For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవానంతరం మహిళలలో పోషకాహార లేమి!

By B N Sharma
|

Causes Of Post-Natal Malnutrition Among Women
బిడ్డ పుట్టిన తర్వాత మహిళలలో పోషకాహార కొరత అధికంగా చూడబడుతోంది. దీనికి కారణం మహిళల అశ్రద్ధ. మహిళలు తమ శ్రధ్ధ అంతా పుట్టిన బిడ్డపైనే అధికంగా చూపుతూ తమ శరీర అవసరాలను కూడా వాయిదా వేస్తుంటారు. అయితే దీని ప్రభావం వారిపైనే కాక బిడ్డ తీసుకునే ఆహారంపై కూడా వుంటుందని వారు గ్రహించాలి.

బిడ్డకు పాలు పట్టే తల్లులు ప్రధానంగా తాము తీసుకునే ఆహార పరిమాణాన్ని పెంచాలి. కనీసం ప్రతిరోజూ 1000 కేలరీలు అధికంగా తీసుకోవాలి. వీరికి సరి అయిన మార్గదర్శకత్వం లోపించటంతో తగినంత ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. పోషకాహార లేమి కారణంగా డీహైడ్రేషన్, విటమిన్లు, మినరల్స్ కొరత, తీవ్ర రక్తహీనత కూడా కలుగుతోంది. వీటిని ప్రసవానంతర పోషక లేమి అంటారు.

బిడ్డ పుట్టిన ఆరు నెలలవరకు మహిళలు తమకు ఇవ్వబడిన విటమిన్లను తీసుకుంటూనే వుండాలి. బిడ్డ పుట్టిన తర్వాత మహిళ సరి అయిన సహకారం లేక డిప్రెషన్ కు గురవుతోంది. ఈ కారణంగా సరి అయిన ఆహారం తీసుకోలేకపోతోంది.

ప్రెగ్నెన్సీ తర్వాత సాధారణంగా మహిళలందరూ బరువు పెరుగుతారు. డెలివరీ అయిన తర్వాత వీరు తమ పూర్వపు శరీర రూపం కొరకు డైటింగ్ లు కూడా చేస్తూంటారు. అయితే, కొత్తగా తల్లులైనవారు. ఏ డైటింగ్ లేకుండానే క్రమేణా 4 నుండి 5 కేజీల బరువు తగ్గే అవకాశం వుంది. కనుక వారు ప్రత్యేకించి డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు.

బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డపై శ్రధ్ధతో తల్లులు నిద్ర కూడా సరిగాపోరు. దీని ప్రభావం కూడా వీరి ఆరోగ్యంపై పడుతుంది. సరి అయిన నిద్ర లేకుంటే శరీరం తగిన పోషకాలను గ్రహించలేదు. దీనికి గాను పరిష్కారంగా బేబీ ఎపుడు నిద్రిస్తే తల్లులు కూడా అదే సమయంలో మంచి నిద్రపోవాలి.

డెలివరీ తర్వాత పోషకాహార లేమి లేకుండా వుండాలంటే కొత్త తల్లులు చక్కని ఆహార, నిద్ర ప్రణాళికలు కలిగి వుండాలి. దీనికిగాను డాక్టర్ ను లేదా మంచి పోషకాహార నిపుణులను అవసరమైతే సంప్రదించాలి. బిడ్డ పుటుక ముందు తర్వాత కూడా మంచి ఆహారం, నిద్రలనేవి శరీర పోషణలో ప్రధాన అంశాలుగా తల్లులు గుర్తించాలి.

English summary

Causes Of Post-Natal Malnutrition Among Women | ప్రసవానంతరం మహిళలలో పోషకాహార లేమి!

If you have to avoid postpartum malnutrition then you must follow a diet planned either by your doctor or a nutritionist. Malnutrition during pregnancy can also trigger postnatal malnutrition symptoms. So it is important to eat well and follow a diet before and after child birth
Story first published:Tuesday, September 13, 2011, 16:56 [IST]
Desktop Bottom Promotion