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు, మాంసాహారాన్ని తినాలి అనుకోవడం.

3. మరిన్ని నొప్పులు :

3. మరిన్ని నొప్పులు :

ఇప్పటికే ఇంట్లో ఒక బిడ్డ ఉండటంతో, వారి వెనుక పరిగెత్తుతూ ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. నొప్పులన్నింటికీ కారణం ఇదే అని కొంతమంది దీనికి ఆపాదిస్తూ ఉంటారు. కానీ, నిజం ఏమిటంటే, మీకుగనుక మొదటిసారి గర్భం దాల్చినప్పుడు నొప్పులు గనుక వచ్చి ఉంటే, ఈ సారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, మీరు వ్యాయామం బాగా చేయాల్సి ఉంది. అంతేకాకుండా మీ కీళ్లను వంచి మరియు నిలబడే వంగి కూర్చొని చేసే వ్యాయామాల ద్వారా మీ వెనుక భాగాల పై ఒత్తిడి తగ్గించుకోవచ్చు, అని మీరు గుర్తు పెట్టుకోండి.

4. అవగాహన మరింత ఎక్కువగా ఉంటుంది :

4. అవగాహన మరింత ఎక్కువగా ఉంటుంది :

మొదటిసారి గర్భం దాల్చినప్పుడు మీ ప్రపంచం అంతా మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎన్నో గర్భధారణకు సంబంధించిన వెబ్ సైట్లను , వీడియో లను మరియు విషయాలను చూడటానికి, తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, ఈసారి మాత్రం మీరు ఆలా వ్యవహరించారు. కానీ, ఎప్పుడైతే మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నొప్పి కలిగేలా చేస్తాడో లేదా విటమిన్ లకు సంబంధించిన కీలక మందులను వాడుతుంటారో, అటువంటి సమయంలో మాత్రమే మీరు గర్భధారణ దాల్చినట్లు భావిస్తుంటారు. ఈ సమయంలో మీ శరీరంలో చోటుచేసుకుంటున్న మార్పులు తెలుసుకొనే అంత సమయం మీకు ఉండదు మరియు మరీ అంత ఎక్కువగా తెలుసుకోవాలని భావించరు.

5. దుస్తులు వేసుకోవడం :

5. దుస్తులు వేసుకోవడం :

మొదటిసారి గర్భం దాల్చినప్పుడు అందుకు కావాల్సిన దుస్తులను ధరించి సరైన మేకప్ ను కూడా వేసుకొని ఉంటారు. మీరు గర్భధారణకు సరిగ్గా అవసరమయ్యే దుస్తులు కొనడానికి కూడా ఎంతగానో ఖర్చుపెట్టి ఉంటారు. ఇవన్నీ మీరు ఇంతకముందు చేసి ఉండటంతో ఆ పనులన్నీ ఎంత చెత్తవి అనే విషయం మీకు ఈ పాటికే అర్ధం అయి ఉంటుంది. కాబట్టి ఈ సారి అటువంటి పనులు చేయాలనే ఆలోచన కూడా మీకు రాదు. రెండవసారి గర్భధారణ సౌకర్యవంతంగా జరిగేలా చూసుకోవడం చాలా ముఖ్యమైనదిగా మీరు భావిస్తారు.

6. దస్తావేజుల కోసం పెద్దగా ఖర్చుపెట్టకపోవడం :

6. దస్తావేజుల కోసం పెద్దగా ఖర్చుపెట్టకపోవడం :

మొదటసారి మీరు గర్భం దాల్చినప్పుడు విపరీతమైన ఉత్సాహంతో ఉండిఉంటారు మరియు అందులో భాగంగా దస్తావేజుల కోసం ఎంతగానో ఖర్చుపెట్టి ఉంటారు. మీ కడుపు పెరుగుతున్నప్పుడు ఎలా ఉందిఅనే విషయం దగ్గర నుండి, అర్ధరాత్రి మీకు ఎంతలా ఆకలి వేసేది అనే విషయాల వరకు అన్నింటిని ఒక జ్ఞాపకాలుగా మార్చుకోవాలని భావించి ఉండవచ్చు. ఇవన్నీ మీరు చేసి ఉండవచ్చు. కానీ, మీరు ఎప్పుడైతే రెండవసారి గర్భం దాలుస్తారో, అటువంటి సమయంలో చాలా తక్కువగా ఈ పనులన్నీ చేస్తారు అనే చెప్పాలి. చాలామంది పుట్టబోయే బిడ్డను తమ చేతుల్లో జాగ్రత్తగా తీసుకొంటే చాలు, అది ఒక్కటే మాకు కావాలి అని భావిస్తుంటారు.

7.భావోద్వేగమైన నాటకీయత తక్కువగా ఉంటుంది :

7.భావోద్వేగమైన నాటకీయత తక్కువగా ఉంటుంది :

మొదటిసారి మీరు గర్భం దాల్చినప్పుడు భావోద్వేగపరంగా ఎలా ప్రవర్తించారు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి. కానీ అప్పుడు జరిగిన ఆ పనులన్నీ ఇప్పుడు జరగడం కష్టం అనే చెప్పాలి. అందుకు ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు వయస్సు రిత్యా కొద్దిగా పెద్దరికాన్ని సంపాదించి ఉంటారు మరియు ఇంట్లో ఇప్పటికే ఒక బిడ్డ ఉండటంతో పాక్షికంగా, మీరు కొద్దిగా బాధ్యతగా ప్రవర్తించాలని అనుకుంటారు. అయితే అసలు నిజం ఏమిటంటే, మొదటిసారి కంటే కూడా రెండవ సారి గర్భధారణ, కనీసం బావోద్వేగపరంగా అయినా మీకు సులభతరంగా ఉంటుంది.

8. ప్రకటన :

8. ప్రకటన :

మొదటిసారి గర్భం దాల్చినప్పుడు, మీ దగ్గరి వాళ్లకు మరియు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని త్వరగా చేరవేయాలని ఎంతో ఉత్సహాహంగా ఉంటారు. వారు కూడా ఈ విషయం వినడానికి ఆతురతను ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లి దండ్రులు మరియు అత్త మామలు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు అవ్వబోతున్నారని ఒకింత భావోద్వేగంగా ఉంటారు. రెండవసారి గర్భం దాల్చిన చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఈ వార్తలను చెప్పడానికి అంతగా ఉత్సాహం చూపించారు.

9. గదిని సిద్ధం చేయడం :

9. గదిని సిద్ధం చేయడం :

మొదటిసారి మీరు గర్భం దాల్చినప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. మీ చుట్టూ ప్రక్కల అంతా బాగుండాలని మరియు ఉత్తమంగా ఉండాలని మీ ఇంట్లో అడుగుపెట్టబోయే బిడ్డ మీ ఇల్లుని అద్భుతంగా భావించాలని అనుకుంటారు. ఇందుకోసం ఎన్నింటినో కొనడానికి డబ్బుని బాగా ఖర్చుచేస్తారు మరియు అన్ని సరైన స్థానంలో ఉండాలని భావిస్తారు. రెండవసారి గర్భం దాల్చిన సమయానికి, అప్పటికే వస్తువులన్నీ ఉండాల్సిన స్థానం లో ఉంటాయి మరియు ఇంతక ముందు బిడ్డ వదినవాడిన వస్తువులనే ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు మీరు ఇవ్వబోతున్నారు. కావున మీరు చేయాల్సిన పని కూడా పెద్దగా లేదు. కాబట్టి సాధారణం గానే మీలో ఉత్సాహం స్థాయిలు తక్కువగా ఉంటాయి.

10. నిజమైన అంచనాలు :

10. నిజమైన అంచనాలు :

గర్భం మరియు బిడ్డ జన్మించడం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. మొదటిసారి గర్భం దాల్చినప్పుడు వీటన్నింటి గురించి తెలుసుకోవడం ద్వారా, మీలో ఎంతోకొంత అంచనాలు ఉండి ఉంటాయి. రెండవసారి గర్భం దాల్చినప్పుడు, విషయాలకు అనుగుణంగా మీరు వ్యవహరించరు. కానీ, మొదటిసారి మీకు ఎదురైనా అనుభవాలను గుర్తించి, అందుకు అనుగుణంగా మీరు వ్యవహరిస్తారు. కాబట్టి సాధారణంగానే మీ యొక్క అంచనాలు ఈ సారి నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఊహాజనితమైన ఆలోచనల జోలికి అస్సలు వెళ్లారు.

English summary

How is a second pregnancy different from the first?

It is obvious that women who are pregnant for the first time have a surrounding excitement that engulfs them because of the simple fact that they are unaware of what is happening to their body and all of it is very new to them. However, when this happens for the second time, it is way different from that of the first, in matters more than one.
Story first published:Tuesday, February 20, 2018, 18:47 [IST]
Desktop Bottom Promotion