For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భవతి ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ప్రాధాన్యత!

By B N Sharma
|

Folic Acid
గర్భవతి అవగానే ఫోలిక్ యాసిడ్ అధికంగా వుండే ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ తల్లికి పుట్టబోయే బిడ్డకు మొదటి త్రైమాసికంలో అత్యవసరం. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏమిటి? అని తెలుసుకుంటే, గర్భవతులకు దాని పాత్ర ఎంత అనేది తేలికగా గ్రహించవచ్చు. ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒక భాగం. దీనినే విటమిన్ బి 9 అని కూడా అంటారు. శరీరంలో కణాల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. పాత కణాలను పునరుజ్జీవిస్తుంది. కనుక ప్రెగ్నెన్సీలో దాని పాత్ర ప్రధానమైంది. ప్రెగ్నెన్సీలో పునరుజ్జీవ కణాలు పది రెట్లుగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాలను పుట్టిస్తుంది. అంతే కాక నరాలకవసరమైన సెరోటోనిన్ కూడా ఇస్తుంది.

డాక్టర్లు గర్భవతులు ఒక సంవత్సరం ముందుగానే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సలహా ఇస్తారు. తర్వాతి దశలలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం పెరగాలే గాని తగ్గరాదు.

1. ఫోలిక్ యాసిడ్,కొవ్వు వంటిది కాదు. శరీరం ఫోలిక్ యాసిడ్ ను నిలువచేసుకోలేదు. శరీరంలో అది కొవ్వు వలే నిలువ వుండదు.

2. ప్రెగ్నెన్సీలో బిడ్డ ప్రతి రోజూ ఎదిగిపోవటంతో అధిక కణాలు అవసరమవుతాయి. అంటే తల్లి శరీరం కొత్త కణాలను గతంలో కంటే వేగంగా ఉత్పత్తి చేసి దానికి అందించాలి. కనుక గర్భం దాల్చిన తర్వాత కణాలు అభివృద్ధి చెందాలంటే ఫోలిక్ యాసిడ్ అత్యవసరం.

3. ఫోలిక్ యాసిడ్ విషయంలో ఓవర్ డోసు లేదా తక్కువ డోసు అంటూ ఏమీ లేదు. సైడ్ ఎఫెక్ట్ అసలే వుండదు. అధికంగా తీసుకుంటే నీటిలో కరిగి శరీరంనుండి విసర్జించబడుతుంది. కనుక ఎంత పరిమాణం తీసుకున్నా పరవాలేదు.

ఫోలిక్ యాసిడ్ సరిగా సరఫరా కాకుంటే పుట్టబోయే బిడ్డకు కొన్ని సమస్యలు వస్తాయి. అవేమిటో చూద్దాం--
ఫోలిక్ యాసిడ్ కొరవడితే, బేబీలోని న్యూరల్ ట్యూబ్ దెబ్బతింటుంది. అది నరాల వ్యవస్ధను బలహీన పరుస్తుంది. దీనితో బేబీ కి కాళ్ళకు పాక్షికంగా పెరాలసిస్ వచ్చే ప్రమాదం వుంది. బేబీకి బౌల్ కదలికలు కూడా సరిగా వుండవు. బేబీ వెన్నెముక సరిగా పెరగదు. ఫోలిక్ యాసిడ్ తగ్గితే, బేబీ పూర్తి ఎదుగుదల లేకుండా త్వరగా పుట్టే అవకాశం వుంది. ఫోలిక్ యాసిడ్ పచ్చని ఆకు కూరలలో వుంటుంది. లేదంటే డైటరీ సప్లిమెంట్లలో కూడా శరీరానికి అందించవచ్చు.

English summary

Folic Acid Be Mandatory After Conception | గర్భవతి ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ప్రాధాన్యత!

Deficiency of folic acid causes Neural Tube Defect in the baby. It a defect of the nervous system that can lead to partial or total paralysis of the legs. It can also cause inability to control bowel movements in the child. With folic acid during pregnancy, the baby's spinal cord does not develop to perfection. It gives rise to a condition called 'open spinal cord' or 'spina bifda'.
Story first published:Thursday, September 29, 2011, 14:26 [IST]
Desktop Bottom Promotion