For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ తరువాత పోస్ట్ డెలివరీ పెయిన్స్ తో వ్యవహరించే మార్గాలు

|

ప్రెగ్నెన్సీ తరువాత పోస్ట్ డెలివరీ పెయిన్స్ తో వ్యవహరించే మార్గాలు.పురిటి నొప్పులు అనునవి బిడ్డ పుట్టిన తర్వాత అకస్మాత్తుగా ముగియవు. ఖచ్చితంగా కొంతకాలం కొనసాగుతాయి వీటిని పోస్ట్ డెలివరీ పెయిన్స్ అని వ్యవహరిస్తారు.

గర్భధారణ కారణంగా పెరుగుతున్న కడుపుతో పాటు విస్తృతంగా పెద్దదిగా మారిన గర్భాశయం, లేబర్ తర్వాత నెమ్మదిగా దాని అసలు పరిమాణంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అనగా శిశువు గర్భాశయాన్ని వదిలి బయటకు వచ్చినప్పుడు, గర్భాశయ కండరాలు దాని అసలు రూపాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తాయి..

Ways To Deal With Post-delivery Pains After Multiple Pregnancies

గర్భాశయం యొక్క ఈ కుదింపులు తీవ్రమైన తిమ్మిరి లేదా తీవ్ర నొప్పిని కలిగి ఉండొచ్చు కూడా. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలలో గర్భాశయం సాధారణ రూపానికి రావడానికి పెద్ద సమయం కూడా తీసుకోదు మరియు నొప్పి కూడా కాస్త తక్కువగానే ఉంటుంది.

కానీ అనేక సార్లు గర్భం దాల్చిన మహిళలలో, గర్భాశయం తిరిగి యధాస్థితికి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాకుండా, నొప్పి తీవ్రతను కూడా అధికంగా కలిగి ఉంటుంది. శరీర తత్వాన్ని బట్టి కొందరిలో రెండవసారికే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశo ఉంది. గర్భాశయ కండరాలు అనేక మార్లు పొడిగించబడి, తిరిగి యధాస్థితికి రావడం మూలాన, వాటి పటిష్టతను కోల్పోవడమే ఇందుకు కారణం. ఒక్కోసారి ఈ నొప్పి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే వైద్యులు కూడా ఒకటి లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకోమని సూచిస్తుంటారు.

అదృష్టవశాత్తూ,ఇటువంటి నొప్పులను తగ్గించడానికి అనేక చిట్కాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాసంలో పోస్ట్ ప్రెగ్నెన్సీల తర్వాత కలిగే నొప్పిని తగ్గించుకునే పద్దతుల గురించి పొందుపరచడం జరిగినది.

• మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి

డెలివరీ తర్వాత నొప్పులు కలుగుతాయన్న నిజాన్ని అంగీకరించడానికి మానసికంగా సిద్ధం కావాలి. నొప్పి కలుగుతుందా? మరియు ఎందుకు నొప్పి కలుగుతుంది అని తెలుసుకోవడం, క్రమంగా ఆ నొప్పితో వ్యవహరించే విధానాలు, మొదలైనవి నొప్పిని తగ్గించడాన్ని సులభతరం చేస్తుంది.

• ప్రయత్నo మరియు విశ్రాంతి

డెలివరీ తర్వాత నొప్పి కలిగే సమయం తరచూ వస్తూ, పోతూ ఉంటుంది. ఉన్నపళంగా నొప్పి వచ్చి బాధ పెడుతుంటుంది. ఇలాంటి సందర్భంలో మానసికoగా ధైర్యంతో ఉండాలి. డెలివరీ తర్వాత నొప్పి సర్వసాధారణమైన విషయంగా భావించాలి. అలా లేని పక్షంలో నొప్పి మరింత భాధపెడుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా విశ్రాంతిని తీసుకోవాలి మరియు మీ శరీరాన్ని, దాని పనిని దాన్ని చేయనివ్వండి. మీ శరీరం తిరిగి యదా స్థితికి వస్తున్న ప్రయత్నమని గుర్తుంచుకోండి. నొప్పిని భరించాలి, కానీ ఆ నొప్పిపై సరైన అవగాహన ఉంటే భాద తగ్గుతుంది.

• విశ్రాంతి

వీలైనంత ఎక్కువ సమయం, వీలయితే ప్రతి క్షణం విశ్రాంతి కోసం ప్రయత్నించండి. శిశు జననం తరువాత ఇంటి పనులు, బాద్యతలు అంటూ మీ శరీరానికి పని చెప్పడం వలన మరిన్ని సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కావున కొన్నిటికి వీలైనంత దూరంగా ఉండేలా ప్రయత్నించండి. ఇక్కడ మీ ప్రియమైన వారి సహకారం కూడా ముఖ్యం. శరీరాన్ని తిరిగి యధాస్థితికి తీసుకుని రావడానికి ఖచ్చితంగా సమయం కావాలి. కాబట్టి, మీ శక్తిని అనవసరమైన పనులకు వృధా చేయకండి.

• మీ బిడ్డతో సమయం కేటాయించండి

విశ్రాంతి తీసుకోవడం క్రమంగా మీ శిశువుతో సమయాన్ని వెచ్చించడం మీ మద్య బంధం పెరగడానికి దోహదం చేస్తుంది. మీ మద్య బంధం మరియు బ్రెస్ట్ ఫీడింగ్ వలన ఏర్పడే హాపీ హార్మోన్స్ నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి.

• ఐస్ ముక్కల పనితనం

మంచు ముక్కలు ఉన్న ట్రే ఒకదాన్ని తీసుకోండి. మరియు ఒక జిప్ లాక్ సంచిలో వీటిని డంప్ చేయండి. ఒక టవల్లో తీసుకుని మీ పొట్ట దగ్గర సున్నితంగా ఉంచండి. ఇక్కడ ఐస్ ముక్కల మసాజ్ నొప్పి నివారణలో సహాయం చేస్తుంది మరియు తిమ్మిర్లు కూడా తగ్గుముఖం పడుతాయి.

• వేడి ప్యాక్లను ఉపయోగించండి

ఐస్ పాక్ మాత్రమే కాదు వేడి కూడా నొప్పులు మరియు తిమ్మిరిని తగ్గించి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. ఇది గర్భాశయ కండరాలని సడలిస్తుంది, తిమ్మిరి మరియు నొప్పి తగ్గించటానికి సహాయపడుతుంది. మీరు సాధారణ హీటింగ్ పాడ్ ఉపయోగించవచ్చు. కానీ తరచూ, హీటింగ్ ప్యాడ్ అందుబాటులో ఉండకపోవచ్చు లేదా ఒక్కోసారి అసౌకర్యంగా ఉండవచ్చు. కావున కొన్ని నిమిషాలు ముడి బియ్యాన్ని మైక్రోవేవ్ ఓవెన్ లోనికి తీసుకోండి., బియ్యం సౌకర్యవంతమైన వేడిని పొందేలా తనిఖీ చేస్తుండండి. ఒక కాటన్ వస్త్రంలో బియ్యం తీసుకుని కట్టాలి. ఈ వస్త్రాన్ని ఉదరం మీద ఉంచండి. బియ్యం సుమారు 15 నుండి 20 నిముషాలు వరకు వెచ్చగా ఉంటుంది. బియ్యం చల్లబడినప్పుడు, తిరిగి మరలా మైక్రోవేవ్ ఒవెన్లో వేడి చేయండి. ఉపశమనం పొందేదాకా చేయవచ్చు.

• మూలికలను ఉపయోగించండి

మీరు నొప్పి యొక్క ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడటానికి కొన్ని మూలికలను కూడా ఉపయోగించవచ్చు. అల్లం టీ, చామంతి టీ లేదా కొన్ని ఎర్రటి రాస్ప్బెర్రీ టీ వంటివి తీసుకోవచ్చు. ఇవి మీ గర్భాశయ కండరాలకు విశ్రాంతినివ్వడమే కాకుండా , నొప్పి ఉధృతిని తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. శిశువు జన్మించినప్పుడు తిమ్మిరి మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడే మరికొన్ని మూలికలు యారో, మదర్వార్ట్ మరియు క్రామ్ప్ బెరడు.

• వెచ్చని నీళ్ళతో స్నానం

పోస్ట్ ప్రెగ్నెన్సీ నొప్పులు లేదా తిమ్మిరులు తగ్గడానికి వెచ్చని నీటిలో బాత్ టబ్లో స్నానం చేయడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. వేడి నీటి స్నానం మీకు ఉపశమనానికి మరియు మీ గొంతు కండరాల విశ్రాంతికి సహాయం చేస్తుంది. మీకు సిజేరియన్ అయి ఉన్నట్లయితే, స్నానం గురించిన వివరాలకై వైద్యుని సంప్రదించడమే మేలు. స్నానం ఆపరేషన్ వలన కలిగిన గాయాలను కూడా నిరోధిస్తుంది.

• నగ్నంగా ఉండుటకు ప్రయత్నించండి.

మీరు మీ ఇంట సందర్శకులను కలిగి ఉండకపోయినా మీకంటూ ప్రత్యేకమైన ప్రైవసీ ఉన్నట్లుగా మీకు తోచితే, దుస్తులను కాస్త పక్కన పెట్టి రిలాక్స్ అవడం మంచిది. ముఖ్యంగా ఈ వేసవి వేడిలో, ఈ పని మీకు మరింత విశ్రాంతిని కలుగజేస్తుంది. అదే శీతాకాలంలో ఉంటే, కేవలం ఒక వెచ్చని దుప్పటిని మీయందు ఉంచుకోండి. ఈ పద్దతి మీ శరీర మరియు గర్భాశయ కండరాలను సడలిస్తుంది. మరియు మీ శిశువుతో స్కిన్-టూ-స్కిన్ కాంటాక్ట్ ఇవ్వడమే కాకుండా, శిశువుతో బంధాన్ని పెంచుతుంది. క్రమంగా విడుదలయ్యే హాపీ హార్మోన్స్ తిమ్మిరి మరియు నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.

• ఎక్కువ నీళ్లు త్రాగండి

సాధారణ పరిస్థితులలో కూడా, నిర్జలీకరణము(డీహైడ్రేషన్) అనేది కండరాల నొప్పులను కలిగిస్తుంది. మీ గర్భాశయ కండరాలు తిరిగి మామూలు స్థితికి చేరుకోవడానికి నీరు అధికంగా తీసుకోవలసి ఉంటుంది. నీరు పుష్కలంగా త్రాగటం ద్వారా గర్భాశయం తిరిగి మామూలు స్థితికి వచ్చేందుకు సహాయపడగలరు. ఈ అలవాటు శిశువుకి మరిన్ని పాలు అందించడానికి సహాయం చేస్తుంది మరియు కండరాల నొప్పిని కూడా తగ్గించి ఉపశమనాన్ని కలుగజేస్తుంది.

• మూత్ర విసర్జన

మీ మూత్రాశయం మరియు మూత్ర వ్యవస్థ డెలివరీ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. కావున నీరు ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రాశయ పనితీరుని తిరిగి సాధారణ స్థితికి తీసుకుని రావలసిన అవసరం ఎంతైనా ఉంది. మరియు ఎప్పటికప్పుడు మూత్రాశయాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. లేని పక్షాన, ఆ భారం గర్భాశయం మీద కూడా పడుతుంది. క్రమంగా నొప్పి, తిమ్మిరులు పెరుగుతాయి. కనీసం 2 గంటలకు ఒకసారైనా మూత్ర విసర్జన చేసేలా అలవాటు చేసుకోండి. క్రమంగా నొప్పి కూడా తగ్గుముఖం పడుతుంది.

• మీకు మలబద్దకం లేదని నిర్ధారించుకోండి

మలబద్ధకం వలన మీ ప్రేగులలో ఒత్తిడి పెరుగుతుంది. ఇది డెలివరీ తర్వాత తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది. మలబద్ధకం నిరోధించడానికి ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోండి. ఒకవేళ మీరు మలబద్ధక సమస్యలను కలిగి ఉంటే, మీ వైద్యుని సంప్రదించి సూచనలను తీసుకోవడం మంచిది. సరైన పరీక్షల ద్వారా , ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా మలబద్దకాన్ని నిరోదించవచ్చు. మలబద్దకం అనేది గర్భాశయానికే కాకుండా ఇతరములైన అనేక సమస్యలకు కూడా కేంద్ర బిందువు అవుతుంది. ఒక్కోసారి పైల్స్ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

•కడుపు చుట్టూ వస్త్రాన్ని కట్టడం

అనేక ప్రదేశాలలో బెల్లీని వస్త్రంతో కప్పడం అనేది ఒక టెక్నిక్. ఇది ప్రధానంగా కడుపు పెరగకుండా, ముడతల వలన పెద్ద సమస్య కాకుండా నివారించడానికి ఈ పద్దతిని అనుసరిస్తుంటారు. డెలివరీ తర్వాత నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి కూడా సహాయపడుతుంది. ఈ పద్దతి మీ గర్భాశయ కండరాలకు మద్దతునిస్తుంది. ఉత్తమ ఫలితాలకై ఈ పద్దతిని అనుసరించడానికి వైద్యుని సలహా తీసుకోండి.

• మసాజ్

మసాజ్ మిమ్ములను మానసికంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు మీ శరీరం యొక్క కండరాలకు కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. గర్భాశయం మసాజ్ అనేది కొంతమంది నర్సులచే లేదా అనుభవజ్ఞులైన స్పా కేంద్రాలలో జరుపబడుతుంది. గర్భాశయం దాని పూర్వ ఆకారం మరియు పరిమాణాన్ని తిరిగి పొందడానికి ఈ మసాజ్ ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది, కానీ ఇది ఇతర నొప్పులను నిరోధించటానికి సహాయపడుతుంది. ఈ మసాజ్ గడ్డ కట్టిన రక్తాన్ని విడుదల చేస్తుంది మరియు కండరాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ విలువైన అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Ways To Deal With Post-delivery Pains After Multiple Pregnancies

Labor pains do not end abruptly after the birth of your little one. The pains continue for quite sometime after the birth and these pains are called after pains.The after pains happen because the uterus that had expanded immensely during the pregnancy is now trying to slowly shrink back to its original size. Once the baby has vacated your womb, its muscles will try to contract and regain its original form.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more