For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛాతీ, తొడలు, పొట్టపై ఏర్పడే చారలు, ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకునేందుకు చిట్కాలు,

ప్రెగ్నెన్సీ వల్ల ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ కనపడకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే ఎలాంటి గీతలు కనపడవు. సాధారణంగా ప్రెగ్నెన్నీ తర్వాత ఆడవారు వెయిట్ పెరుగుతుంటారు.

|

చాలా మంది ఆడవారు ప్రసవం అయిన తర్వాత చాలా రకాల సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అందులో ఒకటి పొట్టపై కనపడే గీతలు. దీనివల్ల చాలా మంది ఇబ్బందులుపడుతుంటారు.

చాలా మంది అమ్మాయిలు అమ్మ అయిన తర్వాత కూడా ఫ్యాషన్ బుల్ గా ఉండాలనుకుంటారు. అయితే
స్ట్రెచ్ మార్క్స్ ఉండడం వల్ల అది కుదరదు.

కనపడకుండా ఉండాలంటే

కనపడకుండా ఉండాలంటే

అయితే ప్రెగ్నెన్సీ వల్ల ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ కనపడకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే ఎలాంటి గీతలు కనపడవు.

సాధారణంగా ప్రెగ్నెన్నీ తర్వాత ఆడవారు వెయిట్ పెరుగుతుంటారు. దీంతో పొట్టపై గీతలు కూడా పడుతుంటాయి.

స్కిన్ వెనకాల ఉండే

స్కిన్ వెనకాల ఉండే

పొట్టపై ఉండే స్కిన్ వెనకాల ఉండే ఫైబర్‌ కాస్త విరిగిపోవడం వల్లే ఇలాంటి చారలు ఏర్పడుతాయి. మరికొందరికి కవల పిల్లలు కడుపులో ఉన్నప్పుడు లేదంటే కడుపులోని బేబీ వెయిట్ ఎక్కువగా ఉంటే ఇలాంటి మార్క్స్ పడుతుంటాయి.

స్టెరాయిడ్‌

స్టెరాయిడ్‌

కొందరు స్టెరాయిడ్‌ క్రీమ్స్ వాడుతుంటారు. అలాంటి వారి కడుపుపై కూడా చారలు ఏర్పడుతుంటాయి. అలాగే హార్మోన్లు సరిగ్గా లేకుంటే కొందరిలో ఇలాంటి చారలు ఏర్పడుతుంటాయి.

నిమ్మకాయ రసం తాగుతూ

నిమ్మకాయ రసం తాగుతూ

రోజూ పౌష్టికాహారం తీసుకోవడం, జంక్‌ ఫుడ్‌ తినకుండా ఉంటే మంచిది. అలాగే నిమ్మకాయ రసం తాగుతూ ఉండాలి. క్యారెట్స్ తినాలి. నీళ్లు బాగా తాగాలి. యోగా చేస్తూ ఉండాలి. అలాగే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్ పెరగకుండా జాగ్రత్తపడాలి.

Most Read :బాడీలో ప్రతి ఒక్కరికీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోకుంటే మటాష్Most Read :బాడీలో ప్రతి ఒక్కరికీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోకుంటే మటాష్

థెరపీ ద్వారా

థెరపీ ద్వారా

అలాగే రెటినాల్‌ తో పాటు జోజోబా నూనె వాడితే మంచిది. అలాగే పొట్టపై చారల్ని పోగొట్టేందుకు ప్లెట్‌ లెట్‌ రిచ్‌ ప్లాస్మా అనే విధానం కూడా ఉంది. ఈ థెరపీ ద్వారా కూడా మనం పొట్టపై ఉండే చారల్ని పోగొట్టుకోవొచ్చు.

కలబంద రసం

కలబంద రసం

అలాగే కలబంద రసంలో కాస్త వీట్‌ జెర్మ్‌ పాటు ఆలివ్‌ ఆయిల్, కోకో బటర్‌ను కలిపి స్ట్రెచెస్ పై పూసుకోవాలి. ఒక ముప్పై నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి.

గర్భిణీగా ఉన్నప్పటి నుంచే

గర్భిణీగా ఉన్నప్పటి నుంచే

కేవలం పొట్టపైనే కాకుండా తొడలపై, ఛాతీపై కూడా కొందరికి చారలు ఏర్పడతాయి. అయితే ఈ స్రెచ్ మార్క్స్ ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గర్భిణీగా ఉన్నప్పటి నుంచే బాదం నూనె లేదంటే కోకోవా బటర్‌ ఏదైనా ఒకదాంతో ఆయా భాగాల్లో సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవు.

చక్కెర, బాదం నూనె

చక్కెర, బాదం నూనె

అలాగే కాస్త చక్కెర, బాదం నూనె, విటమిన్ ఈ ఉండే క్రీమ్ తో పాటు కలబంద రసాన్ని కలుపుకుని ఆయిల్ మాదిరిగా చేసుకోవాలి. దాన్ని స్ట్రెచ్ మార్క్స్‌ పై పూసుకుంటూ ఉంటే తగ్గే అవకాశం ఉంది.

Most Read :రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులు తింటే చాలు, కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలుMost Read :రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులు తింటే చాలు, కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

ఆముదం

ఆముదం

అలాగే ఆముదం ద్వారా కూడా ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్‌ పై పూసుకుంటే తగ్గే అవకాశం ఉంది.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ ను ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్‌ పై రోజూ పూసుకుంటే ఈజీగా అవి తగ్గిపోతాయి.

ఛాతీపై కూడా స్ట్రెచ్ మార్క్స్‌

ఛాతీపై కూడా స్ట్రెచ్ మార్క్స్‌

కొందరు ఆడవారికి ఛాతీపై కూడా స్ట్రెచ్ మార్క్స్‌ పై ఏర్పడుతుంటాయి. అక్కడ ఎముకలుండవు. అందువల్లు ఈజీగా అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి. ఛాతీపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్‌ తొల‌గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.

చక్కెర

చక్కెర

చక్కెరను తీసుకుని దాంతో స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్లేస్ లో రుద్దుకోండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే స్ట్రెచ్ మార్క్స్ పోతాయి.

MostRead :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలుMostRead :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంతో కూడా స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గించుకోవొచ్చు. నిమ్మరసంతో రెగ్యులర్ గా స్ట్రెచ్ మార్క్స్ పై మసాజ్ చేసుకుంటే చాలు. ఈజీగా తగ్గిపోతాయి.

గుడ్డు ద్వారా

గుడ్డు ద్వారా

గుడ్డు ద్వారా కూడా స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవొచ్చు. గుడ్డులోని పచ్చసొనతో బ్రెస్ట్ పై ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్స పై పూసుకోవాలి. తర్వాత కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మంచిది. ఈ చిట్కాలన్నీ పాటిస్తే ఛాతీపై, తొడలపై, పొట్టపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ మొత్తం తొలగిపోతాయి.

English summary

How To Use Aloe Vera lemon custard oil To Treat Stretch Marks

How To Use Aloe Vera lemon custard oil To Treat Stretch Marks
Desktop Bottom Promotion