For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిడ్డ పుట్టడంలో తల్లికిగల ఆరోగ్య సమస్యలు!

By B N Sharma
|

Birth Complications: Know More About Them
ఒక మహిళ జీవితంలో బిడ్డ పుట్టడమనేది ఎంతో గుర్తుండిపోయే క్షణాలు. అంతా సవ్యంగా జరిగితే చాలా ఆనందంగా వుంటుంది. సరి అయిన మెడికల్ పర్యవేక్షణ లేకుంటే బిడ్డ పుట్టేటపుడు గల గర్భవతి సమస్యలు ఎన్నో తీవ్ర అవాంతరాలకు గురిచేస్తాయి. బిడ్డ పుట్టే సమయంలో తల్లి అనేక కారణాలుగా సమస్యలను ఎదుర్కొంటుంది. అది రేడియేషన్, టాక్సన్, లేట్ ప్రెగ్నన్సీ లేదా అనారోగ్యకర జీవన విధానాం, ఏదైనా కావచ్చు. మరణాంతకంగాను, తీవ్రంగా వుండేకొన్ని సమస్యలను పరిశీలిద్దాం!

కడుపులో బిడ్డ అడ్డం తిరగటం - నార్మల్ డెలివరీలో బేబీ తల కిందకు, ముఖం తల్లి వీపు వైపు పెట్టి వుంటుంది. ఈ పొజిషన్ లో ఏదనా మార్పు వస్తే వైద్య సహాయం అత్యవసరం. సుఖ ప్రసవానికిగాను కొన్ని మార్లు సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది.

డెలివరీ నొప్పులు ఎక్కువ కాలం పట్టడం - డెలివరీలో తల్లి కనుక కాన్పు నొప్పులు అధికసమయం పడితే అది బేబీకి తల్లికి కూడా హాని కలిగిస్తుంది. అటువంటపుడు ఇతర పద్ధతులలో డెలివరీ చేస్తారు.

బిడ్డ ముందస్తుగానేపుట్టడం - కొన్ని మార్లు తల్లి తన 37వ వారంలోనే నొప్పులు పడుతుంది. తల్లి ఆరోగ్యానికి సమస్య అనుకుంటే డాక్టర్లు వారంతటవారే సూచించి బిడ్డ ఎదగకుండానే కూడా డెలివరీ చేస్తారు. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు, జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

హెమరేజ్- ఈ పరిస్దితిలో బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి అధిక రక్తం బయటకు పోయి తీవ్ర సమస్య ఏర్పడుతుంది. తల్లి షాక్ పొందటం లేదా ఆమెలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవటం లేదా సరిగా వైద్య సహాయం అందకపోతే మరణించడం కూడా జరుగుతుంది.

బొడ్డుతాడు జారిపోవుట- బేబీ తల్లి కటి ప్రదేశానికిచేరకపోయినా లేక కటి ప్రదేశానికిచేరేముందు బిడ్డ సంచి తెగిపోయినా ప్రమాదమే. అటువంటపుడు వైద్య సహాయం తప్పక అవసరమవుతుంది. వెంటనే తల్లి పిరుదులను పైకి లేపి నేలపై పరుండాలి. ఈ పొజిషన్ బేబీ బొడ్డుతాడును కట్ చేయకుండా చేస్తుంది. ఈపరిస్ధితిలో సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిందే.

బొడ్డుతాడు చిన్నదైపోవుట - బేబీ తల్లి గర్భంలో ఎపుడూ తిరుగుతూ వుంటుంది. ఆ సమయంలో తన మెడకు బొడ్డు తాడు చుట్టుకునే ప్రమాదం వుంది. ఇదే జరిగితే బేబీకి ఆక్సిజన్ సరఫరా వుండదు. కొన్ని కేసులలో తల్లికి సిజేరియన్ కు ముందుగా అదనపు ఆక్సిజన్ పెట్టాల్సి వుంటుంది.

ఇవన్నీ తల్లులు బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో ఎదుర్కొనే కొన్ని ప్రధాన సమస్యలు. కనుక గర్భవతి నెలలు నిండిన వెంటనే సమస్యలనుండి బయటపడటానికి, తేలికగా డెలివరీ చేయటానికి సరైన వైద్యుని పర్యవేక్షణలో వుండటం అత్యవసరం.

English summary

Birth Complications: Know More About Them | బిడ్డ పుట్టడంలో తల్లికిగల ఆరోగ్య సమస్యలు!

These are some of the birth complications that mothers face during childbirth. It is always advised to keep in touch with your doctor, during the final stages of gestation, to avoid any of the above birth complications.
Story first published:Friday, September 30, 2011, 15:05 [IST]
Desktop Bottom Promotion