For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవానంతరం మహిళలకు సూచించబడిన చిట్కాలు

తల్లులందరికీ ప్రసవ వేదన అత్యంత క్లిష్టతరముగా ఉంటుంది. కడుపులో బిడ్డతో పాటు తల్లికి కూడా సరైన రక్షణ, ఓషధాల వినియోగం ఖచ్చితంగా ఉండాలి. సరైన ఆహార ప్రణాళిక అనేది గర్భం దాల్చిన వారికి ఎంత ముఖ్యమో, ప్రసవానం

|

తల్లులందరికీ ప్రసవ వేదన అత్యంత క్లిష్టతరముగా ఉంటుంది. కడుపులో బిడ్డతో పాటు తల్లికి కూడా సరైన రక్షణ, ఓషధాల వినియోగం ఖచ్చితంగా ఉండాలి. సరైన ఆహార ప్రణాళిక అనేది గర్భం దాల్చిన వారికి ఎంత ముఖ్యమో, ప్రసవానంతరం తర్వాత కూడా అంతే ముఖ్యం.

ప్రసవానంతరం మహిళలకు అవసరమైన పోషకాలు అందివ్వగల అనేక రకాల ఆహారపదార్ధాలు అందుబాటులో ఉన్నవి. ఒక ప్రణాళికా బద్దమైన ఆహారపు, అలవాట్లు, మరియు దైనందిక జీవన శైలి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

Summer health tips after delivery

ముఖ్యంగా మార్కెట్ లో ప్రసవానంతరం మహిళలకు సరైన పోషకాలను అందివ్వగల అనేక రకాల తాజా పండ్లు దొరుకుతాయి. కావున కాలానుగుణంగా పండ్లు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మరియు తక్కువ క్రొవ్వు కలిగిన పాల పదార్ధాలను కూడా సూచించడమైనది. జాగ్రత్తగా లేనిచో పొట్ట చుట్టూ క్రొవ్వు పేరుకుని, ఊబకాయానికి దారితీసే పరిస్థితులు కూడా లేకపోలేదు. తద్వారా అనేక రోగాలకు కూడా కారకాలుగా మారుతాయి.
వేటిని తీసుకొనరాదు:

వేటిని తీసుకొనరాదు:

ప్రసవానంతరం , బిడ్డకు తల్లి పాలను ఎక్కువ కాలం ఇవ్వవలసి ఉంటుంది. కావున ఇలాంటి సమయంలో చిరుతిండ్లకు దూరంగా ఉండాలి. మీరు ఎటువంటి చిరుతిండికి మొగ్గు చూపినా, ఆ ప్రభావం మీ బిడ్డమీద కూడా ఉంటుందని గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఈ చిరు తిండ్లను స్వీకరించడం ద్వారా మీతో పాటు మీ బిడ్డ అనారాగ్యోనికి కూడా కారకులుగా మారుతారని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. కళ్ళు ప్రతి ఆహార పదార్ధాన్ని కోరుకుంటుంది, కానీ శరీరం దానికి తగినవిధంగా ఉందా లేదా అన్న అవగాహన ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ప్రసవానంతరం తీసుకోదగిన ఆహార పదార్ధాలు ఏవి?

ప్రసవానంతరం తీసుకోదగిన ఆహార పదార్ధాలు ఏవి?

•తక్కువ ప్రోటీన్ స్థాయిలు కలిగిన ఆహార పదార్ధాలు

•తక్కువ క్రొవ్వు కలిగిన పాల పదార్ధాలు

•తృణధాన్యాలు

•పండ్లు

•కూరగాయలు

 అంటువ్యాధులు సంక్రమించకుండా:

అంటువ్యాధులు సంక్రమించకుండా:

ప్రసవానంతరం మహిళలలో రోగ నిరోధక శక్తి తత్వాలు తక్కువగా ఉంటాయి. కావున అత్యంత జాగరూతులై వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. లేని పక్షంలో అనేక అంటువ్యాధులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. మీ ఆహార ప్రణాళికలలో భాగంగా అత్యధికంగా విటమిన్– సి ని చేర్చుకోవలసిన అవసరం ఉంది. విటమిన్-సి శరీరంలో రోగ నిరోధక శక్తి తత్వాలను పెంచుటలో తద్వారా శరీరాన్ని ఆరోగ్యకరంగా చేయడంలో ఎంతో సహాయం చేస్తుంది . మిగిలిన ఆహార పదార్ధాలైన బ్రొకోలి, బంగాళా దుంపలు, నిమ్మజాతి కి చెందిన పండ్లు, టొమాటోలు మొదలైన వాటి నుండి విటమిన్ –సి ని పొందవచ్చు.

ఐరన్ తప్పనిసరి :

ఐరన్ తప్పనిసరి :

స్త్రీ, తన ప్రసవ సమయంలో అత్యధిక రక్తాన్ని కోల్పోవలసి ఉంటుంది. సాధారణ కాన్పు అయినా లేదా ఆపరేషన్ వలన అయినా రక్తం కోల్పోవడం మాత్రం సర్వసాధారణం. తద్వారా ప్రసవానంతరం, కోల్పోయిన ఐరన్ తిరిగి పొందాల్సిన అవసరం ఉన్నది. ఆహార ప్రణాళికలో మార్పుల ద్వారా తీసుకున్న ఆహారం ద్వారా రక్తంలో ఐరన్ నిల్వలను పెంచే ప్రయత్నం చేయవచ్చు. రక్తం లో ఉన్న ఐరన్ నిల్వలు హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయం చేస్తాయి. హీమోగ్లోబిన్ రక్తంలోని కణాలకు ఎరుపు రంగును ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సరైన ఐరన్ నిల్వలు లేని శరీరం, రక్తహీనత వంటి సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తత్వాలను పెంచడం ద్వారా ఐరన్ నిల్వలను సమతుల్యం చేయవచ్చు. చిక్కుడు, చేపలు, మాంసం మొదలైన వాటిని స్వీకరించడం ద్వారా ఎంతో లాభం పొందవచ్చు.

శరీరంలో తగినంత నీటి నిల్వలు ఉన్నాయా ?

శరీరంలో తగినంత నీటి నిల్వలు ఉన్నాయా ?

ప్రసవానంతరం, మహిళలు తగినంత నీటిని తీసుకోవడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ కొన్నిరోజుల తర్వాత ఖచ్చితంగా నీటిని తీసుకోవలసిన పరిస్థితులు నెలకొంటాయి. క్రమంగా రోజులో కనీసం 8 నుండి 10 గ్లాసుల నీటిని స్వీకరించాల్సి వస్తుంది. తద్వారా శరీరం డీహైడ్రేట్ కు గురికాకుండా ఉంటుంది. నీటికి బదులుగా అప్పుడప్పుడు పళ్ల రసాలు లేదా క్రొవ్వు తక్కువగా ఉన్న పాల పదార్ధాలు తీసుకోవచ్చు. ప్రసవానంతరం ప్రతి మహిళ కూడా తన శరీరo లో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవడం అన్నిటికన్నా ముందస్తు చర్యగా చెప్పబడినది.

తేలికపాటి దుస్తులు :

తేలికపాటి దుస్తులు :

ప్రసవానంతరం మహిళల శరీర ఉష్ణోగ్రతలు, సాధారణ మహిళల కంటే కొంచం అదనంగానే కనిపిస్తూ ఉంటాయి. వీరు తేలికపాటి దుస్తులను ధరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కాటన్ వంటి తేలికపాటి దుస్తుల ద్వారా శ్వాసకు అనువుగా ఉంటుంది. దృఢమైన దుస్తుల కన్నా తేలికపాటి దుస్తులు ఎంతో సౌకర్యంగా ఉంటాయి కూడా. తద్వారా మానసిక అసౌకర్యానికి కూడా దూరంగా ఉండవచ్చు.

మీ స్వభావాన్ని శాంతంగా ఉండేలా చూసుకోవాలి . తద్వారా మీ బిడ్డ కూడా సంతోషంగా ఉండగలుగుతుంది. మీ నిద్ర సమయంలో మీరు సౌకర్యవంతంగా ఉండేలా పరిసరాలను సిద్దం చేసుకోవలసిన అవసరం కూడా ఉంది.

గర్భధారణ అనేది ఒక దశ, ఈ దశలో తనతో పాటు తన బిడ్డకు కూడా రక్షణను ఇచ్చే దిశగా అడుగులు వేయవలసి ఉంటుంది. కానీ, ప్రసవానంతరం శరీరం సున్నితంగా మారుతుంది. ముఖ్యంగా వేసవిలో, తల్లీ బిడ్డలు ఆహార నియమాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వారి ఇష్టానుసారం ఆహారాన్ని స్వీకరించడం అంటే కుదరని పనే అవుతుంది. ముఖ్యంగా వేసవిలో కొన్ని ఆహార పదార్ధాలు ఎంతో అసౌకర్యానికి గురిచేస్తుంటాయి.

పోస్ట్ పార్టమ్ పరీక్ష :

పోస్ట్ పార్టమ్ పరీక్ష :

గర్భధారణ సమయంలోనే కాకుండా , ప్రసవానంతరం కూడా మహిళ అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది . ఒకవేళ వేసవిలో ప్రసవం జరిగిన పక్షంలో, కొన్ని పరిస్థితులు చాలా దారుణంగానే ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సంరక్షణా చర్యలకు పూనుకోవలసి ఉంటుంది. మీకు సాధారణ కాన్పు అయిన పక్షంలో పోస్ట్ పార్టమ్ చికిత్సను డాక్టర్ సలహా మేరకు తీసుకొనవలసి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా మీ అవయవాలు అన్నీ స్వావలంబన పొందుతాయి.

మూత్రాశయ సమస్యలను తగ్గించుకోండి:

మూత్రాశయ సమస్యలను తగ్గించుకోండి:

సాధారణ ప్రసవం అయినా కూడా జననేంద్రియాలు మాత్రమే కాకుండా, వాటి చుట్టూతా ఉన్న అవయవాలు కూడా కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటాయి. తద్వారా ఎక్కువ మంది మహిళలు మూత్రాశయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. తద్వారా మూత్ర నాళంలో మంట, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. వేసవిలో ఇలాంటి సమస్యలవలన చాలా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఒక్కోసారి సమస్య జఠిలం కూడా అవుతుంది. అలాంటి సందర్భాలలో కెగెల్స్ చేయవలసి ఉంటుంది. అనగా, మీ కటి కండరాల ప్రాంతాన్ని కొద్ది సేపు గట్టిగా పట్టి ఉంచి వదులుతూ చేసే ఒక రకమైన వ్యాయామం. ఇది సమయానుసారం చేస్తూ ఉండడం ద్వారా మూత్రాశయ సమస్యలను దరికి రాకుండా చూడవచ్చు.

పప్పులు మరియు తృణధాన్యాలు :

పప్పులు మరియు తృణధాన్యాలు :

ఈ వేసవికాలంలో పప్పులు తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదిగా సూచించబడినది. ముఖ్యంగా ప్రసవానంతరం మహిళలు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి కారాలు, మసాలాలు లేకుండా తేలికపాటి ఆహార పదార్ధాలుగా ఉంటాయి. తద్వారా ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. ఇవి జీర్ణక్రియలను వేగవంతం చేయడంలో సరైన పోషకాలను శరీరానికి ఇవ్వడంలో అధికంగా సహాయపడుతాయి.

ఆకుపచ్చని కూరగాయలు :

ఆకుపచ్చని కూరగాయలు :

ప్రసవానంతరం , రక్తం ఎక్కువగా పోవడం కారణంగా ఐరన్ ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది. ఆకుపచ్చని కూరగాయలు ఈ ఐరన్ ను తిరిగి పొందడంలో సహాయం చేస్తాయి. మరియు ఈ వేసవిలో అత్యధిక పోషకవిలువలు కలిగి ఉండే ఆహారాలు గా ఎంపిక చేయబడినవి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా, తమ బిడ్డకు కూడా ఆరోగ్యవంతమైన పాలను అందించడం లో భాద్యతను తీసుకోవచ్చు. ప్రసవానంతరo మహిళలకు , కాలానుగుణంగా పండే కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం సూచించడమైనది.

English summary

Summer health tips after delivery

al situations for all mothers. Along with the baby, even mother needs care and medication for quick heal. Eating healthy is an important factor for the pregnant ladies just after their delivery. There are varieties food which are really nutritious and good for a pregnant lady after delivery is done.
Desktop Bottom Promotion