గర్భధారణ మరియు ప్రసవ సమయంలో ప్రతి 2 నిమిషాలకు ఒక మహిళ చనిపోతున్నారు: UN నివేదిక

గర్భధారణ మరియు ప్రసవ సమయంలో ప్రతి 2 నిమిషాలకు ఒక మహిళ చనిపోతున్నారు: UN నివేదిక

ప్రతి స్త్రీకి గర్భాధారణ ఒక వరం. అయితే ఆ గర్భమే వారి ప్రాణాల మీదకు తీసుకొస్తే...అవును గర్భాధారణ సమయంలో స్త్రీలు వివిధ రకాల శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకు కారణం మహిళలు గర్భం ధరించిన తర్వాత వారి శరీరంలో జరిగే హార్మోన్ల అసమతుల్యత వల్ల అనేక మార్పులు జరగడం సహజం.

Women die every 2 minutes during pregnancy or childbirth: Know complete Report in telugu

గర్భాధారణ కాలం మొత్తం ఒక ఎత్తు అయితే ప్రసవం మరో ఎత్తు. స్త్రీకి ప్రసవం పునర్జన్మలాంటిది. ఎందుకంటే డెలివరీ సమయంలో వారు తీవ్రమైన బాధను అనుభవిస్తారు. ఆ సమయంలో శరీరం నుండి అధిక రక్తస్రావం జరుగుతుంది. దీని కారణంగా చాలా మంది మహిళలు చనిపోతారు.

ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు గురువారం విడుదల చేసిన ఒక నివేదిక

ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు గురువారం విడుదల చేసిన ఒక నివేదిక

ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రతి రెండు నిముషాలకు ఒక గర్భిణీ మహిళ ప్రసవ సమయంలో చనిపోతున్నట్లు వెల్లడించారు. 'ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ' అనే ఈ నివేదిక ప్రకారం, 2020లో ప్రపంచవ్యాప్తంగా 2,87,000 మంది మహిళలు గర్భాధారణ మరియు ప్రసవానికి సంబంధించిన సమస్యల కారణంగా మరణించారు.

గర్భాధారణ సమయంలో స్త్రీలు మరణించడానికి కారణం

గర్భాధారణ సమయంలో స్త్రీలు మరణించడానికి కారణం

గర్భాధారణ సమయంలో స్త్రీలు మరణించడానికి కారణం, ఆ సమయంలో రక్తస్రావం, హై బిపి, జెస్టేషనల్ డయాబెటిస్, గర్భాధారణ సంబంధిత అంటువ్యాధులు, లోబిపి, అసురక్షితమైన అబార్షన్ తో పాటు హెచ్ ఐవి, ఎయిడ్స్ మరియు మలేరియా వంటి కారణాలు ఉన్నాయని ఈ నివేధిక తెలిపింది.

WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్

WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్

WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనాం ఘెబ్రేయేసస్ అభిప్రాయం ప్రకారం మహిళలందరికీ గర్భాధారణ సానుకూల అనుభవంగా ఉండాలని ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఇది మిలియన్ల మంది మహిళలకు ఒక శాపంగా మారింది. గర్భం పొందిన మహిళల్లో గరిష్ట సంఖ్యలో సరైన ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం. ఒక వేళ ఉన్నా అవి వారికి నాణ్యమైన చికిత్స అందని వారు ఉన్నారు.

ఆరోగ్య సదుపాయాల లోటు

ఆరోగ్య సదుపాయాల లోటు

"ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో మరియు తరువాత ప్రతి స్త్రీ మరియు బాలిక కీలకమైన ఆరోగ్య సేవలను పొందగలరని మరియు వారి పునరుత్పత్తి హక్కులను పూర్తిగా ఉపయోగించుకునేలా చూడాల్సిన అవసరం ఉందని ఈ కొత్త డేటా చూపిస్తుంది" అని ఆమె చెప్పారు.

కమ్యూనిటీ -కేంద్రీకృత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ

కమ్యూనిటీ -కేంద్రీకృత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ

మహిళలు, పిల్లలు మరియు కౌమారదశలో ఉన్న బాలికల అవసరాలను కమ్యూనిటీ -కేంద్రీకృత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం తీర్చగలదు. ఇంకా ప్రసవం తర్వాత పిల్లలకు టీకాలు వేయడం, గర్భాధారణకు ముందు మరియు తర్వాత పోషకాహారన్ని అందివ్వడం మరియు కుంటుంబ నియంత్రణ వంటి అవసరమైన ఆరోగ్య సేవలను కూడా అందివ్వగలరు.

 కోవిడ్ తర్వాత

కోవిడ్ తర్వాత

గర్భం దాల్చిన సమయంలో మరియు ప్రసవ సమయంలో అనేక సమస్యలతో చాలా మంది మహిళలు మరణిస్తున్న మాట వాస్తవమేని, కానీ "గర్భధారణ మరియు ప్రసవ సమయంలో చాలా మంది మహిళలు అనవసరంగా చనిపోవడం ఆమోదయోగ్యం కాదు అని UNFPA ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ నటాలియా కన్మ్ తెలిపారు.

ఒక్క సంవత్సరంలో దాదాపు రెండు లక్షల ఎనభై వేల మందికి పైగా మరణించారు. దానికి తోడు కోవిడ్ 19 కొన్ని సమస్యలను మరియు సంక్లిష్టతలను కూడా పెంచింది. కోవిడ్ సమయంలో చాలా మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. అప్పట్లో తల్లి బిడ్డ మరణాలను నియంత్రించడానికి అన్ని దేశాల వారు ప్రపంచ లక్ష్యాన్ని చేరకోవడానికి నివేదిక సూచించింది.

ప్రసూతి మరణాలను తగ్గించేందుకు, 2030 నాటికి 1 మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళల జీవితాలను ప్రమాదంలో పడకుండా ప్రపంచ లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతిని వేగవంతం చేసేందుకు దేశాలు చర్యలు తీసుకోవాలని నివేదిక సిఫార్సు చేసింది.

Story first published: Friday, February 24, 2023, 13:04 [IST]
Desktop Bottom Promotion