Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గర్భవతుల వికారానికి ఇంటి చికిత్సలు!

అల్లం: ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వికారాన్ని తగ్గించుకోడానికి అల్లం మంచి ఔషధం. అల్లం కషాయంగాను లేదా టీలో కలుపుకొని తాగితే వికారం తగ్గుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అల్లాన్ని కషాయంగా చేసి అందులో పంచదార, నిమ్మరసం కలిపి వేడిగా లేదంటే చల్లగాను తాగవచ్చు.
నిమ్మ కాయ: ప్రెగ్నెంట్ అయినపుడు వికారాన్ని పోగొట్టుకోవాలంటే నిమ్మకాయను పిండి వాసన చూసినా, నిమ్మరసం తాగినా కొంత ఊరట కలుగుతుంది.
కొద్ది కొద్దిగా తినండి: ప్రతి రోజూ మూడు సార్లు తినాలనేది మరచిపొండి. పొట్ట ఖాళీగా వుంటే...వికారం మరింత పెరుగుతుంది. కొద్ది కొద్దిగా తింటూ తిన్నది జీర్ణం అయేలా చూసుకోండి.
విటమిన్ బి6: మీరు తీసుకునే విటమిన్లలో విటమిన్ బి 6 జత చేయండి. విటమిన్ బి 6 వికారాన్ని తగ్గిస్తుందని పరిశోధనలలో తేలింది. పచ్చి బఠాణీలు, మెంతులు, సోయాబీన్స్, చికెన్ మొదలైన వాటిలో బి 6 అధికంగా వుంటుంది.
పెప్పర్ మింట్ టీ: గర్భవతుల వికారం తగ్గించేందుకు ఇది మరో పరిష్కారం. సురక్షితమైంది కూడాను. మింట్ తీసుకునే ఏ తిండి పదార్ధమైనా సరే వికారాన్ని తగ్గించి తక్షణ ఊరట కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications