Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గర్భిణీ స్త్రీకి రెండో త్రైమాసిక మార్పులు!

కళ్ళు బైర్లు కమ్మటం: రక్తనాళాలు పెద్దవై పూర్తిగా రక్తంతో నిండి వుంటాయి. బ్లడ్ లెవెల్ పడటంతో కొంత అలసట, కళ్ళు తిరగటం మొదలైనవి వుంటాయి. ఈ సమయంలో వీలైనంత అధికంగా ద్రవపదార్ధాలు తీసుకోండి పడుకున్నా, కూర్చున్నా లేచేటపుడు మెల్లగా లేవండి. కళ్ళు మైకంగా వుంటే వీలైనంత మేరకు ఎడమవైపుకు తిరిగి సరి అయిన బ్లడ్ సర్కులేషన్కు సహకరించండి.
చిగుళ్ళు, ముక్కు: బ్రష్ చేసేటపుడు నోటిలోని చిగుళ్లు, పళ్ళు కొద్దిపాటి రక్తాన్ని స్రవించవచ్చు. మెత్తటి బ్రష్ వాడండి. రక్తం అధికంగా రక్తనాళాలలో ప్రవహిస్తుండటం వలన గురక, ముక్కు దిబ్బడ, లేదా ముక్కులోంచి రక్తం రావటం కూడా జరగవచ్చు.
చర్మం: బ్లడ్ సర్కు లేషన్ అధికంగా వుండటంతో చర్మం కొంచెం రంగు మారుతుంది. చనుమునలు, ముఖంలో కొన్ని భాగాలు బొడ్డు నుండి జననాంగ ఎముక వరకు రంగు మారే అవకాశం వుంది. ఎండ తగిలితే మరింత మంటగా వుంటుంది. బయటకు వెళ్ళేటపుడు చర్మానికి సన్ లోషన్ రాసుకుని వెళ్ళడం మంచిది.
స్ట్రెచ్ మార్కులు: ప్రెగ్నెన్సీ లో ఈ సమస్య అందరకు వుండేదే. పింక్, రెడ్ లేదా ఊదా రంగులో పొట్ట, పాలిండ్లు లేదా చేతుల పైభాగం, పిరుదులు, తొడలు మొదలైనవి వుంటాయి. చర్మం సాగటం వల్ల కొంత ఇరిటేషన్ వుంటుంది. ఏవైనా క్రీములు రాయండి. స్ట్రెచ్ మార్కులు పోవటానికి కొన్ని సహజ పద్ధతులు ఆచరించండి.
జననాంగ ద్రవాలు:ఈ రెండో దశ ప్రెగ్నెన్సీలో జననాంగం నుండి కొద్దిపాటి తెల్లటి ద్రవం బయటకు వస్తూంటుంది. ఈ ద్రవం భరించలేని వాసన వస్తే వైద్యుడిని సంప్రదించండి. అశ్రద్ధ చేస్తే జననాంగం ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం వుంది.
ఇవన్నీ సాధారణంగా ప్రెగ్నెన్సీ రెండో దశలో మహిళ శరీరంలో వచ్చే మార్పులు. ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు ఎప్పటికపుడు చూపాల్సిన అవసరం వుంది.



Click it and Unblock the Notifications