For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంపొందించే 5 అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీలు

|

తల్లిపాలనేవి శిశువుకు అన్ని విధాలా శ్రేష్టమైనవి. శిశువుకి తగినంత తల్లిపాలు లభించడం ద్వారా శిశువు ఆరోగ్యం అన్నివిధాలా మెరుగుపడుతుంది. శిశువు ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. తల్లిపాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. అందుకే దీనిని లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు.

నిజానికి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వారి సూచనల ప్రకారం శిశువుకి ఆరునెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా అందివ్వాలి.

చాలామంది తల్లులు, ముఖ్యంగా మొదటి సారి తల్లైన వారు పాలు సరిగ్గా పడతాయో లేదోనని దిగులు చెందుతూ ఉంటారు. సహజంగానే ప్రతి తల్లి వద్ద శిశువుకి తగినంత పాలు లభ్యమవుతాయి. ప్రకృతి ఈ విధంగా ఏర్పాట్లు చేసింది.

అయితే, కొంతమంది న్యూ మదర్స్ లో పాలు తగినంత ఉండవు. అందువలన, వారి శిశువులకు తగినంత పాలు లభించవు.

హార్మోనల్ మార్పులు, అనారోగ్యం, పోషకాహార లోపం, గర్భనిరోధక మాత్రల వాడకంతో పాటు శిశువుకు పాలు పట్టే పోసిషన్ పై పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. వీటన్నిటివలన పాలు సమృద్ధిగా తయారవవు.

శిశువుకు తల్లిపాలు సరిగ్గా లభించకపోవడం వలన శిశువులో పోషకాహార లోపం తలెత్తుతుంది. వీక్ మెమరీతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి.

ఆయుర్వేద అనబడే ఈ పురాతన వైద్య శాస్త్రంలో వాడే ఎన్నో రకాల మూలికలు ఈ సమస్యను సులువుగా పరిష్కరిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివిధ హెర్బ్స్ యొక్క సుగుణాలకు వాడుకుంటూ రకరకాల ఆరోగ్య సమస్యలకు స్వస్తి పలకవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

కాబట్టి, ఈ రోజు ఈ ఆర్టికల్ లో కొత్తగా తల్లైన వారిలో తమ శిశువుకు అవసరమైనంత పాల వృద్ధి కోసం ఆయుర్వేద చిట్కాలను పొందుబరిచాము.

బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంపొందించే ఆయుర్వేదిక్ రెమెడీస్

మెంతులు:

మెంతులు:

బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తిని పెంపొందించే అద్భుతమైన ఔషధంగా మెంతులు ఉపయోగకరంగా ఉంటాయి. మెంతులలో పోలీటోస్ట్రోజెన్స్ అనే కాంపౌండ్ కలదు. ఇది మమ్మరీ గ్లాండ్స్ పనితీరుని మెరుగుపరుస్తుంది. కొత్తగా తల్లైన వారిలో బ్రెస్ట్ మిల్క్ సరిపడినంతా రాకపోతే మెంతులను తీసుకుంటే పరిస్థితి మెరుగవుతుంది.

ఉపయోగించే విధానం:

కొన్ని మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత వాటిని బాయిల్ చేయాలి. వడగట్టి ప్రతి ఉదయాన్నే ఈ నీటిని తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.

బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంపొందించే ఆయుర్వేదిక్ రెమెడీస్

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

ఆయుర్వేదం ప్రకారం, దాల్చిన చెక్కలో తల్లిపాల వృద్ధిని పెంపొందించే గుణాలు కలవు. అలాగే, పాల ఫ్లేవర్ ని కూడా పెంపోందిస్తుందని వినికిడి. అలాగే, శిశువు జన్మించిన తరువాత పీరియడ్స్ ని డిలే చేయడానికి కూడా దాల్చిన చెక్క ఉపయోగకరంగా ఉంటుంది. అందువలన, గర్భం దాల్చడాన్ని వాయిదా వేయవచ్చు.

ఉపయోగించే విధానం:

అర టీస్పూన్ తేనెలో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్నికొత్తగా తల్లైన వారు తీసుకోవాలి. వెచ్చని పాలలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడించి ఆ పాలను తీసుకున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఒక నెల పాటు ఇలా తీసుకుంటే పాలిచ్చే తల్లులలో పాలు వృద్ధి చెందుతాయి.

బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంపొందించే ఆయుర్వేదిక్ రెమెడీస్

శాతవారి

శాతవారి

ఈ సాంప్రదాయ ఆయుర్వేదిక్ హెర్బ్ అనేది పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నట్టు అంచనా. పాలిచ్చే తల్లులలో పాల వృద్ధికై ఈ హెర్బ్ అమితంగా ఉపయోగపడుతుంది. హార్మోన్లను నియంత్రించే లక్షణాలు ఈ హెర్బ్ లో కలవు. తద్వారా, తల్లిపాల ఉత్పత్తిని పెంపొందిస్తుంది.

ఉపయోగించే విధానం:

రెండు టీస్పూన్ల శాతవారిని నీటిలో కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకుంటే పాల ఉత్పత్తి మెరుగవుతుంది. శాతవారిని క్యాప్స్యూల్ రూపంలో మెడికల్ స్టోర్ నుంచి తెచ్చుకోవచ్చు.

బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంపొందించే ఆయుర్వేదిక్ రెమెడీస్

జీలకర్ర:

జీలకర్ర:

భారతీయలు జీలకర్రని ఎక్కువగా వాడతారు. భారతీయ వంటకాలలో జీలకర్ర అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీలకర్రలో అనేక ఔషధ గుణాలు కలవు. తల్లిపాల వృద్ధికి జీలకర్ర సహకరిస్తుంది. అలాగే, వీటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. పాలిచ్చే తల్లులలో శక్తిని పెంపొందించేందుకు జీలకర్ర ఉపయోగకరంగా ఉంటుంది.

ఉపయోగించే విధానం:

ఒక టీస్పూన్ షుగర్ ని అలాగే ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని బాగా కలిపి ఈ మిక్స్ ని వెచ్చని పాలతో తీసుకోవాలి. ప్రతి రోజు నిద్రపోయే ముందు ఈ పాలను తీసుకోవడం ద్వారా బ్రెస్ట్ మిల్క్ సప్లై పెరుగుతుంది.

బ్రెస్ట్ మిల్క్ సప్లై ని పెంపొందించే ఆయుర్వేదిక్ రెమెడీస్

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఔషధ గుణాలనేకం కలవు. తల్లిపాల ఉత్పత్తిని పెంపొందించే గుణం కూడా వెల్లుల్లిలో కలదు. ఈ గాలాక్టాగోగ్ హెర్బ్ అనేది పాల ఫ్లేవర్ ని కూడా పెంపొందిస్తుంది. పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోవడం ద్వారా శిశువుకు తగినంత తల్లిపాలు లభిస్తాయి.

ఉపయోగించే విధానం:

వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుని తింటే ఆశించిన ఫలితం లభిస్తుంది.

English summary

Top 5 Ayurvedic Remedies To Increase Breast Milk Supply

Call it liquid gold or life-giving nectar, but you cannot deny the importance of breast milk for a newborn. It is the most beneficial thing for a baby.In fact, so much is its importance that the World Health Organization recommends giving just mother's milk to the baby for the first 6 months of his/her life.
Story first published: Tuesday, February 27, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more