For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలిచ్చే తల్లులు ఎందుకు ఆల్కహాల్ తీసుకోకూడదు?

|

ఒక బిడ్డను ప్రపంచంలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యత. బిడ్డ పుట్టిన మొదటి నెలల్లో, తనకి పోషణ మొత్తం తల్లి ద్వారానే అందుతుంది. ఆ సమయంలో, తల్లి ఏం తింటుందో అదే బిడ్డకి చేరుతుంది. కానీ తల్లి బాధ్యత ఇక్కడితో ఆగిపోదు. డెలివరీ తర్వాత కూడా తల్లి బిడ్డకి పాలు ఇవ్వటం ద్వారా పోషణ కల్పిస్తుంది. ఈ ప్రక్రియను లాక్టేషన్ అంటారు, అలాగే ఆ తల్లిని పాలిచ్చే తల్లి అంటారు. నిజానికి పిల్లల వైద్యనిపుణులు డెలివరీ తర్వాత మొదటి ఆరునెలలు బిడ్డకి తల్లిపాలు తప్ప మరే ఆహారం అవసరం లేదని సూచిస్తారు.

అయితే తల్లిపాలను పరిశీలిస్తే నుంచి మనందరికీ అర్థమైపోతుంది,తల్లి తీసుకునే ఆహారంలోని పోషకపదార్థాల భాగం తల్లిపాల ద్వారా బిడ్డకి అంది వారికి ఆహారంగా ఉపయోగపడుతుందని. ఆ సమయంలో, తల్లి ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ పోషకపదార్థాలుండే ఆహారం తీసుకోవాలి.

Why Breastfeeding Mothers Should Not Take Alcohol?

సిగరెట్లు, ఆల్కహాల్ కి పూర్తిగా దూరంగా ఉండాలి. నిజానికి, అన్నిటికన్నా పాలిచ్చే తల్లులలో ఆల్కహాల్ తాగటం అన్నిటికన్నా ఎక్కువ అపాయకరమని తేలింది. ఈ ఆర్టికల్ లో పాలిచ్చే తల్లులు ఆల్కహాల్ పానీయాలు ఎందుకు తీసుకోకూడదో వివరించబడింది.

-మొదటి నెలల్లో తల్లిపాలు

-మొదటి నెలల్లో తల్లిపాలు

మానవ బ్రెస్ట్ పాలల్లో అనేక పోషకాలు నిండివుంటాయి. ఫలితంగా మొదటి ఆరునెలల కాలంలో మీ బిడ్డకి ఇంకే ఆహారం అవసరం కూడా ఉండదు. ఈ తల్లిపాలు ఎంత సంపూర్ణమంటే పక్కన మంచినీరు కూడా పట్టించనక్కర్లేదు. పరిశోధనల్లో మొదటి ఆరునెలల వయస్సులో కేవలం తల్లిపాలు తాగిన పిల్లల జీవితంలో తర్వాతకాలంలో చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది.

-పోస్ట్ పార్టమ్లో ఆల్కహాల్ తీసుకోవడం

-పోస్ట్ పార్టమ్లో ఆల్కహాల్ తీసుకోవడం

అధ్యయనాలలో డెలివరీ అయిన తర్వాత మొదటి కొన్నిరోజులలో ( ఈ సమయాన్ని పోస్ట్ పార్టమ్ అంటారు) ఆల్కహాల్ తీసుకోవటం వలన మీ బిడ్డ సహజంగా తీసుకునే తల్లిపాలకన్నా 20% తక్కువ తాగుతాడని తేలింది. బేబీకి తల్లిపాలే ఏకైక ఆహారం కాబట్టి, ఇలా జరగటం వలన వారి ఆరోగ్యంపై దీర్ఘకాలంలో ప్రభావం పడుతుంది.

-తల్లిపాలల్లో ఆల్కహాల్

-తల్లిపాలల్లో ఆల్కహాల్

తల్లి ఏం తీసుకుంటే అది తల్లిపాలల్లోకి చేరుతుంది. పరిశోధనలు తల్లి ఎంత ఆల్కహాల్ తీసుకుంటే అందులో 0.5% నుంచి 3.3% వరకూ తల్లిపాలల్లో చేరుతుందని తెలిపాయి. మీకు 0.5,3.3 సంఖ్యలు చిన్నగానే కన్పించవచ్చు కానీ రెగ్యులర్ గా మద్యం సేవించే తల్లులకి ఇదే నిజం హానికరంగా మారి దీర్ఘకాలంలో వారి పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పరిశోధనలు తల్లిపాలల్లో ఆల్కహాల్ ఉండటం వల్ల పిల్లల్లో తెలివితేటలు తగ్గుతాయని నిరూపించాయి.

-పోషకాల విలువ తగ్గుతుంది

-పోషకాల విలువ తగ్గుతుంది

తల్లిపాలల్లో అవసరమైన ముఖ్యపోషకాలన్నీ ఎంత కావాలో అంతలో ఉంటాయి. అయితే ఇందులో ఆల్కహాల్ భాగం తీసుకుందంటే, మొత్తం మీద పోషకాల విలువలు తగ్గుతాయి. ఇంకా చెడ్డ విషయం, రోజువారీ ఆహారంలో ఆల్కహాల్ ఉండటం వలన ఫోలేట్, ఇతర పోషకాలను పీల్చుకునే శక్తి ఆగిపోతుంది.

-రోగనిరోధక శక్తి తగ్గుతుంది

-రోగనిరోధక శక్తి తగ్గుతుంది

బేబీ గర్భాశయం నుంచి ప్రపంచంలోకి అడుగుపెట్టాక, అది చాలా కఠిన స్థితులను,మార్పులను ఎదుర్కొని జీవించాలి. దానికోసం బేబీకి సరైన రోగనిరోధకశక్తి అవసరం. తల్లి ఇచ్చే పాలల్లోని శక్తి వలనే బేబీలు సూక్ష్మజీవులు,వ్యాధులతో పోరాడి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

-పిల్లల మానసిక వికాసం

-పిల్లల మానసిక వికాసం

మెదడులో ఎక్కువ మోతాదులో ఆల్జహాల్ చేరితే మీ అప్పుడే పుట్టిన బేబీకి జీవితకాల హాని జరగవచ్చు. మొట్టమొదటగా భవిష్యత్తులో వీరికే కాలేయ సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

సరిగ్గా పాలుపట్టకపోవటం, నిద్రపుచ్చడంలో సమస్యలు

సరిగ్గా పాలుపట్టకపోవటం, నిద్రపుచ్చడంలో సమస్యలు

తల్లిపాలల్లో ఆల్కహాల్ ఉండి, అది తాగిన బేబీలు ఎప్పుడూ చిరాగ్గా ఉంటూ, ఎక్కువగా ఏడుస్తుండటం చూడవచ్చు. దీనికి ముఖ్యకారణం ఆ బేబీలు సరిగ్గా నిద్రపోలేరు.ఫలితంగా వారి ఆహారం అలవాట్లు కూడా మారి పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారతాయి.

English summary

Why Breastfeeding Mothers Should Not Take Alcohol?

Post-delivery, the mother nurtures the child with her breast milk. This process is known as lactation and the woman is said to be a lactating mother. The mother must take special care to ensure that she consumes food that is high on nutritional value. She should avoid smoking cigarettes or the consumption of alcohol as it is considered to be the most dangerous
Story first published: Friday, August 3, 2018, 10:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more