For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో స్తనాల మార్పులు, జాగ్రత్తలు!

By B N Sharma
|

Breast Care And Changes During Pregnancy
గర్భవతి అవ్వాలంటే మహిళలు ఎంతో భయపడతారు. ప్రత్యేకించి వారి శరీర రూపం, స్తనాల సైజులు మారుతాయని వర్రీ అవుతారు. ఎంత మంచి బ్రాసరీస్ వేసినప్పటికి స్తనాలు లూజుగానే వుంటాయి. ఆకారాన్ని కోల్పోతాయి. ఈ సమయంలో స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు చూద్దాం...

1. స్తనాలు లూజు అవుతున్నాయంటే దానికి కారణం తల్లిపాలు పట్టటమేననుకుంటారు. కాని అది వాస్తవం కాదు. తల్లిపాలు పట్టటం వలన స్తనాలు వాటి ఒరిజినల్ సైజుకు, షేపుకు వస్తాయి. తల్లిపాలివ్వటమనేది తాత్కాలిక చర్యగా మహిళలు తెలుసుకోవాలి.

2. ప్రెగ్నెన్సీకి గుర్తు స్తనాల ఆకారంలో మార్పు రావటం. చిన్నపాటి స్తనాలున్న మహిళలు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత స్తనాలు సహజంగాను, సాధారణంగాను వుంటాయి కనుక వర్రీ అవనవసరం లేదు.

3. ప్రెగ్నెన్సీ సమయంలో స్తనాలలో వచ్చే మార్పులను ఎవరూ ఆపలేరు. సైజులో పెద్దవైన స్తనాలు పాలను పట్టడంతో ఒరిజినల్ సైజుకు రాగలవు. కనుక తన బిడ్డకు ఎంత బాగా పాలు పడితే అంత త్వరగా స్తనాలు పూర్వపు సైజుకు వస్తాయని మహిళ గ్రహించాలి.

4. స్తనాలపై గుర్తులు పడకుండా వుండాలంటే మహిళలు సరియైన బ్రా వాడాలి. అధికమైన టైట్ లేదా లూజ్ వుండి అసౌకర్యం కలిగించరాదు. చక్కగా ఫిట్ అయే బ్రా ఎటువంటి గుర్తులను కలిగించదు. ఎక్కువగా సాగే బ్రాలు స్తనాలను వేలాడేలా చేస్తాయి.

5. స్తనాలను విటమిన్ ఆయిల్ తో మాసేజ్ చేయటం స్ట్రెచ్ మార్కులను తగ్గిస్తుంది. పూర్వపు స్ధితికి రావాలంటే, మార్కెట్ లో దొరికే జల్ లేదా ఇతర క్రీములు కూడా రాయవచ్చు.

English summary

Breast Care And Changes During Pregnancy | ప్రెగ్నెన్సీ సమయంలో స్తనాల మార్పులు, జాగ్రత్తలు!

Massaging breasts during pregnancy with vitamin oil will nourish the breasts and avoid stretch marks. You even get toning gels and creams that can be applied to regain the shape of the breasts.
Story first published:Saturday, September 17, 2011, 14:31 [IST]
Desktop Bottom Promotion