Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బిడ్డ పుట్టడంలో తల్లికిగల ఆరోగ్య సమస్యలు!

కడుపులో బిడ్డ అడ్డం తిరగటం - నార్మల్ డెలివరీలో బేబీ తల కిందకు, ముఖం తల్లి వీపు వైపు పెట్టి వుంటుంది. ఈ పొజిషన్ లో ఏదనా మార్పు వస్తే వైద్య సహాయం అత్యవసరం. సుఖ ప్రసవానికిగాను కొన్ని మార్లు సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది.
డెలివరీ నొప్పులు ఎక్కువ కాలం పట్టడం - డెలివరీలో తల్లి కనుక కాన్పు నొప్పులు అధికసమయం పడితే అది బేబీకి తల్లికి కూడా హాని కలిగిస్తుంది. అటువంటపుడు ఇతర పద్ధతులలో డెలివరీ చేస్తారు.
బిడ్డ ముందస్తుగానేపుట్టడం - కొన్ని మార్లు తల్లి తన 37వ వారంలోనే నొప్పులు పడుతుంది. తల్లి ఆరోగ్యానికి సమస్య అనుకుంటే డాక్టర్లు వారంతటవారే సూచించి బిడ్డ ఎదగకుండానే కూడా డెలివరీ చేస్తారు. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు, జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
హెమరేజ్- ఈ పరిస్దితిలో బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి అధిక రక్తం బయటకు పోయి తీవ్ర సమస్య ఏర్పడుతుంది. తల్లి షాక్ పొందటం లేదా ఆమెలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవటం లేదా సరిగా వైద్య సహాయం అందకపోతే మరణించడం కూడా జరుగుతుంది.
బొడ్డుతాడు జారిపోవుట- బేబీ తల్లి కటి ప్రదేశానికిచేరకపోయినా లేక కటి ప్రదేశానికిచేరేముందు బిడ్డ సంచి తెగిపోయినా ప్రమాదమే. అటువంటపుడు వైద్య సహాయం తప్పక అవసరమవుతుంది. వెంటనే తల్లి పిరుదులను పైకి లేపి నేలపై పరుండాలి. ఈ పొజిషన్ బేబీ బొడ్డుతాడును కట్ చేయకుండా చేస్తుంది. ఈపరిస్ధితిలో సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిందే.
బొడ్డుతాడు చిన్నదైపోవుట - బేబీ తల్లి గర్భంలో ఎపుడూ తిరుగుతూ వుంటుంది. ఆ సమయంలో తన మెడకు బొడ్డు తాడు చుట్టుకునే ప్రమాదం వుంది. ఇదే జరిగితే బేబీకి ఆక్సిజన్ సరఫరా వుండదు. కొన్ని కేసులలో తల్లికి సిజేరియన్ కు ముందుగా అదనపు ఆక్సిజన్ పెట్టాల్సి వుంటుంది.
ఇవన్నీ తల్లులు బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో ఎదుర్కొనే కొన్ని ప్రధాన సమస్యలు. కనుక గర్భవతి నెలలు నిండిన వెంటనే సమస్యలనుండి బయటపడటానికి, తేలికగా డెలివరీ చేయటానికి సరైన వైద్యుని పర్యవేక్షణలో వుండటం అత్యవసరం.



Click it and Unblock the Notifications