Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
గర్భిణీ స్త్రీ కాళ్ళ వాపుకు కారణాలు, నివారణలు!

కాళ్లు ఎందుకా వాపు చూసిస్తాయి?
వైద్య భాషలో దీనిని ఎడిమా అంటారు. శరీరం అధిక నీటిని రక్తాన్ని ప్రెగ్నెన్సీ సమయంలో పిండం ఎదుగుదలకు ఉత్పత్తి చేస్తుంది. మీ బేబీ కడుపులోని నీటిలో తేలియాడుతూ వుంటుంది. ఈ అదనపు నీరు అంతా ఎక్కడికో అక్కడికి పోవాలి కనుక అది శరీరం కిందిభాగమైన కాళ్ళలోకి చేరిపోతుంది.
పొట్ట పెరుగుతూంటే, దిగువ భాగం శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తసరఫరా నిమ్మదిస్తుంది. గర్భిణీకి మూడవ త్రైమాసికంలో కాళ్ళు, చేతులు వాపురావటం అధికంగా వుండి అసౌకర్యాన్ని కలుగజేస్తుంది.
దీనినుండి రిలీఫ్ పొందటమెలా?
హై హీల్స్, బూట్లు వేయవద్దు. సాగేటి పల్చని చెప్పులు వేయండి. కాళ్ళను ఎపుడు పైకి పెట్టగలిగితే అపుడు పైన పెడుతూ కూర్చోండి. పనిలో కష్టమే. కాని పరిస్ధితి అటువంటిది. కాళ్ళు పైకి పెట్టేందుకై చిన్నపాటి ఎత్తున్న బల్ల లేదా స్టూలు వుంచుకోండి. అధిక రక్తం కాళ్ళవైపుకు రాకుండా వుంటుంది.
ఎక్కువ సేపు నిలబడి వుండకండి. నిలబడితో రక్తం కిందకు ప్రవహిస్తూంటుంది. కాళ్ళ వాపులు తగ్గాలంటే, ఆహార పరంగా పొటాషియం అధికంగాను, సోడియం తక్కువగాను వున్న పదార్ధాలు తినాలి. పదార్ధాలలో ఉప్పు బాగా తగ్గించండి. ఉప్పుకు నీటిని నిలువ చేసే గుణం వుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం కూడా మంచిదే. దిగువ శరీరంలోని ప్రధాన రక్త నాళాలు లావెక్కిన మీ శరీరానికి కొంత సౌఖ్యాన్నిస్తాయి.
ఆధునికంగా, గర్భవతుల పాదాలకు టైట్ గా వుండే సాక్స్ వస్తున్నాయి. వాటిని ఉదయం నుండే ధరించి వుంటే కాలి కణాలకు అనవసరమైన ద్రవాలు చేరకుండా వుంటాయి. గర్భవతిగా వున్నపుడు కాళ్ళు కొంతమేర లావుగా ఉబ్బటం సహజమే. అయితే సమస్య తీవ్రంగా వుంటే, ఉబ్బటమనేది ముఖానికి, చేతులకు కూడా చేరితే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.



Click it and Unblock the Notifications