Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గర్భిణీల్లో వెన్నునొప్పి!

వెన్నునొప్పికి కారణాలు పరిశీలిస్తే....
గర్భిణుల్లో వెన్ను నొప్పికి కారణాలు ఎన్ని ఉన్నా ప్రధానమైనవి కొన్ని మాత్రమే. కవటివలయం నుంచి గర్భాశయం వైపుకు పెరుగుతున్న కొద్ది పొట్ట-కవటివలయం ఎముకలు పెల్వస్ బయటకు వచ్చేస్తుంటుంది. ఫలితంగా సైక్రోఐలియాక్ జాయింట్స్‌పై భారంపడుతుంది. ఒక్కొమారు ఇవి బిగుసుకుపోతాయి. ఫలితంగా నొప్పి వస్తుంది. ఈ నొప్పి సాధారణంగా 4 నుంచి 8 నెలల వరకూ ఉంటుంది. దీనివలన ఒకపక్కకు ఒరిగి పడుకుని మరోవైపుకు తిరగాలంటే కష్టమైపోతుంది. ఇండియన్ టాయిలెట్స్‌పై కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కూర్చుని లేచే పనులు చాలా కష్టమవుతాయి. నడక, మెట్లు ఎక్కడం, ఎక్కువ సేపు నిలబడడం సాధ్యంకాదు.
దీనికి నివారణ ఏమిటి...?
ఒకవైపు ఒరిగి పడుకున్నపుడు కాళ్ళ మధ్య తలగడ పెట్టుకుని పడుకోవాలి. దాంతో పైనఉండే కాలు మరింత దగ్గరకు వచ్చి నొప్పి పెట్టకుండా ఉంటుంది. కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్లు వినియోగించకపోవడం మంచిది. పూర్తిగా వీలు కాకపోతే తగ్గించడం మంచిది.
వ్యాయామాలేమిటి...?
గర్భిణీగా ఉన్నపుడు ఎంత హుషారుగా ఉంటే అంత మంచిది. క్రమం తప్పకుండా నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మొదట నిటారుగా పడుకోవాలి. తరువాత రెండుకాళ్ళు ముడుచుకోవాలి. నడుం కింద ఓ చెయ్యి పెట్టుకుని ఒత్తిడి పడేలా నొక్కాలి. అలా ఐదు లెక్కపెట్టి వదలివేయాలి. తరువాత రెండుకాళ్ళు ఒకమారు కుడివైపుకు, మరోమారు ఎడమవైపుకు వంచాలి. దీనివలన కాస్త ఉపశమనం లభిస్తుంది.
నొప్పి రిలీఫ్ పొందాలంటే తేలికైన మసాజ్ మంచిది. అయితే హాట్ బ్యాగ్ వంటివి చేస్తే సత్ఫలితాలనివ్వదు. మందపాటి టవల్ వేణ్ణీళ్ళలో పిండి కాపడం పెట్టాలి. చిన్నపిల్లలకు సేవలు చేసేటప్పుడు కిందకు వంగడం సాధారణం. అందుకు బదులుగా వారినే మంచం, కుర్చీ లేదా ఎత్తయిన ప్రదేశాలలో కూర్చోబెట్టి వంగకుండా ఉంటే బాగుంటుంది.



Click it and Unblock the Notifications
