Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
గర్భవతుల కాళ్ళ వాపు నివారణ!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

కారణాలు పరిశీలిస్తే...దీనిని వైద్య భాషలో ఎడీమా అంటారు. కడుపులో వున్న బిడ్డ కొరకు శరీరం నీరు, రక్తం అధికంగా తయారు చేస్తుంది. అది ద్రవ పదార్ధం కనుక సాధారణంగా శరీరంలోని చివరి భాగాలైన కాళ్ళ భాగానికి చేరుతూంటుంది. గర్భాశయం పెరగటం ద్వారా ఒత్తిడి కలిగి శరీర కింది భాగంలోకి ప్రవహిస్తుంది. కాళ్ళు, మడమలు ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో చాలా బాధ కలిగిస్తాయి. ఈ వాపులు, నొప్పులనుండి ఉపశమనం కలగాలంటే...గర్భవతి పలుచని, సాగేటి చెప్పులు ధరించాలి. ఎపుడు వీలైతే అపుడు మీ కాళ్ళను ఎత్తుమీద పెట్టి కూర్చోవాలి. పనిలో కష్టమే కాని మీ పరిస్ధితి అటువంటిది. కనుక సందేహించకండి. ఎత్తైన స్టూలు లేదా కుషన్ లేదా టేబుల్ వంటి వాటిపై కాళ్ళను చాపి ఎత్తులో వుంచండి. ఎక్కువసేపు నిలబడి వుండకండి. నిలబడి వుంటే, రక్తం దిగువ భాగానికి ప్రసరిస్తుంది.
పొటాషియం అధికంగాను, సోడియం తక్కువగాను వుండే ఆహారాలు తీసుకోవాలి. ఉప్పు చాలా వరకు తగ్గించాలి. మీకు ఎడమ చేతివైపుకు తిరిగి పడుకుంటే కొంత రిలీఫ్ కలుగుతుంది. గర్భవతుల కాళ్ళకు అమ్మే సాక్స్ కొని వేసుకోండి. ఇవి ఉదయం నుండి సాయంత్రం వరకు వేసుకుని వుంటే కొంత ఊరట కలుగుతుంది. శరీర భాగాలు గర్భవతులకు కొంత మేరకు వాపు రావటం సహజమే. అయితే, ఈ వాపు మరీ అధికమై, ముఖానికి, చేతులకు కూడా వ్యాపిస్తే తక్షణమే డాక్టర్ ను సంప్రదించండి.
Comments
Read more about: pregnancy and parenting prenatal feet swelling ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ కాళ్ళ వాపు
English summary
Causes For Feet Swelling During Pregnancy | గర్భవతుల కాళ్ళ వాపు నివారణ!
Story first published: Tuesday, October 25, 2011, 10:09 [IST]
Other articles published on Oct 25, 2011



Click it and Unblock the Notifications